విద్యార్థుల జీవితాలతో చలగాటమా

నిజామాబాద్‌, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని విజయ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ అడ్వాన్స్‌ సప్లమెంటరీ ఆర్‌-15, ఆర్‌-16, ఆర్‌-18 1వ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించకపోవటంపై నిజామాబాద్‌ ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి భాను ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ నగరంలో విజయ రూరల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిరసన వ్యక్తం చేసి కళాశాల ప్రిన్సిపాల్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరధ బట్టు వేణు రాజ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దత్తాద్రి మాట్లాడారు.

జెఎన్‌టియూహెచ్‌ అడ్వాన్సుడ్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బీటెక్‌ పరీక్ష ఫలితాలు వెలువడి నెలరోజులు గడుస్తున్నా అడ్వాన్సుడ్‌ సప్లమెంటరీ పరీక్షా తేదీలను ఇప్పటివరకు ప్రకటించలేదని గతంలో ఫలితాలు వచ్చిన 15 రోజుల్లోనే పరీక్ష తేదీలను ప్రకటించేవారు, కానీ ఈసారి నెలరోజులు కావస్తున్నా ఇంకా పరీక్ష తేదీలను ప్రకటించలేదని దీనివల్ల కొన్ని వేల మంది విద్యార్థులు తమ భవిషత్తుని కోల్పోవాల్సి ఉంటుందన్నారు.

కావున ప్రభుత్వం మరియు జెఎన్‌టీయూహెచ్‌ తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని అలాగే డిటెండ్‌ మరియు క్రెడిట్‌ సిస్టమ్‌లో లోపల వల్ల కూడా చాలా మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనిని కూడా పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రిషి, వేదమిత్ర, నాయకులు ఫాని, ముడస్సిర్‌, కాహాలీఫాన్‌, జాక్రియా, అదనం, జోహెబ్‌ సమీర్‌, అఖిఫ్‌ఉద్దీన్‌, ఫాని రాజు విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *