Daily Archives: July 18, 2019

తక్కువ నీటితో ఎక్కువ పంట వచ్చేలా చూడాలి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జల వనరులను సద్వినియోగం చేసుకొని తక్కువ నీటితో ఎక్కువ పంట రాబడి వచ్చేలా రైతులు తమ పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ రైతులను కోరారు. జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం బీబీపేట మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయశాఖ, కృషి విజ్ఞాన్‌ కేంద్రం రుద్రూర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్‌ మేళ రైతు అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్‌ బాలూ నాయక్‌, ...

Read More »

పెద్దగుజ్జుల్‌ తాండాలో ఆరోగ్య శిబిరం

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పెద్ద గుజ్జుల్‌ తాండాలో ప్రజలు అనారోగ్య సమస్యతో బాధపడుతుండడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశానుసారం గురువారం డాక్టర్‌ శోభారాణి నేతృత్వంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ హరిప్రసాద్‌, పారామెడికల్‌ సిబ్బంది తాండాలోని ప్రతి ఇంటిని సందర్శించి అక్కడి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించారు. 124 మందికి చికిత్సలు చేశారు. ఇందులో ఐదుగురు మూత్రపిండ వ్యాధులు, ఇద్దరు క్యాన్సర్‌, నలుగురు కిడ్నిలో ...

Read More »

మృతుని కుటుంబానికి చెక్కు పంపిణీ

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం చిట్యాల గ్రామ విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ న్యాడం రాజు మార్చి 23వ తేదీన ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అదికారి ఆదేశాల మేరకు ప్రబుత్వ నిబందనలను అనుసరించి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం తన చాంబర్‌లో మృతుని భార్య లలితకు ఎక్స్‌గ్రేషియా కింద విడుదలైన పదిలక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, సిబ్బంది ఉన్నారు.

Read More »

మునిసిపల్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న మునిసిపల్‌ చట్టం 2019 ని అనుసరించి మునిసిపాలిటిల వారిగా ఎన్నికలను క్రమపద్దతిలో సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. గురువారం జనహితలో మునిసిపల్‌ ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నోటిఫికేషన్‌ తేది నుంచి ఎన్నికల అదికారులు రోజువారిగా అందిన నామినేషన్‌, అఫిడవిట్‌ వివరాలను పబ్లికేషన్‌ చేయాలన్నారు. నామినేషన్‌ తిరస్కరిస్తే వాటికి గల కారణాలను రికార్డు చేయాలని చెప్పారు. పోటీ ...

Read More »

ఏఐఎస్‌ఎఫ్‌ రాస్తారోకో

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ అద్వర్యంలో ఎలారెడ్డి మండల కేంద్రంలో ప్రేవేట్‌ యూనివర్సిటీలో నియామకపు ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నాయకులు విద్యార్థులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్బంగా జిల్లా నాయకులు కుంచాల గణేష్‌ మాట్లాడుతూ ప్రేవేట్‌ యూనివర్సిటీలలో ప్రభుత్వం నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తుందని వెంటనే నియామకపు ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రేవేటు యూనివర్సిటీల మోజులో పడిందని, ఈపాటికే ...

Read More »

గ్రామ సమస్యలు పరిష్కరించండి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగాపూర్‌ గ్రామ తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య పరిస్కారం గురించి కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత వారం రోజులుగా గ్రామములో ఒక్క నీటి చుక్క కూడా రాలేదని, వారం రోజుల నుండి మున్సిపల్‌ అధీకారులను సంప్రదించినా తాత్కాలిక పరిష్కారం కూడా చూపలేదని, బోరు కిరాయి తీసుకున్న యజమానికి 3 నెలల నుండి బిల్లు చెల్లించలేదని, మోటరు కాలిపోతే రిపేర్‌లకు కూడా డబ్బులు ...

Read More »

శారదమాత ఆలయంలో పూజలు

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం తూర్పు హౌసింగ్‌ బోర్డు కాలనీ శ్రీశారదా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రగ్రహణం పూర్తయిన నేపథ్యంలో ఆలయ సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారిని అలంకరించి హారతి, తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు ఉన్నారు.

Read More »

ఎస్సైగా ఎంపికైన యువకుడిని సన్మానించిన తహసీల్దార్‌

రెంజల్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం కళ్యాపూర్‌ గ్రామానికి చెందిన అమాంద్‌ అరవింద్‌ అనే యువకుడు ఎస్సైగా ఎంపికవ్వడంతో తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని యువకులు అందరూ అరవింద్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అతి చిన్న వయస్సులోనే ఎస్సైగా ఎంపికవ్వడం అభినదనియమని మన మండలానికి చెందిన యువకుడు ఎస్సైగా ఎంపికవ్వడం ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ గంగా సాగర్‌, ...

Read More »

పెంచిన పెన్షన్‌లకు అనుగుణంగా చర్యలు

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆసరా పెన్షన్‌లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాటి పంపిణీకి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం ఆసరా పింఛన్లను పెంచడానికి నిర్ణయం తీసుకున్నందున అందుకు అనుగుణంగా ప్రభుత్వం జారీచేసే ఆదేశాలను పురస్కరించుకొని తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ తెలిపారు. పెన్షన్‌ ఉత్తర్వులను నియోజకవర్గం స్థాయిల వారీగా సిద్ధం ...

Read More »