మునిసిపల్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

కామారెడ్డి, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న మునిసిపల్‌ చట్టం 2019 ని అనుసరించి మునిసిపాలిటిల వారిగా ఎన్నికలను క్రమపద్దతిలో సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. గురువారం జనహితలో మునిసిపల్‌ ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నోటిఫికేషన్‌ తేది నుంచి ఎన్నికల అదికారులు రోజువారిగా అందిన నామినేషన్‌, అఫిడవిట్‌ వివరాలను పబ్లికేషన్‌ చేయాలన్నారు. నామినేషన్‌ తిరస్కరిస్తే వాటికి గల కారణాలను రికార్డు చేయాలని చెప్పారు.

పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో పొందుపరచాలని, అభ్యర్థుల ఖర్చు వివరాలను రోజువారిగా పరిశీలించాలని ఆదేశించారు. పోలింగ్‌ స్టేషన్లలో వందశాతం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్టు అమల్లో ఉంటుందని, వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మునిసిపల్‌ కమీషనర్‌ చందర్‌నాయక్‌, ఎంపిడివో నాగేశ్వర్‌రావు, సిపివో శ్రీనివాస్‌, టిపివో శైలజ, బిసి వెల్పేర్‌ అధికారి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌ డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం 60 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *