తక్కువ నీటితో ఎక్కువ పంట వచ్చేలా చూడాలి

కామారెడ్డి, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జల వనరులను సద్వినియోగం చేసుకొని తక్కువ నీటితో ఎక్కువ పంట రాబడి వచ్చేలా రైతులు తమ పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ రైతులను కోరారు. జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం బీబీపేట మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయశాఖ, కృషి విజ్ఞాన్‌ కేంద్రం రుద్రూర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్‌ మేళ రైతు అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్‌ బాలూ నాయక్‌, శాస్త్రవేత్త క్రాంతికుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య, ఉద్యానవన శాఖాధికారి శేఖర్‌ రైతులను ఉత్తమ పద్దతుల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీల సద్వినియోగం, పంట బీమా, నీటి నిలువ, నీటి సంరక్షణ, సంప్రదాయ పద్దతుల్లో వ్యవసాయం, ఆగ్రో ఫారెస్టు పద్దతులు, తుంపర సేద్యం, కత్తెర పురుగు జాగ్త్రతలు తదితర వ్యవసాయ పద్దతులపై విపులంగా తెలియజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

వర్షం నీరు వృధా కాకుండా రీ సైక్లింగ్‌ ద్వారా రీచార్జి ద్వారా భూగర్భ జలాల నీటి మట్టాన్ని పెంచేందుకు జిల్లాలో జలశక్తి అభియాన్‌ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. కార్యక్రమంలో జడ్పి వైస్‌ఛైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, బీబీపేట ఎంపి బాలమణి, జడ్పిటిసి తిరుమల గౌడ్‌, ఎండివో సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌ తేలు లక్ష్మి, వైస్‌ ఎంపిపి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *