పెంచిన పెన్షన్‌లకు అనుగుణంగా చర్యలు

నిజామాబాద్‌, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆసరా పెన్షన్‌లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాటి పంపిణీకి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం ఆసరా పింఛన్లను పెంచడానికి నిర్ణయం తీసుకున్నందున అందుకు అనుగుణంగా ప్రభుత్వం జారీచేసే ఆదేశాలను పురస్కరించుకొని తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ తెలిపారు. పెన్షన్‌ ఉత్తర్వులను నియోజకవర్గం స్థాయిల వారీగా సిద్ధం చేసుకోవాలని అందరు అధికారులకు నమూనా ప్రోసిడింగ్స్‌ షేర్‌ చేయాలని తెలిపారు.

సంబంధిత జిల్లా మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని పెన్షన్ల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు జారీ కాగానే అత్యంత ప్రాముఖ్యత నిచ్చి వీటి పంపిణీకి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, అర్హుల జాబితాతోపాటు అన్ని వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎక్కడ కూడా తప్పులు లేకుండా, ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ కాగానే ఈ నెల 20 నుండి పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *