Breaking News

Daily Archives: July 20, 2019

సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళలాంటివి

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమం అభివద్ధి రెండు కళ్లలాంటివని పేదలు సుఖ సంతోషాలతో ఉండాలనేది ముఖ్యమంత్రి ప్రధాన ఆశయమని రాష్ట్ర రోడ్లు భవనాల, రవాణా, శాసనసభ వ్యవహారాల మరియు గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం వేల్పూర్‌ మండలంలోని అమీనాపూర్‌లో బాల్కొండ నియోజకవర్గ స్థాయి ఆసరా పెన్షన్‌ పెంపుదల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదలు రైతుల సంక్షేమం పట్ల అండగా ఉండి ఆదుకునే ...

Read More »

పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలను అన్ని రకాలుగా అధుకోడమే కేసీఆర్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 140 మంది లబ్ధిదారులకు 1.36 కోట్ల రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను అందజేశారు. అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలోని 27 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 8 లక్షల 84 వేల రూపాయల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More »

సమాజానికి ఆదర్శం కామారెడ్డి రక్తదాతల సమూహం

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహం ఆపదలో ఉన్న వారికి సరైన సమయంలో రక్తాన్ని అందిస్తూ వందలాది మంది ప్రాణాలను కాపాడడం జరిగిందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్త హీనతతో బాధపడుతున్న సుంకరి అర్చన అనే మహిళకు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో తుజాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన వెంకటేష్‌, ప్రవీణ్‌, రాజులు ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ...

Read More »

ఆసరా పింఛన్ల ఉత్తర్వు పత్రాల పంపిణీ

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్శి రాములు ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన పెంచిన ఆసరా పింఛన్ల మంజూరీ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ బిబి పాటిల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఉత్తర్వు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పాటిల్‌ మాట్లాడుతూ నేను మంత్రైన తర్వాత కామారెడ్డి జిల్లాలో పెంచిన పింఛన్లు నా ...

Read More »

అభివద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం

నిజాంసాగర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కెసిఆర్‌తోనే అభివద్ధి సాధ్యమని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్‌ నియోజక వర్గానికి చెందిన ఆరు మండలాల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆసరా పెన్షన్‌ ప్రోసీడింగ్‌ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల అభివద్ధి పథకాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు ఇలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని ...

Read More »

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నిజాంసాగర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ 60 వేల రూపాయల చెక్‌ను లోక శ్రీనివాస్‌ స్టూడియో ఎన్‌ రిపోర్టర్‌కు పిట్లం ఎంపీపీ కవిత విజయ్‌, వైస్‌ ఎంపీపీ లక్ష్మారెడ్డిలు అందజేశారు. కార్యక్రమంలో అన్నారం సర్పంచ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బస్‌పాస్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలి

నిజాంసాగర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌లో చదువుకుంటున్న పాఠశాల, ఇంటర్మీడియట్‌, డిగ్రీ విద్యార్థుల కోసం బస్‌పాస్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ఏబివిపి విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. శనివారం బాన్సువాడ డిపో మేనేజర్‌కు వినతి పత్రం సమర్పించారు. వివిధ గ్రామాల బస్సు సమస్యలను వెంటనే పరిస్కరించాలని విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం ఇదే సమయానికి బస్సుపాస్‌ కౌంటర్‌ అందుబాటులో ఉండేదని విద్యాసంస్థలు ప్రారంభమై నెలరోజులు పూర్తవుతున్నా ఇంతవరకు కౌంటర్‌ ఏర్పాటు చేయలేదన్నారు. కార్యక్రమంలో ఏబివిపి విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చంద్రయ్య అనే వృద్దులు పదిరోజుల క్రితం ఒకటో టౌన్‌ పరిధిలోని దేవి రోడ్డు ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అయితే వద్ధుడిని గమనించిన పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా శనివారం ఉదయం చికిత్స పొందుతూ మతి చెందాడు. మృతుని ఎవరైనా గుర్తిస్తే ఒకటో టౌన్‌ పోలీసులను గాని, ఆసుపత్రి సిబ్బందిని గాని సంప్రదించవచ్చు.

Read More »

23న ఛలో నిజామాబాద్‌

ఆర్మూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కనీస వేతనాల జీవోలను సవరించి కార్మికుల వేతనాలు పెంచి, ఉద్యోగ కార్మికుల జీవన ప్రమాణాలు పెంచాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఈనెల 23న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో లేబర్‌ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చిందని ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.ముత్తన్న, దాసు తెలిపారు. శనివారం వారు ఆర్మూర్‌ పట్టణంలోని కుమార్‌ నారాయణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా కనీస వేతనాల కమిటీ ...

Read More »

నేడు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పర్యటన

ఆర్మూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం 20వ తేదీ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు అంకాపూర్‌లో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 9 గంటలకు మామిడిపల్లి గ్రామంలో ఇమేక్స్‌ లైట్‌ (విధి దీపాలు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తరువాత 10 గంటలకు పెర్కిట్‌ గ్రామంలో పలు అభివద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వద్దులకు రూ. 2016 పెన్షన్లను క్షత్రియ ఫంక్షన్‌ హాల్‌లో అందజేయనున్నారు.

Read More »