నిజాంసాగర్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ పట్టణంలోని సత్యసాయి కాలనీలో శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారికి ప్రతియేటా ఆషాడ మాసంలో నిర్వహించే బోనాల పండగ పురస్కరించుకొని శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తనయుడు యువ నాయకుడు మహారెడ్డి రోషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం రోషన్‌రెడ్డి మాట్లాడుతూ కాలనీవాసులందరికి కట్ట మైసమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటుందని, ప్రజలందరు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ప్రభు, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ...
Read More »Daily Archives: July 21, 2019
కల్హేర్‌లో బోనాలు
నిజాంసాగర్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్హేర్ మండల కేంద్రంలో ఆషాఢ మాస బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని ఆడపచులు బోనాలను అందంగా అలంకరించి నెత్తి మీద పెట్టుకొని ఊరేగించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకటరామిరెడ్డి, మండల ప్రజలు పాల్గొన్నారు.
Read More »మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ
నిజాంసాగర్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్ ఆదివారం ఉదయం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు పడాలని రైతులు ఆనందంగా ఉండాలనే ఆలోచనతో అమ్మ వారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నట్టు ఎంపి పేర్కొన్నారు. వర్షాలు లేక వ్యవసాయ రైతులు ఆందోళనలో ఉన్నారని, అమ్మ వారు కరుణించి వ్యవసాయ రైతులు పంటలు పండించుకోవడానికి అవసరమగు వర్షాలు కురిపించాలని ఎంపీ బీబీ పాటిల్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ...
Read More »గుంతలకు మరమ్మతులు చేయరూ…
నిజాంసాగర్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని మంజీర బ్రిడ్జి నుంచి వెళ్లే దారి మధ్యలో గుంతలు పడి వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నర్సింగ్ రావు పల్లి చౌరస్తా నుంచి వాహనదారులు వస్తూ గుంతలో పడి పలువురికి గాయాలైన సంఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గుంతల రోడ్డుపై వాహనాలు నడపాలంటే ఇబ్బంది కరంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. శనివారం రాత్రి బైక్‌పై వెళ్తున్న వాహనదారులు గుంతలో పడి గాయాలైన ...
Read More »ఉచిత శిక్షణ
డిచ్పల్లి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 19వ తేదీ నుంచి ఎస్బిఐ, ఆర్ఎస్ఇటిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్‌పల్లిలో పలు అంశాల్లో ఉచిత శిక్షణలు ప్రారంభం కానున్నాయి. హౌజ్ వైరింగ్, ఎలక్ట్రిషియన్ – 30 రోజులు, సెల్‌ఫోన్ రిపేరు, సర్వీసు – 30 రోజులు, కామరెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 19 నుండి 40 సంవత్సరాలలోపు ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు నేరుగా సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పేర్లు నమోదు ...
Read More »నిండుకుండలా కళ్యాణి ప్రాజెక్ట్
నిజాంసాగర్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కళ్యాణి ప్రాజెక్టు దాదాపుగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను 408 మీటర్లలకు నీరు చేరుకుందని ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ తెలిపారు.
Read More »వి.టి. ఠాకూర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వి.టి. ఠాకూర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ అండ్ లాల్ శస్త్ర చికిత్స అవసరమున్న 30 మందికి తమ సొంత ఖర్చులతో మెడిసిటి ఆసుపత్రి హైదరాబాద్‌కు తరలించారు. మరియు 30 మందికి కుట్టుమిషన్లు పంపిణి చేశారు. వారి సేవా భావం చాలా గొప్పదని పలువురు ప్రశంసించారు.
Read More »