Breaking News

Daily Archives: July 22, 2019

పింఛన్లను పంపిణీ చేసిన నాయకులు

నిజాంసాగర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పిట్లం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గైని విఠల్‌, సీడీసీ చైర్మన్‌ దుర్గరెడ్డి, ఎంపీడీవో తోట పర్బన్న కలిసి పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రతి సంక్షేమ పథకం అమలయ్యే విధంగా కషి చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సంగమేశ్వరం గౌడ్‌, కమ్మర్‌ కత్త అంజయ్య, సందీప్‌, రమేష్‌ గౌడ్‌, తదితరులు ఉన్నారు.

Read More »

పశువులకు టీకాలు

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాఘవపూర్‌ గ్రామంలో ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ క్యాంపు నిర్వహించారు. ఇందులో 56 గేదెలు, 18 ఆవులు, ఎద్దులకి డాక్టర్‌ రవికిరణ్‌, మండల పశువైద్య అధికారి ఆధ్వర్యంలో టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాగర్‌ గౌడ్‌, పాడి రైతులు పాల్గొన్నారు.

Read More »

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణి

నిజాంసాగర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి మాగి గ్రామానికి చెందిన వారికి 40 వేల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆపద్బాంధవుడు కేసీఆర్‌ అని అన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్‌ దుర్గరెడ్డి, కమ్మర్‌ కత్త అంజయ్య, నాయకులు దేవేందర్‌, శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Read More »

సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 33 వ వార్డులో సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సోమవారం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. పనులు నాణ్యతతో చేపట్టి వేగవంతంగా పూర్తిచేయాలని గుత్తేదారుకు సూచించారు.

Read More »

పింఛన్లు పెంచిన ఘనత కేసీఆర్‌దే

నిజాంసాగర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలని సిఎం కేసీఆర్‌ లక్ష్యమని తాజా మాజీ జడ్పీ ఛైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌ నగర్‌ గ్రామంలో పెంచిన పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తెలంగాణ అభివద్ధి కెసిఆర్‌తో సాధ్యమని అన్నారు. ఏ ప్రభుత్వాలు చేయలేని పథకాలను కేసీఆర్‌ ప్రవేశపెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వద్ధులకు, వితంతువులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు ఉండేవని ఇప్పుడు ...

Read More »

పాఠశాల తనిఖీ

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని మండల విద్యాశాఖాధికారి వెంకటేశం అన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని కళ్యాణి, రత్నపూర్‌, అన్నాసాగర్‌ ప్రైమరీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం పనితీరు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ, సీఆర్పీ దత్తాత్రి ఉన్నారు.

Read More »

బీడీ కార్మికులకు జీవనభృతి మంజూరుపై హర్షం

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికులందరికి ఎలాంటి షరతులు లేకుండా ముఖ్యమంత్రి కెసిఆర్‌ జీవనభృతి మంజూరు చేయడం పట్ల నూతన బీడీ కార్మికుల సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి శివంగి సత్యం హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గల సుమారు 7 లక్షల మంది బీడీ కార్మిక కుటుంబాలు జీవనభృతి పట్ల లబ్దిపొందనున్నట్టు తెలిపారు. గతంలో పాలకులు బీడీ కార్మికులను పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి కెసిఆర్‌, కెటిఆర్‌ కృషి ...

Read More »

జలశక్తి అభియాన్‌ ర్యాలీ

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జలవనరుల సంరక్షణ, వర్షపు నీటి రక్షణపై సోమవారం కామారెడ్డిలో నిర్వహించిన విద్యార్థుల ర్యాలీని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. నీటి సంరక్షణపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బ్యానర్లు, ప్లకార్డులతో కళాశాల నుంచి పట్టణం వరకు ర్యాలీ నిర్వహించారు. జలవనరుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య, విద్యాశాఖాధికారి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఫోన్‌ఇన్‌లో 13 ఫిర్యాదులు

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ రికార్డుల సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టర్‌ సత్యనారాయణ నిర్వహిస్తున్న ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి 13 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలు, గ్రామాలకు చెందిన రైతులు తమ భూ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు తెలియజేశారు. సంబంధిత అదికారులు సమస్యలు పరిష్కరించకుండా ఆలస్యం చేస్తున్నారని విన్నవించుకున్నారు. వేరు వేరు సమస్యలపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ స్పందిస్తు సంబంధిత ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. పలు సమస్యలపై విచారణకు ఆదేశించారు. కార్యక్రమంలో ...

Read More »

ప్రజావాణిలో 51 పిర్యాదులు

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిద శాఖలకు సంబంధించి 51 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. రెవెన్యూ- 36, అటవీశాఖ-2, ఆర్‌అండ్‌బి-1, డిఆర్‌డివో-1, డిపివో-4, ఎస్‌సి కార్పొరేషన్‌-1, మత్స్యశాఖ-1, డిపిఆర్‌ఇ-1, సివిల్‌ సప్లయ్‌-1, బిసి వెల్పేర్‌-1, ఎంసి-1, సిడబ్ల్యువో-1 ఫిర్యాదులు నేరుగా స్వీకరించిన కలెక్టర్‌ సత్యనారాయణ వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబందిత అదికారులకు ఉత్తర్వులు జారీచేశారు.

Read More »

మునిసిపల్‌ ఎన్నికలపై కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మునిసిపాలిటి ఎన్నికలకు సంబందించి సోమవారం కామారెడ్డి కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, మునిసిపల్‌ ఎన్నికల పరిశీలకుడు సందీప్‌ కుమార్‌ ఝా ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. రెండవ ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధి నిర్వహణ కోసం 215 ప్రీసైండింగ్‌ అధికారులు, 215 అసిస్టెంట్‌ ప్రీసైడింగ్‌ అధికారులు, 645 మంది పోలింగ్‌ అధికారులు, మొత్తం 1075 పోలింగ్‌ సిబ్బంది నియామకం కోసం 4575 మంది ...

Read More »

26న సాహు మహరాజ్‌ జయంతి

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్రపతి సాహుజి మహారాజ్‌ జన్మదిన వేడుకలు ఈనెల 26న నిజామాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం కామారెడ్డి పట్టణంలో జన్మదిన వేడుకలకు సంబంధించి గోడప్రతులు ఆవిష్కరించారు.

Read More »

అతివేగం ఇద్దరి ప్రాణాలు బలిగొంది

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మత్యువాత పడ్డారు. సీఐ రాజశేఖర్‌ కథనం ప్రకారం… హైదారాబాద్‌ ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్‌ (37), స్వామి (30)లు వీరిద్దరు వరుసకు బావబావమరుదులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో హైదరాబాద్‌ నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. శ్రీనివాస్‌ బైక్‌ నడుపుతుండగా స్వామి వెనక ...

Read More »

23న ఎమ్మెల్యే పర్యటన వివరాలు

ఆర్మూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 23వ తేదీ మంగళవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఆర్మూర్‌ పట్టణంలో సిఎంఆర్‌ఎఫ్‌ లబ్దిదారుల ఇంటికి వెళ్లి సంబంధిత చెక్కులు అందజేయనున్నారు. ఉదయం 9 గంటలకు పిప్రి గ్రామంలో టీఆర్‌ఎస్‌ నాయకులు హేమంత్‌ రెడ్డి నానమ్మ ద్వాదశ కర్మకు హాజరవుతారు. అలాగే ఉదయం 11 గంటలకు ఆర్మూర్‌ పట్టణములో ఆసరా పెన్షన్‌ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేసి వారితో వనభోజనాల కార్యక్రమంలో పాల్గొంటారు. ఎంకె ఫంక్షన్‌ హాల్‌, ...

Read More »

పింఛన్లు పంపిణీ

బాన్సువాడ, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్లు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 బాన్సువాడ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు.

Read More »

భిక్కనూరు రెసిడెన్సియల్‌ పాఠశాలలో నీటి కొరత

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ విద్య, క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన గురుకుల పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని భిక్కనూరు గురుకుల పాఠశాలలో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా గురుకులంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించింది. విద్యార్థులు మద్యం, సిగరెట్లకు బానిసలుగా మారారు. దీంతో విద్యార్థులు నిత్యం గొడవలకు దిగుతున్నారు. పాఠశాల ఆవరణ అంతా అపరిశుభ్రంగా మారి కంపు కొడుతోంది. మరుగుదొడ్ల పరిస్థితి దారుణం, ప్రహరీ గోడ లేకపోవడం, విద్యార్థులు తరచూ బయటికి ...

Read More »