Breaking News

Daily Archives: July 23, 2019

అండగా ఉండేందుకే ఆసరా పింఛన్లు

రెంజల్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని వదులందరికీ పెద్ద కొడుకుగా నిలిచి ఆసరా పింఛన్లను పెంచారని మౌలాలితండా సర్పంచ్‌ జాదవ్‌ సునీత బాబునాయక్‌ అన్నారు. ఈనెల 20 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీలో భాగంగా మంగళవారం మౌలాలితండాలో పింఛన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి అన్నారు. వద్ధులు వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు చేయూతనిచ్చేందుకు సీఎం ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకం కింద వద్ధులు, బీడీ కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని సర్పంచ్‌ దఫేదార్‌ బాలమణి అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌ నగర్‌ గ్రామంలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందేవిధంగా కషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ నారాయణరెడ్డి, వార్డ్‌ సభ్యులు, ...

Read More »

అదశ్యమైన బాలుడు – చెరువులో శవమై తేలాడు

నందిపేట్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో ఆదివారం అదశ్యమైన బాలుడు మంగళవారం ఉదయం చెరువులో శవమై తేలాడు. విషయం తెలిసుకున్న కుటుంబ సభ్యులు దుఃఖ సముద్రంలో మునిగారు. నందిపేట మండల కేంద్రంలోని రాజనగర్‌ దుబ్బ కాలనీకి చెందిన షేక్‌ అర్షద్‌ – భాను దంపతులకు ఆరుగురు పిల్లలు. చిన్న కుమారుడైన మహబూబ్‌ పాషా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఆడుకునేందుకు వెళ్లి తిరిగిరాలేదు. బంధువుల ఇళ్లలో ఆరా తీసినా, పలు చోట్ల వెతికినా ...

Read More »

ఘనంగా పోచారం భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్‌ రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ నియోజక వర్గంలోని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌, కోటగిరి, పోతంగల్‌, వర్ని, చందూర్‌, మోస్రా మండలాల్లో తెరాస పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున భాస్కర్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేకులు కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయా మండలాల్లో తెరాస పార్టీ కార్యకర్తలు, పోచారం బాస్కర్‌ రెడ్డి వీర అభిమానులు, కార్యకర్తలు, స్నేహితులు ప్రభుత్వ ...

Read More »

ఉపాధ్యాయులకు శిక్షణ

నిజాంసాగర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండల ఏంఈవో కార్యాలయంలో ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్‌ సమావేశాలను స్థానిక మండల విద్యాశాఖాధికారి సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ విధానాలను ఆదేశాలను తెలియజేశారు. సెల్‌ ఫోన్లు వాడకూడదని ప్రధానోపాధ్యాయిని దగ్గర డిపాజిట్‌ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. చైల్డ్‌ ఇన్పోలో టీచర్స్‌ ఫొటో ఈనెల 27వ తేదీ వరకు అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఎస్‌బిఐ అకౌంట్‌ ఆంధ్ర బ్యాంకు లోకి మార్చాలని విలేజ్‌ ఎడ్యుకేషన్‌ రిజిస్టర్‌ అప్‌డేట్‌గా ...

Read More »

ఆసరా పింఛన్ల పంపిణీ

నిజాంసాగర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మల్లూర్‌ గ్రామంలో వైస్‌ ఎంపిపి మనోహర్‌, సర్పంచ్‌ ఖాసీం షబ్‌ ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. వికలాంగులకు రూ.3016, వద్ధులకు వితంతువులకు రూ.2016 అసరా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కెసిఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గడపకు అందే విధంగా కషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

Read More »

సుందిళ్ళ బ్రిడ్జి, పంప్‌ హౌస్‌ సందర్శించిన నాయకులు

నిజాంసాగర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుందిళ్ళ బ్రిడ్జి, పంప్‌ హౌస్‌ను నిజాంసాగర్‌ సుల్తాన్‌ నగర్‌ నాయకులు సందీప్‌, మాజీ మండల కో ఆప్షన్‌ సభ్యులు హైమాద్‌ హుస్సేన్‌ లింగ గౌడ్‌, యేసయ్య, తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పంట పొలాలు సస్యశ్యామలంగా మారేందుకు ప్రాజెక్టులను పంప్‌ హౌస్‌లను నిర్మించడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.

Read More »

శాసనసభ ఆవరణలో బోనాల పండగ

బాన్సువాడ, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభ ఆవరణలోని బంగారు మైసమ్మ దేవాలయంలో మంగళవారం ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు బోనాల పండగలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటి ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహాచారి, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

బురుడుగల్లి మేదరి యువజన సంఘం నూతన కార్యవర్గం

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14న బురుడుగల్లి మహేంద్రసంఘంలో బురుడుగల్లి మేదరి యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నికలు నిర్వహించి ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. 2019-21 సంవత్సరాలకు కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు. అధ్యక్షులుగా గుడుమల నవీన్‌, ఉపాధ్యక్షులుగా కొత్తపేట లక్ష్మణ్‌, దర్శనం భాస్కర్‌, ప్రధాన కార్యదర్శిగా ఇందూరు నరేశ్‌, కోశాధికారిగా శుభాష్‌, దర్శనం శ్రీకాంత్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ది తమవంతు సహాయ ...

Read More »

పిడిఎస్‌యు ఆందోళన

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకురావడాన్ని నిరసిస్తూ పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రభుత్వ గిరిరాజ్‌ కళాశాల పీజీ సెంటర్‌ ముందు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ ప్రభుత్వం కుట్రపూరితంగా ఉన్నత విద్యను నిర్వీర్యం చేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రైవేటు యూనివర్సిటీలు బిల్లును తీసుకువస్తుందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో విద్యార్థులను చేర్పించడం కోసమే ప్రభుత్వ పీజీ సెంటర్లను మూసివేస్తుందన్నారు. ...

Read More »

జీవోలు వెంటనే సవరించాలి

ఆర్మూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన 70 జీవోలను సవరించి, పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేసినట్లు ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. ధర్నాలో రాష్ట్ర అధ్యక్షులు కష్ణ పాల్గొని ప్రసంగించారు. ...

Read More »

26న దాశరథి అగ్నిధార – దేశపతి ప్రసంగధార

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిదా రచయితల సంఘం, నిజామాబాద్‌ ఆధ్వర్యంలో ఈనెల 26న దాశరథి అగ్నిధార – దేశపతి ప్రసంగధార కార్యక్రమం నిర్వహించనున్నట్టు సంఘం ప్రతినిదులు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేస్తారన్నారు. గౌరవ అతిథులుగా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు పాల్గొంటారన్నారు. కవులు, కవయిత్రులు, రచయితలు, రచయిత్రులు,సాహిత్య అభిమానులు, దాశరథి ...

Read More »

ఛలో హైదరాబాద్‌ గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రైవేటు యూనివర్సిటీల జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్‌ పోస్టర్లను పిడిఎస్‌యు నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఎస్‌. ప్రశాంత్‌ మాట్లాడుతూ ఈనెల 26న పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ చలో ప్రగతి భవన్‌ (హైదరాబాద్‌) కు పిలుపునివ్వడం జరిగిందని, విద్యార్థి లోకం జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ...

Read More »