Breaking News

Daily Archives: July 24, 2019

విద్యార్థులు ఇష్టంతో చదివి ప్రయోజకులు కావాలి

నిజాంసాగర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే బిచ్కుందలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, నోటుపుస్తకాలు అందజేశారు. క్రీడలు కోసం ఎమ్మెల్యే షిండే రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించి విద్యార్థులు క్రీడాకారులు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే చాక్లెట్లు పంచారు. ఈ సందర్భంగా ...

Read More »

రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ చేసిన సిపి కార్తికేయ

రెంజల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే పిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును అంతర్జాలంలో నమోదు చేయాలన్నారు. ఆయన వెంట బోధన్‌ ఏసీపీ రఘు, రూరల్‌ సీఐ షకీర్‌ అలీ, ఎస్సై శంకర్‌, సిబ్బంది ఉన్నారు.

Read More »

మండల పరిషత్‌ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిర్గాపూర్‌ మండలంలో నూతనంగా నిర్మించిన మండల ప్రజాపరిషత్‌ భవనాన్ని నారాయణఖేడ్‌ శాసనసభ్యులు భూపాల్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ నూతన మండలాన్ని అందరి సమన్వయంతో అభివద్ధి చేసుకోవాలని కోరారు. గ్రామాల్లోని అభివద్ధి కేసీఆర్‌తోనే జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందే విధంగా సీఎం కేసీఆర్‌ కషి చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని గుర్తు చేశారు. గత ...

Read More »

పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ టాబ్లెట్లు

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకటి నుండి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ టాబ్లెట్లు వేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 8న జాతీయ నులిపురుగు నివారణ రోజు పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో తన చాంబర్లో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు నెలలో రెండు విడతలుగా నులిపురుగుల రోజును నిర్వహిస్తారన్నారు. ఆగస్టు 8వ తేదీన నిర్వహించే రెండవ విడత జాతీయ నులి పురుగుల ...

Read More »

కెటిఆర్‌ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు భూపాల్‌ రెడ్డి నారాయణఖేడ్‌ పట్టణ కేంద్రంలోని టిఆర్‌ఎస్‌ కార్యాలయ అవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ తమ జన్మదినం సందర్భంగా ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, జెడ్పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Read More »

మూడు వందల కోట్లతో నగరాభివద్ధి

మంత్రి ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదులో రూ. 300 కోట్లతో పలు అభివద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం రూ. 246 కోట్లతో పూర్తి చేసిన భూగర్భ డ్రైనేజీ శుద్ధి ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, నలభై సంవత్సరాలుగా జరగని ఎస్‌టిపి కార్యక్రమాన్ని తాము పూర్తి చేశామని దీని వెనుక ఎంతో కషి, ...

Read More »

రైతు భీమా చెక్కు అందజేత

రెంజల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామానికి చెందిన రైతు కోటాకింది లక్ష్మారెడ్డి మతి చెందగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ 5 లక్షల రైతు బీమా చెక్కును బుధవారం సర్పంచ్‌ సునీత, ఉపసర్పంచ్‌ లక్ష్మీ, ఎంపిటిసి లక్ష్మీ అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ రావ్‌, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, మాజీ ఎంపిటిసి నర్సయ్య, టిఆర్‌ఎస్‌ నాయకులు లింగం, దత్తుపటేల్‌, రవీందర్‌ గౌడ్‌, అబ్బన్న, సాయిలు, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మంత్రిని పరామర్శించిన శాసనసభాపతి

బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. మంత్రి మాతృమూర్తి తారకమ్మ ఇటీవల స్వర్గస్తులయ్యారు. దీంతో బుధవారం ఆనయ మంత్రి ఇంటికి వెళ్ళి పరామర్శించి తారకమ్మ చిత్రపటం ముందు శ్రద్దాంజలి ఘటించారు.

Read More »

మొక్కలు నాటిన ఎంపీపీ కవిత

నిజాంసాగర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ చేయాలని ఎంపీపీ కవిత అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని కోమతిచేరు తండాలో మొక్కలను నాటారు. అనంతరం ఎంపిపి మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి 6 మొక్కలు నాటి వాటి సంరక్షణ పకడ్బందీగా చేయాలని అన్నారు. ప్రతి పాఠశాలలో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ఎంపీపీ కవితను గ్రామస్తులు అందరూ కలిసి సన్మానించారు. కార్యక్రమంలో యంపిటిసి ...

Read More »

ఇచ్చినమాట నిలబెట్టుకున్న సిఎం

రెంజల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవెచ్చి రూ. వేయి రూపాయలు ఉన్న పింఛన్‌ రూ.2016 పెంచి అభాగ్యులకు అండగా నిలిచారని జడ్పీటీసీ మేక విజయ అన్నారు. బుధవారం మండలంలోని బొర్గం, తాడ్‌బిలోలి గ్రామాల్లో ఆసరా పింఛన్లను సర్పంచ్‌లు వాణి, సునీత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన పింఛన్లతో వద్దులకు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళల జీవితంలో ఆనందాన్ని నింపారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లు రుక్మిణీ, లక్ష్మీ, ఉపసర్పంచ్‌ లక్ష్మీ, పంచాయతీ ...

Read More »

కెటిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో అభివద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్మి బాయ్‌, జడ్పీటీసీ అనిత, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ శివాజీ, టిఅర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు సంగమేష్‌ తదితరులు ఉన్నారు.

Read More »

విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ మంజూరు చేయిస్తాం

నిజాంసాగర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో కాటేపల్లికి విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ మంజూరి చేస్తానని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. బుధవారం కాటేపల్లి సర్పంచ్‌ విట్ఠల్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు బిచ్కుందలో ఎమ్మెల్యేను కలిసి గ్రామ సమస్యలను వివరించారు. విద్యుత్‌ కోతల వల్ల కాటేపల్లిలో వ్యవసాయానికి సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. అలాగే మిషన్‌ భగీరథ నీరు బంద్‌ కావడం వల్ల ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడిందని తెలిపారు. ఎస్‌సిలకు కమ్యూనిటీ హల్‌ మంజూరు ...

Read More »

ఆసరా పింఛన్ల పంపిణీ

నిజాంసాగర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడపడుచులకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచ గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి, సర్పంచ్‌ సాదుల అనురాధ సత్యనారాయణ, నాయకులు గంగారెడ్డి, మండల కో ఆప్షన్‌ సభ్యుడు ఇస్మాయిల్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ కేసీఆర్‌ ఆడపడుచులకు అండగా ఉండేందుకోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఏ ప్రభుత్వాలు చేయలేని ...

Read More »

ఇద్దరు చిన్నారులు మృతి

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మత్యువాత పడ్డారు. మతులిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు రియాజ్‌ (10), మహ్మద్‌ (5) గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి చిన్నారులు కనిపించకుండా పోయారు. చిన్నారుల అదశ్యంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అర్థరాత్రి సమయంలో కారు వెనుక సీటులో విగత జీవులుగా పడివున్న ఇద్దరు చిన్నారులను గుర్తించారు. బంధువులు, కుటుంబ సభ్యులు పిల్లల మతిపై అనుమానం ...

Read More »

ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలో సీడీసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్‌ ధపెదర్‌ రాజు కేకు కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో సిడిసి చైర్మన్‌ దుర్గారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గైని విఠల్‌, నాయకులు గంగారెడ్డి, సాదుల సత్యనారాయణ, రమేష్‌ కుమార్‌, యటకారి నారాయణ, సర్పంచ్‌ కమ్మరి కత్త అంజయ్య, ఉప సర్పంచ్‌ గరా బోయిన ...

Read More »