Breaking News

Daily Archives: July 27, 2019

పిడిఎస్‌యు ధర్నా

నిజామాబాద్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్స్‌లర్‌లుగా ఐఏఎస్‌ అధికారులను నియమించడాన్ని, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పీజీ కోర్సుల ఎత్తివేత నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ శనివారం ధర్నా నిర్వహించింది. కార్యక్రమంలో పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.నరేందర్‌, జిల్లా నాయకులు ప్రశాంత్‌, ఏ.ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

Read More »

హరితహారం మొక్కలు బతికేలా చర్యలు

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నాటిన ప్రతి మొక్క బతికేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అందరు సంరక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శనివారం బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి అటవీ ప్రాంతంలో జలశక్తి అభియాన్‌, హరితహారం కింద మొక్కలు నాటారు. 20 ఎకరాల్లో 9 వేల మొక్కలతో ఆక్సిజన్‌ పార్కు ఏర్పాటులో భాగంగా ఆ ప్రాంతంలో మొక్కలు నాటడంతోపాటు చెక్‌ డ్యాం నిర్మాణ పనులు, కందకాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాధికారి ...

Read More »

రక్తదాన శిబిరాలను విరివిగా నిర్వహించాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, అందరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం జనహిత భవనంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆద్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డితోపాటు పలువురు అధికారులు రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదాన ఆవశ్యకతను తెలిపే రక్తదాన శిబిరాల్లో స్వచ్చందంగా పాల్గొనాలని కోరారు. ఇంతవరకు జిల్లాలో 88 శిబిరాలు జిల్లాలో ఏర్పాటు ...

Read More »

హరితహారంలో వందకోట్ల మొక్కలు నాటడం లక్ష్యం

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా ఈయేడు రాష్ట్రంలో వందకోట్ల మొక్కలు నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని రాశివనంలో పర్యటించారు. ముఖ్యమంత్రి నాటిన చెట్టును సందర్శించారు. రాశివనం నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్‌ను అభినందించారు. అనంతరం మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చెట్ల వల్లే వర్షాలు కురుస్తాయని, ఇందుకోసం రాష్ట్రంలో 33 శాతం వృక్ష సంపదను పెంచడాన్ని ...

Read More »

సామూహిక అన్నప్రాసన

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం రాఘవపూర్‌ గ్రామంలో పోషణ ఆరోగ్య దినము సందర్భంగా తల్లులకు అవగాహన కల్పించడానికి అన్నప్రాసన, సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. పిల్లలకు అనుబంధ ఆహారం మొదలుపెట్టే విధానం గురించి తల్లులకు తయారు చేసి చూపించడం జరిగింది. అదే విదంగా. కొత్త ఆసరా ఫించన్‌ 2016 రూపాయలు పంపిణీ చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో కామారెడ్డి మండల జడ్పిటిసి చిదుర రమాదేవి, లక్మరెడ్డి, ఎంపిపి అంజన్న, వైస్‌ ఎంపిపి ఉరుడొంద ...

Read More »

విఆర్వోల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం వి.ఆర్‌.ఓల సమస్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రెవెన్యూ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై న్యాయ నిపుణుల సూచనల మేరకు సమగ్రమైన నివేదిక తయారు చేసి వినతిపత్రం సమర్పించారు.

Read More »

యువతి పెళ్ళికి బియ్యం సహాయం

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవునిపల్లి గ్రామంలో పేద ముస్లిం యువతి వివాహానికి 50 కిలోల బియ్యం సహాయంగా అందజేశారు. చందు పాషా, తహెరా బిడ్డ హీన వివాహానికి కామారెడ్డి మండల వైస్‌ ఎంపీపీ ఉరుడొంద నరేశ్‌ 50 కిలోల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో ఎం.డి. సజెడ్‌, ఎస్‌డి ఆరిఫ్‌, అసిఫ్‌, సాకలి సంజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణకు హరితహారం

బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి మహిళ హాస్టళ్ల స్థలాన్ని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం హరితహారంలో బాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. తెలంగాణకు హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మారుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, నాయకులు ఉన్నారు.

Read More »

కలాం ఆశయాలను సాకారం చేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ, సాంధీపని డిగ్రీ కళాశాల సంయుక్త ఆద్వర్యంలో శనివారం అబ్దుల్‌ కలాం వర్దంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలో యువ చైతన్య స్పూర్థి ర్యాలీ నిర్వహించారు. 83 మీటర్ల జాతీయ జెండాతో సాందీపని కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని సాంధీపని కళాశాల డైరెక్టర్‌ బి.బాలాజిరావు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం ఆశయాలను సాకారం చేయాల్సిన బాద్యత నేటి యువతపై ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక, అణ్వస్త్ర ...

Read More »

ఆశయాల ఆచరణే గాంధీజీకి అసలైన నివాళి

నిజామాబాద్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీజీ మార్గంలో నడిచి ఆయన ఆశయాలను అనుసరించడమే ఆయనకు అసలైన నివాళి అవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఇందూర్‌ భారతి రచయితల సమాఖ్య స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను శనివారం కంఠేశ్వర్‌లోని మహిళా కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. కాలానుగుణంగా, సాంకేతికంగా, జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ ఆశయాల పరంగా, ఆలోచనల పరంగా ...

Read More »

ఇంటింటికి కాంగ్రెస్‌

బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆదేశానుసారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి కాంగ్రెస్‌, వాడ వాడ కాంగ్రెస్‌ జెండా కార్యక్రమం నిర్వహించనున్నారు. బాన్సువాడ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో శనివారం నుంచి 30వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని రాజీవ్‌ గాంధీ చౌరస్తా వద్ద జెండా ఎగురవేసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాసుల బాలరాజు మాట్లాడుతూ మున్సిపాలిటీ స్థాయికి అభివద్ధి చెందినా, సౌకర్యాలు మాత్రం ...

Read More »