Breaking News

ఆడపిల్లకు అండగా తెలంగాణ సర్కార్‌

నిజాంసాగర్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో గల మండల పరిషత్‌ కార్యాలయంలో మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నూతన మండలంగా ఏర్పడిన నాగాల్గిద్ద ప్రాంతాన్ని మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అభివద్ధి చేసుకోవాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వంతోనే గ్రామాల్లో, పట్టణాలలో అభివద్ధి జరుగుతుందని అన్నారు. ఆడపడుచులకు అండగా ఉండేందు కోసం తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందే విధంగా కషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులు ఉన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Comment on the article