కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఉదయం 8:00 గంటలకు కామారెడ్డిలో అశోక్ నగర్ కాలనీ అభయ ఆంజనేయ స్వామి గుడి వద్ద విశ్వనాధుల మహేష్ గుప్తా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్ 200 ఉచిత గణపతులు వితరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి విగ్రహాలను వాడరాదని, చెరువులోని నీరుని కలుషితం చేయవద్దని కోరారు. కార్యక్రమంలో అశోక్ నగర్ కాలనీ వాసులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Read More »Monthly Archives: August 2019
పది కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణ ప్రాంగణంలో నూతన భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నూతనంగా 10 కోర్సులను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లా కామారెడ్డి అని గతంలో ఇక్కడ ఉన్న కోర్సులను డిచ్పల్లికి తరలించడం జరిగిందని, దీనివల్ల ఈ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. ...
Read More »జిఎస్టి రద్దు చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 15 లక్షల మంది సబ్ ఏజెంట్ల ద్వారా ప్రజలకు విదేశీ బంధువుల నుండి పంపి నగదును మార్పిడి చేయడం ద్వారా ఉపాధి పొందుతున్న వారిపై 2 శాతం జిఎస్టి విధించి వెస్ట్రన్ యూనియన్ ఏజెంట్లను ఇబ్బందులకు గురి చేసే ఆలోచన మానుకోవాలని కామారెడ్డి జిల్లా వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు కె రమేష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ...
Read More »సౌత్ క్యాంపస్‌లో అదనపు తరగతుల గదుల ప్రారంభం
కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా, బిక్నూర్ మండలంలో సౌత్ క్యాంపస్‌లో ఫిజిక్స్‌కి సంబంధించిన అదనపు తరగతి గదులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ప్రతి జిల్లాకు విశ్వవిద్యాలయం ఉండాలని ఆయన గుర్తు చేశారు. మలిదశ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించి తెలంగాణను సాధించారని మంత్రి గుర్తు చేశారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి విద్య అవసరమని మంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టి, బీసీ ...
Read More »భావితరాల మేలు కోసం మొక్కలు
బాన్సువాడ, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యసభ సభ్యులు జె. సంతోష్ కుమార్ గ్రీన్ చాలంజ్ను స్వీకరిస్తూ బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో శనివారం దేశాయిపేట పిఏసిఎస్ అధ్యక్షులు, తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి మొక్కటు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ భావితరాల మేలుకోసం మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సమద్ధిగా వర్షాలు కురవాలన్నా, స్వచ్ఛమైన గాలి లభించాలన్నా మొక్కలను నాటాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు అవి ...
Read More »మనిషి నిర్లక్ష్యం వల్లే వాతావరణంలో మార్పులు
నిజామాబాద్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి గణపతులను వినియోగించి పర్యావరణాన్ని కాపాడి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రజాసైన్స్ వేదిక జిల్లా ఉపాధ్యక్షులు రామచందర్ గైక్వాడ్ పాఠశాల విద్యార్థులకు సూచించారు. శనివారం నాగారం 300 కోటర్స్ లోని జెండాగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులచే గణపతి విగ్రహాలు తయారు చేయించి మట్టి గణపతులపై అవగాహన కల్పించారు. మనిషి నిర్లక్ష్యం కారణంగా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రయత్నాలు జరగకపోతే రాబోయే ...
Read More »జర్నలిస్టు సురేశ్‌ను పరామర్శించిన టిడబ్ల్యుజెఎఫ్ నేతలు
కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మన తెలంగాణ పత్రిక రిపోర్టర్ కె.సురేష్ కుమార్‌ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యుజెఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందంలు శనివారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన సురేష్ కుమార్‌కు ఐదు వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సోమయ్య ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సురేష్‌కు ...
Read More »బూత్ లెవల్ అధికారులకు శిక్షణ
నందిపేట్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు నమోదులో ఎలాంటి పొరపాట్లు జరుగకుండ చూడాలని ఆర్ముర్ ఆర్డిఓ శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన బూత్ లెవల్ అధికారుల శిక్షణ తరగతుల సమావేశంలో ఆర్డిఓ మాట్లాడారు. 2020 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు నమోదు చేయించాలని సూచిస్తూ ఈవిపి అనే యాపై పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ రవీందర్, ఆర్ఐ వినోద, ఎపిక్ డిటి వినోద్, సీనియర్ అసిస్టెంట్ నరేష్, ...
Read More »యూరియాకు క్యూ
నందిపేట్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామములో రైతులు యూరియా కొరకు బారులు తీరారు. శనివారం ఉదయం నుండి వెల్మల్ లోని వ్యవసాయ సహకార సంఘం గిడ్డంగి వద్ద అన్న దాతలు క్యూ కట్టారు. ఉదయం నుండి క్యూ కట్టినప్పటికి పాస్ బుక్కు ఒక బస్తా మాత్రమే ఇస్తుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరిపడా యూరియా అందించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు పహారా కాశారు.
Read More »వర్ని గురుకులం ప్రారంభం
బాన్సువాడ, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్నీ మండలం పాతవర్నీ గ్రామంలో ”మహాత్మ జ్యోతిబా పూలే బి.సీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను” శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులతో పోటీ పడే విదంగా నాణ్యమైన విద్యను అందించడమే గురుకుల పాఠశాలల ప్రధాన ఉద్యేశమని, గురుకులాలు పవిత్రమైనవని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలకు మెరుగైన విద్య కోసం తెలంగాణ రాష్ట్ర ...
Read More »గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు తగదు
నిజాంసాగర్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపు రావు రెచ్చ గొట్టి గిరిజనుల మధ్య చిచ్చు పెట్టె విదంగా మాట్లాడుతున్నారని, అలాంటి చర్యలని మానుకోవాలని, లేక పొతే తగిన మూల్యం చెలించుకోవాల్సి వస్తుందని కామారెడ్డి జిల్లా అల్‌ఇండియా బంజారా సేవ సంఘ్ అధ్యక్షులు ఎన్.బద్యా నాయక్ హేచ్చరించారు. శనివారం ఎల్లారెడ్డి బంజారా భవన్లో విలేకర్లతో మాట్లాడారు. కేవలం తన స్వార్థం కోసం, రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే మా ఆదివాసీ సోదరులను రెచ్చ గొడుతున్నాడని, అలాగే ఎస్‌టిల ...
Read More »వినాయక చవితికి ముస్తాబవుతున్న నందిపేట్
నందిపేట్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రం వినాయక చవితి పండుగ కొరకు ముస్తాబవుతున్నది. ప్రధాన రోడ్డుకు మరమ్మతులు చేసి గుంతలను పూడ్చారు. వర్ష కాలం ప్రారంభంనుండి కురుస్తున్న వర్షాలకు గుంతలు ఏర్పడి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ పంచాయతి పాలక వర్గం ప్రత్యేక చొరవతో రోడ్ రోలర్‌తో చదును చేశారు. వినాయక ప్రతిష్ఠాన కొరకు నిజామాబాద్ నుండి తీసుకువచ్చే వినాయక విగ్రహాలు ఆదివారం నుండి వాహనాలలో రావడం ప్రారంభం అవుతాయి. విగ్రహాల వాహనం ...
Read More »అనాధకు అంత్యక్రియలు
నందిపేట్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో గత 15 సంవత్సరాలుగా వివిధ సేవ చేసుకుంటున్న వద్ధురాలు చిలివేరి ముతెమ్మ (తురాటి అయి) 65, రాత్రి 11 గంటల సమయంలో వద్ద ఆశ్రమంలో మరణించింది. వద్ధురాలికి భర్త, పిల్లలు ఎవరు లేరు. దూరపు కుటుంబీకులను పిలిచి ఆశ్రమం నుండి ప్రధాన రోడ్డు గుండా గ్రామంలో ఉన్న పాతుర్ పద్మశాలి స్మశానవాటిక వరకు శవ యాత్ర నిర్వహించారు. అనంతరం మహరాజ్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. ఆశ్రమంలో ...
Read More »ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి
నిజామాబాద్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో శనివారం వినాయక్ నగర్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా క్లబ్ సభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఉద్బోదించారు. అడవులు అంతరిస్తుండడంతో వర్షాలు పడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య రహిత సమాజం కోసం విధిగా ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమం చేపట్టాలని సూచించారు. లయన్స్ ...
Read More »మట్టి గణపతులనే ప్రతిష్టించాలి
నిజామాబాద్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు నగరంలోని సాయినగర్‌లోని వి.ఎన్.ఆర్ పాఠశాలలో శనివారం మట్టిగణపతుల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్తులచే మట్టిగణపతులు తయారు చేయించి సాయినగర్ కాలనీవాసులకు పంపిణీ చేశారు. విద్యార్థులు, వి.ఎన్.ఆర్. పాఠశాల ఉపాద్యాయులు ర్యాలీగా ఇంటింటికి వెళ్ళి మట్టిగణపతులనే ప్రతిష్టించాలని సూచించడంతో పాటు కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా వి.ఎన్. ఆర్.పాఠశాల కరస్పాండెంట్ యాదేష్ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని అన్నారు. ఇందుకోసం మట్టిగణపతులను ప్రతిష్టించాలని కోరారు. ప్లాస్టర్ ...
Read More »ఉద్యోగ భద్రత కల్పించాలి
నిజామాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర, జిల్లా, మండల కేంద్రంలోని విద్యా శాఖ పరిధిలో విద్యాశాఖ ఎంఆర్సి కార్యాలయంలో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు ఉద్యోగులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, హెచ్ఆర్ అమలు చేయాలని, అధికారుల వేధింపుల నుంచి రక్షించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు శుక్రవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ...
Read More »హరితహారం లక్ష్యం వెంటనే పూర్తి చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం లక్ష్యాలను వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలతో పలు విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హరితహారం లక్ష్యం పూర్తికావాల్సి ఉన్నదని ఎంపీడీవోలు కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు కనీసం 85 శాతం తక్కువ కాకుండా మొక్కలు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవో మొదలుకొని గ్రామస్థాయిలో టిఏలు, ...
Read More »బస్టాండ్‌లో వ్యక్తి మృతి
నందిపేట్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ బస్టాండ్‌లో అనుకోకుండా వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ నుంచి గాదేపల్లికి వెళుతున్న కిష్టయ్య అనే వ్యక్తి బస్టాండ్‌కు రాగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కిందపడి మరణించాడు. కిష్టయ్య స్వగ్రామం ధర్మపురి మండలం గాదేపల్లి అని తెలిసింది.
Read More »రక్తదానం ప్రాణదానం
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన సుగుణ రక్తహీనతతో బాధ పడడంతో వారికి బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కామారెడ్డి పట్టణంలోని లిటిల్ స్కాలర్ పాఠశాల కోఆర్డినేటర్ ప్రసాద్ రక్తదానం చేశారు. అదే పాఠశాలకు చెందిన రమేష్ కూడా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడడం జరిగింది. వీరికి కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయినట్లయితే 9492874006 కు ...
Read More »కార్మికులకు న్యాయం చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గరిపల్లి శేకరయ్య వస్త్ర దుకాణ వ్యాపారంలో గత 15 సంవత్సరాలుగా గుమస్తాలుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస సమాచారం ఇవ్వకుండా షాపు మూసివేసి కార్మికుల ఉపాధిని రోడ్డున వేశారని కార్మికులకు రావలసిన చట్టపరమైన హక్కులకోసం డిప్యూటీ లేబర్ కమిషనర్ ఉమ్మడి జిల్లా అధికారి చతుర్వేదికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఐసీటియు జిల్లా బాధ్యులు రాజలింగం మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా వస్త్ర వ్యాపారం చేస్తున్న గర్రెపల్లి శేకరయ్య అండ్ ...
Read More »