Breaking News

Daily Archives: August 2, 2019

కురుస్తూనే ఉంది…

నందిపేట్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో గత పదిరోజులుగా వర్షాలు ఎడతెరిపీ లేకుండా కురుస్తూనే ఉన్నాయి. కానీ చెరువులు, కుంటలు మాత్రం నిండడం లేదని ప్రజలు అంటున్నారు. ప్రతి రోజు తేలికపాటి వర్షం కురుస్తుంది. దాంతో వ్యాపారాలు, జన జీవనంపై ప్రభావం చూపుతుంది. పెద్ద మొత్తంలో వర్షాలు పడితేనె చెరువులు నిండుతాయని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

Read More »

ఆహ్లాదం పంచుతున్న ప్రభుత్వ కార్యాలయాలు

నందిపేట్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఇప్పుడు పెరిగి వక్షాలుగా మారాయి. మండల కేంద్రంలోని మండల కార్యాలయ కాంప్లెక్స్‌ ఆవరణలోని ఎండిఓ, ఎంఆర్‌ఓ కార్యాలయ, పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది నాటిన మొక్కలు చిట్టడవిని తలపిస్తున్నాయి. ఉపాధిహామీ కూలీలు నాటిన మొక్కలు పెరిగి ప్రస్తుతం ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో, ప్రభుత్వ దవాఖానలో నాటిన మొక్కలు వక్షాలై వనాలను తలపిస్తున్నాయి.

Read More »

మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వర్ధబట్టు వేణురాజ్‌ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వేణురాజ్‌ మాట్లాడుతూ సుదర్శన్‌ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో బారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసి అనేక నీటి ప్రాజెక్టులతో పాటు జిల్లాలో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజా నాయకుడిగా పేరుగాంచారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్‌ ...

Read More »

చట్టాలు సవరించాలి

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ జిల్లా కార్యాలయం ముందు ఏఐసిటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐసిటియు అనుబంధ బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కొల్లూరి ప్రభాకర్‌ మాట్లాడుతూ దేశంలోని బిజెపి సర్కారు రాష్ట్రంలోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కులను హరించి వేస్తూ కార్మికులకు అనుకూల చట్టాలను సంస్కరణల పేరుతో యాజమాన్యాలకు అనుకూలంగా మార్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆలోచనను మానుకోవాలని, కార్మిక అనుకూల చట్టాలను ...

Read More »

రోడ్డుపై నాట్లు వేసిన ఆర్‌ఎస్‌పి కార్యకర్తలు

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లోని భిక్కనూరు మండల కేంద్రంలో పోలీస్‌ స్టేషన్‌ నుండి తహసీల్‌ కార్యాలయం లక్ష్మీ దేవుని పల్లి వెళ్లే రోడ్డు మొత్తం గుంతలు బురదతో నిండి పోయిందని ప్రభుత్వ అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆర్‌ఎస్‌పి కార్యకర్తలు అన్నారు. రోడ్డు ద్వారా ఆఫీసు లోకి వెళ్లే ప్రజలతో పాటు సామాన్య ప్రజలు, ప్రభుత్వ అధికారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డును బాగు చేసి దానికి సీసీ ...

Read More »

నిత్యాన్నదానం

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ పరంజ్యోతి కల్కి మానవ సేవ సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 15 వరకు ప్రతిరోజు సాయంత్రం రైల్వే స్టేషన్‌లో అన్నదానం నిర్వహిస్తున్నట్లు శ్రీ పరంజ్యోతి కల్కి మానవ సేవ సమితి సేవకులు పేర్కొన్నారు. ఆగస్టు 15 నాడు శ్రీ కల్కి భగవాన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని దీని ద్వారా ప్రతి రోజు 100 మంది నిరాశ్రయులకు అనాధలకు అన్నదానం చేయడం జరుగుతుందని చెప్పారు. మానవసేవే మాధవ సేవ అని ...

Read More »

బిజెపి విస్తారక్‌ సప్తా సభ్యత్వ నమోదు

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ విస్తారక్‌ సప్తా సభ్యత్వ నమోదులో భాగంగా కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో శుక్రవారం విస్తతంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర అనంతరం కాంగ్రెస్‌ వ్యతిరేకులు, జాతీయ వాదులు కలిసి శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ నేతత్వంలో మొదట జనసంఘ్‌గా ఏర్పడి, తరువాత వాజపేయి, అద్వాణీల మార్గ ...

Read More »

అక్రమ అరెస్టులు అమానుషం

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వల్ల గుల్ల రోల్ల అడవుల్లో పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లు చేసి హతమార్చిన కామ్రేడ్‌ లింగన్నను కడసారిగా చూసేందుకు హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు వెళ్తే పోలీసులు అక్రమ అరెస్టు చేయడం అమానుషమని ఆర్మూర్‌ డివిజన్‌ సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు బి.దేవరాం, ముత్తన్న అన్నారు. శుక్రవారం ఆర్మూర్‌ కుమార్‌ భవన్‌లో ఆర్‌.మూర్తి ఆర్మూర్‌ సిపిఐ ఎంఎల్‌ డివిజన్‌ నాయకులు విలేకరులతో మాట్లాడారు. గిరిజన ...

Read More »

7న ఓబిసి మహాసభ

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని, బీసీల డిమాండ్ల పరిష్కారానికి నిర్వహిచే ఓబీసీ మహాసభను జయప్రదం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా జనరల్‌ సెక్రటరీ ద్యాగా శేఖర్‌ అన్నారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్మూర్‌లోని గాయత్రి జూనియర్‌ కాలేజ్‌లో విద్యార్థిలతో కలిసి కరపత్రాలు విడుదల చేసారు. ఈ సందర్భంగా శేఖర్‌ మాట్లాడుతూ సభకు ఆరు ...

Read More »