Breaking News

Daily Archives: August 3, 2019

మైలారంలో తల్లిపాల వారోత్సవాలు

బీర్కూర్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మైలారం గ్రామంలోని అంగన్‌వాడి సెంటర్‌లో శనివారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ యశోద మహేందర్‌ బాలింతలకు, గర్భిణీలకు, గ్రామస్తులకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి ప్రభాకర్‌రెడ్డి, ఎంపిటిసి మహేందర్‌, అంగన్‌వాడి టీచర్‌, గ్రామ కార్యదర్శి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాల్గొన్నారు.

Read More »

మానస హైస్కూల్లో హరితహారం

ఆర్మూర్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి గ్రామం మానస హైస్కూల్లో శనివారం హరితహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌, విద్యార్థులు మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్‌ మానస గణేశ్‌ మాట్లాడుతూ మనిషి పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు చెట్లు మానవాళికి ఎలా సహాయపడుతున్నాయో, వాటి ఆవశ్యకతను వివరించారు. చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల పరిపాలన అధికారి పద్మ, ప్రిన్సిపాల్‌ రమేశ్‌, ...

Read More »

నిండుకుండలా కళ్యాణి ప్రాజెక్టు

నిజాంసాగర్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో గల కళ్యాణి ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నిండింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టు పూర్తి స్థాయిగా నిండి జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు వద్ద నీటిపారుదల శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఒక వరద గేట్లను ఎత్తి 288 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409,50 మీటర్లకు గాను 409,50 పూర్తిస్థాయి నీటిమట్టం ఉందని ...

Read More »

15 వరకు స్వచ్చ దర్పన్‌ వాల్‌పెయింటింగ్స్‌ పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంపై రాష్ట్ర పీడీ దిలీప్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నుండి జిల్లా స్వచ్ఛ భారత్‌ కన్సల్టెంట్స్‌ శంకర్‌, నారాయణ పాల్గొన్నారు. ఈ నెల 15 వరకు అన్ని గ్రామాలలో స్వచ్ఛ దర్పన్‌ వాల్‌ పైంటింగ్స్‌ వ్రాయించి ఓడిఎఫ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో 434 గ్రామాలకు 315 గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా వ్రాయించి ఓడిఎఫ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం జరిగిందని ...

Read More »

సామాజిక న్యాయ సాధనే ఎంసిపిఐయు ఎజెండా

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎంసిపిఐయు పార్టీ సమావేశం స్ధానిక కార్యాలయంలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్‌ మాట్లాడుతూ దేశంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి మనువాద పోకడలు పోతున్నాయని అందులో భాగంగానే దేశవ్యాప్తంగా రైతులు, దళితులు, మైనారిటీలపై దాడుల పరంపర కొనసాగుతుందని దీన్ని ఎదుర్కొనేందుకు దేశంలోని సామాజిక ఉద్యమ సంఘాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఈ ...

Read More »

బిజెపి సభ్యత్వ నమోదు

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బిబిపేట మండలం కోనాపూర్‌ గ్రామంలో, దోమకొండ మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

Read More »

హనుమాన్‌ విగ్రహం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని కమలనెహ్రూకాలనీలో శనివారం గంగాధర్‌ గౌడ్‌, లయ గోల్డ్‌ వాటర్‌ ప్లాంట్‌ అధినేత అక్రమంగా హనుమాన్‌ విగ్రహాన్ని తొలగించినందుకు భజరంగ్‌ దళ్‌, హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసి రాస్తారోకో, నిరసన ధర్నా చేపట్టారు. ఆర్మూర్‌ పట్టణంలోని కమల నెహ్రు కాలనీలో 428 సర్వే నంబర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అనంతరం విశ్వహిందూ పరిషత్‌ బజరంగ్‌ దళ్‌ ఆర్మూర్‌ శాఖ పూజ నరేందర్‌ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల ...

Read More »

రుర్బన్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజకవర్గంలో రుర్బన్‌ పథకం కింద కొనసాగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి నెల మొదటి శనివారం వ్యవసాయ మార్కెట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా శనివారం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడినది. జాయింట్‌ కలెక్టర్‌ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం రుర్బన్‌ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే ...

Read More »