Breaking News

పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చట్ట వ్యతిరేకంగా పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన చాంబర్‌లో బక్రీద్‌ పండగ ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోను ఆవులను వధించ కూడదని వధించిన పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ జంతు వధ నిరోధక చట్టం 1977 ప్రకారంగా శిక్షార్హులని చెప్పారు.

బక్రీద్‌ పండుగ పశువులు ఖుర్బాని సందర్భంగా రోడ్లమీద ప్రార్ధన మందిరాల వద్ద గాని పబ్లిక్‌ ప్రదేశాల్లో వధించ కూడదని చెప్పారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసు రెవెన్యూ రవాణాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లాలో 17 సమస్యాత్మక పాయింట్ల గుర్తించినట్లు చెప్పారు. వాహన ఓవర్‌ లోడింగ్‌ తో పశువులను రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఎక్కడి నుండి అయితే పశువులు వస్తాయో అక్కడినుండి సంబంధిత వైద్యాధికారిచే పశువులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో రవాణా చేయాలని లేనిపక్షంలో నియమ నిబంధనల మేరకు చర్యలు తప్పవని చెప్పారు. పెద్ద పశువులనే రవాణా చేయాలని అక్రమంగా రవాణా చేసిన పశువులను పట్టుకొని గోశాలలకు తరలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. నాగారం అర్సపల్లి గోపాల్‌ బాగ్‌, బోధన్‌ తాత్కాలికంగా ఆర్మూర్‌ మహిళా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన గోశాలలో తరలించాలని అక్కడ సరైన వసతి సౌకర్యాలైన నీరు, పశుగ్రాసం సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

అంతర్రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలని పోలీస్‌ శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సాలూర, నీల వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఐదు టన్నుల కెపాసిటీ గల వాహనంలో 6 పశువుల కంటే రవాణా చేసిన పక్షంలో చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా 40 కంటే ఎక్కువ గొర్రెలను మేకలను రవాణా చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ఇరువర్గాల కమ్యూనిటీ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ పోలీస్‌ అధికారులను కోరారు.

గ్రామీణ ప్రాంతంలో కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని పశువులను వధించేందుకు నిర్ధిష్టమైన ప్రదేశాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పశు సంవర్ధక అధికారి బాలిక్‌ అహమద్‌ జిల్లాలో చేసిన ఏర్పాట్లతో పాటుగా ఆయా శాఖలు చేపట్టవలసిన చర్యల గురించి కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో డిఆర్‌ఓ అంజయ్య, రవాణా డిప్యూటీ కమిషనర్‌ శివలింగయ్య, ఏసిపి ప్రభాకర్‌ రావు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రియాజ్‌, జిల్లా పంచాయతీ శాఖ అధికారి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *