Breaking News

Daily Archives: August 6, 2019

పౌరసరఫరాల శాఖాధికారుల దాడులు

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిధ హోటళ్లపై మంగళవారం పౌరసరఫరాల శాఖాధికారులు దాడులు నిర్వహించారు. రెస్టారెంట్లు, హోటళ్లు, టీ పాయింట్లపై దాడులు నిర్వహించి గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను అక్రమంగా హోటళ్లలో వినియోగిస్తుండడంతో వాటిని స్వాధీనం చేసుకొని సదరు హోటల్‌ యజమానులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. సిలిండర్లను బాలాజీ గ్యాస్‌ ఏజెన్సీకి అప్పగించినట్టు పేర్కొన్నారు.

Read More »

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15వ ఆగష్టు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖలు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జనహితలో ఏర్పాటైన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. స్టేడియంలో ఏర్పాట్లను మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు చూసుకోవాలన్నారు. వివిధ శాఖలు తమ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. వివిధ శాఖల నుంచి లబ్దిదారులకు అందించే చెక్కులను ఆయా శాఖలు సిద్దం చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 108 సర్వీసు, ఫైర్‌ ...

Read More »

జయశంకర్‌ ఆదర్శాలను యువత పాటించాలి

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ చూపించిన మహానీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ఆదర్శాలను యువత పాటించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జయశంకర్‌ 86వ జయంతి వేడుకలను కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేత ఆధ్వర్యంలో మంగళవారం జనహితతలో ఘనంగా జరిపారు. జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. జయశంకర్‌ భావాల నుంచి ఉద్భవించిన తెలంగాణ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాలైన హరితహారం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం తదితర పథకాల ద్వారా ...

Read More »

హరితహారాన్ని దిగ్విజయం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారాన్ని దిగ్విజయం చేయాలని పర్యావరణాన్ని పెంపొందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద మంగళవారం జిల్లా అటవీ సిబ్బంది, పోలీసు సిబ్బందితో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు అందరిని హరితహారంలో భాగస్వాములను చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి శ్వేత, జిల్లా అటవీశాఖాధికారి వసంత, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

మొక్కలకు జియో ట్యాగింగ్‌ పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో నాటిన మొక్కలకు వందశాతం జియో ట్యాగింగ్‌ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామం, హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఎంట్రెన్సు, ఎగ్జిట్‌ రోడ్లలో రెండు కిలోమీటర్ల మేర 800 మొక్కలు నాటాలని, వాటి పరిరక్షణకు 400 మొక్కలకు ఒక వాచర్‌ చొప్పున ఇద్దరు వాచర్‌లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వారికి ప్రతినెల ఒక్కొక్కరికి రూ.5275 చెల్లిస్తామని పేర్కొన్నారు. ప్రతి ...

Read More »

కాశ్మీరు ఎవరిది?

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాట్సాప్‌లో వచ్చిన కన్నడ వ్యాసానికి తెలుగు సేత వింగ్‌ కమాండర్‌ సుదర్శన్‌ రచన ఇది, కశ్యప మహర్షి పేరుతో ఏర్పడిన ప్రదేశము ‘మైరా’ అనే సంస్కత పదానికి అర్థము ‘సరోవరము’ అని. ఈ మన్వంతరములోని సప్త ఋషులలో ఒకరు కశ్యపుడు. ఇతడు బ్రహ్మ దేవుని మనవడు. ఇతడి తండ్రి మరీచి మహర్షి. ఈ మరీచి బ్రహ్మ దేవుని మానస పుత్రుడు. దక్ష ప్రజాపతి తన పదముగ్గురు కుమార్తెలనూ కశ్యప మునికి ...

Read More »

వేతనాలు ఇప్పించండి

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లాలోని ఏరియా హాస్పిటల్‌ లో సూపరిండెంట్‌ అజయ్‌ కుమార్‌కి ఏఐటియుసి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ హాస్పిటల్‌ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కామారెడ్డి, దోమకొండ, జక్కల్‌, ఎల్లారెడ్డి, మద్నూర్‌ హాస్పిటల్‌లో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు ఉండవు కానీ సచివాలయ నిర్మాణానికి మాత్రం ప్రభుత్వం దగ్గర ...

Read More »

దుబాయ్‌లో మగ్గుతున్న గొల్లపల్లి మధును రప్పించాలి

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి మధు అనే యువకుడు లైసెన్సులు ఏజెంట్ల చేత మోసానికి గురై దుబాయి దేశంలో దిక్కుతోచకుండా ఉన్న బాధితున్ని తక్షణం గ్రామానికి తీసుకొచ్చే విధంగా జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, విదేశీ మంత్రిత్వశాఖ ప్రజాప్రతినిధులు ఇతని విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని ఎంసిపిఐ పార్టీ డిమాండ్‌ చేస్తుందని జిల్లా కార్యదర్శి రాజలింగం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొల్లపల్లికి చెందిన రెడ్డి పెద్ద ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డులో 34 లక్షల 26 వేల రూపాయలతో సిసి రోడ్డు పనులకు, 7వ వార్డులో 42 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులకు, 6వ వార్డులో 82 లక్షల 26 వేల రూపాయలతో సిసి రోడ్డు పనులకు, 14వ వార్డులో 17 లక్షల 39 వేల రూపాయలతో సిసి రోడ్డు పనులకు, 25వ వార్డులో 58 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శంకుస్థాపన ...

Read More »

తెలంగాణ ఉద్యమానికి జయశంకర్‌ సార్‌ దిక్సూచి

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రములోని తెరాస యువజన విభాగం పట్టణ కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆదేశాల మేరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ 85వ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణ యూత్‌ యువజన విభాగం అధ్యక్షులు భాను ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెరాస యువజన విభాగం పట్టణ అధ్యక్షులు చెలిమెల భాను ప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఎంతో కష్ట ...

Read More »

తెలంగాణ జాతిపిత జయశంకర్‌ సార్‌

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతిపిత, ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ సార్‌ జయంతి కామారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. నేతలు సారు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఐకాస నేత జి.జగన్నాథం, న్యాయవాదులు వెంకట్రామిరెడ్డి, నాగభూషణం, తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి.శంకర్‌, డాక్టర్స్‌ ఐకాస నేత డాక్టర్‌ రమేష్‌ బాబు, తెలంగాణ ఉద్యమకారుడు రమేష్‌ గుప్తా, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

కార్పొరేట్‌ కంపెనీల కోసమే 370 రద్దు

ఆర్మూర్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేట్‌ కంపెనీలకు అంబానీ ఆదాని ధనిక వర్గాలకు ప్రధాని మోడీ రాచబాట వేశారని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌, డివిజన్‌ నాయకులు బి.దేవరామ్‌, ముత్తన్నలు విమర్శించారు. మంగళవారం ఆర్మూర్‌ కుమార్‌ నారాయణ భవన్‌లో సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. దేశంలో ప్రధాని మోడి హిట్లర్‌ పాలనను తలపింప చేస్తున్నారని ఆరోపించారు. 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం థర్టీ ఫైవ్‌ నిబంధనలు తొలగించి కాశ్మీర్‌ భూభాగాలను ఆపిల్‌ సరస్సులను, టూరిజాన్ని కార్పొరేట్‌ ...

Read More »

టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి అనూహ్యస్పందన

రెంజల్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో చేపట్టిన టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భూమారెడ్డి అన్నారు. మండలంలోని దండిగుట్ట గ్రామంలో మంగళవారం టిఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలను అధ్యక్షుడు భూమారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండలంలోని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న కషికి ప్రజలు ఆకర్షితులై ...

Read More »

టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి అనూహ్యస్పందన

రెంజల్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో చేపట్టిన టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భూమారెడ్డి అన్నారు. మండలంలోని దండిగుట్ట గ్రామంలో మంగళవారం టిఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలను అధ్యక్షుడు భూమారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండలంలోని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న కషికి ప్రజలు ఆకర్షితులై ...

Read More »

కందకుర్తి చెక్‌ పోస్ట్‌ తనిఖీచేసిన సీపీ

రెంజల్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ పండుగ దృష్ట్యా ఉంచి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో గల చెక్‌ పోస్టులలో భాగంగా మండలంలోని కందకుర్తి వద్ద గల చెక్‌ పోస్ట్‌ను మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ తనిఖీచేశారు. చెక్‌ పోస్టు గుండా అక్రమ రవాణా జరుగకుండా దష్టి పెట్టాలని చెక్‌ పోస్ట్‌ అధికారులకు ఆదేశించారు. ఈ మధ్యలో అంతర్రాష్ట్ర ముఠాలు జిల్లాలో ప్రవేశించినట్లు మూమెంట్స్‌ కనిపించిందని వీటిని అరికట్టేందుకు కూడా చెక్‌ పోస్టు పనిచేస్తుందని అన్నారు. అనంతరం చెక్‌ పోస్ట్‌లో ...

Read More »

అన్ని వివరాలతో జనాభా గణన నిర్వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని రెండు డివిజన్లలో నిర్వహించే ముందస్తు జనాభా గణన అన్ని వివరాలతో జరగాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ప్రి టెస్ట్‌ సెన్సస్‌కు సంబంధించి పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ నెల 6 నుండి 9 వరకు ఎన్యూమరేటర్‌లకు, సూపర్‌ వైజర్‌లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2021 సంవత్సరంలో నిర్వహించే జనాభా గణనకు ముందు నగరంలోని 8, 11 డివిజన్లలో ప్రి టెస్ట్‌ గణన ...

Read More »

తెలంగాణ దార్శనికుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌

రెంజల్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ దార్శనికుడు, సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ ఆదర్శ ప్రాయుడని మండలప్రజాపరిషత్‌ అధ్యక్షురాలు లోలపు రజినీ కిషోర్‌ కొనియాడారు. మంగళవారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో జయశంకర్‌ సార్‌ 86వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దశ దిశను నిర్దేశించిన దార్శనికుడని ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కషి చేసి ఆయన అడుగుజాడల్లో ...

Read More »

జయశంకర్‌ సార్‌ మార్గదర్శనంలో వెళ్లడమే అసలైన నివాళి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ చూపిన మార్గంలో వెళ్ళడమే ఆయనకు సరైన నివాళి అవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ 85వ జయంతిని పురస్కరించుకుని స్థానిక కంఠేశ్వర్‌ వద్దగల ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అత్యంత గౌరవం ఉండేదని, ఆయన చూపిన బాటలోనే ...

Read More »