Breaking News

Daily Archives: August 7, 2019

అదనపు తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 33 లక్షల 23 వేల రూపాయలతో నిర్మించిన ఐదు అదనపు తరగతి గదులను, రాజంపేట మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 35 లక్షల 32 వేల రూపాయలతో నిర్మించిన ఐదు అదనపు తరగతి గదులను బుధవారం ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వి జి గౌడ్‌, తెరాస నాయకులు, పాఠశాల ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Read More »

మీ-సేవా అర్జిదారులకు 9న ఇంటర్వ్యూలు

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డివిజన్‌లో మీ సేవా కేంద్రాల కోసం అర్జి చేసుకున్న వారందరికి ఈనెల 9న ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహించనున్నట్టు కామారెడ్డి ఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. మీసేవా కేంద్రాల కోసం అర్జి చేసుకున్న అభ్యర్థులు వారి పేర్లను ఆర్డీవో, తహసీల్‌ కార్యాలయాల్లో ప్రదర్శించిన ...

Read More »

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. బుధవారం జనహితలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నవజాత శిశువు పుట్టిన నాటినుంచి ఆరునెలల వరకు తల్లిపాలను మాత్రమే తీసుకునేలా గ్రామాల్లో, అంగన్‌వాడి కేంద్రాలు, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు సమష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. పుట్టిన గంటలోపు పిల్లలకు తల్లిపాలు అందించాలని పేర్కొన్నారు. తల్లిపాలు అందించడం వల్ల తల్లులకు రొమ్ము క్యాన్సర్‌, గుండె ...

Read More »

పిల్లలను నులి పురుగుల మాత్రలు వేయించాలి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలు రోగాల బారిన పడకుండా వారికి నులి పురుగుల నివారణ మాత్రలు (ఆల్బండజోల్‌) మాత్రలు వేయించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఆగష్టు 8న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రి నుంచి నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నులిపురుగులు సంక్రమించకుండా నియంత్రించడానికి పిల్లలందరికి మాత్రలు వేయించాలని సూచించారు. వాటివల్ల సంపూర్ణ శారీరక, మానసిక అభివృద్ధి కలుగుతుందని, రక్తహీనత ...

Read More »

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రియంబర్స్‌ ఫీజులను స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు డిమాండ్‌ చేశారు. విద్యాసంవత్సరం పూర్తయినప్పటికీ గత విద్యా సంవత్సరానికి సంబంధించిన బీసీ, ఎస్సి, ఎస్టి, మైనారిటీ, ఈబిసి స్కాలర్‌ షిప్‌లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు. కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ వారికి సంబంధించిన ఒరిజినల్‌ ...

Read More »

వికలాంగుడికి భరోసా ఇచ్చిన కేటీఆర్‌..

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన పార్టీ సినియర్‌ నేత పల్లె కష్ణయ్యకు అండగా నిలిచారు కేటీఆర్‌. కష్ణయ్యను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గతంలో ఒక రోడ్డు ప్రమాదంలో తన కాలును పోగొట్టుకున్న కష్ణయ్యకు కేటీఆర్‌ సూచన మేరకు కత్రిమ కాలును అందించడం జరిగింది. రెండు వారాల క్రితం కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ ...

Read More »

చేనేత దినోత్సవ వేడులు

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు బుధవారం తెలంగాణ పద్మశాలి యువజన సంఘం ఆద్వర్యంలో సికింద్రాబాద్‌ పద్మశాలి కళ్యాణ మండపం వద్ద నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలీ పెద్దలు, రాష్ట్ర పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షులు పీవీ రమణ నేత, ప్రధాన కార్యదర్శి జల్ద లక్ష్మీనారాయణ నేత, పద్మశాలీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి వంశీ నేత, ప్రధాన కార్యదర్శి శంకర్‌ నేత, రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్‌ నేత, కొండా రామ్మోహన్‌ ...

Read More »

మదర్‌ ఇండియా సుష్మా స్వరాజ్‌కు అశ్రు నివాళి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద కేంద్ర మాజీ మంత్రి సుస్మా స్వరాజ్‌ మతికి సంతాపంగా ఆమె చిత్రపటానికి పులమాల వేసి మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణారెడ్డి మాట్లాడుతూ భారత రాజకీయాల్లో మహిళలు కుటుంబ వారసత్వాల ద్వారా తప్ప స్వతహాగా ముందుకు రాలేని పరిస్థితుల్లో జాతీయ భావాలు కలిగిన ఏబివిపిలో పని చేసిన అనంతరం న్యాయవాద వత్తి ...

Read More »

కశ్మీర్‌పై కేంద్రప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండించండి

ఆర్మూర్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాశ్మీర్‌ ఆర్టికల్‌ 370 అధికరణ రద్దును వ్యతిరేకిస్తూ ఆర్మూర్‌ కుమార్‌ నారాయణ భవన్‌లో వామపక్షాల అధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సదస్సుకు సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి యం.ముత్తెన్న అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ డివిజన్‌ నాయకులు బి.దేవారం మాట్లాడుతూ గతంలో భారత దేశంలో వివిధ రాజుల పరిపాలించిన చరిత్ర ఉందని, మరోవైపు బ్రిటిష్‌ వారిని పారదోలి స్వాతంత్య్రం తెచ్చుకొన్న చరిత్ర ఉందన్నారు. ఆ ...

Read More »

రైతుబీమా పథకం మరో ఏడాది కొనసాగింపు

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 13 వ తేదీ వరకు రైతుబీమా పథకం కొనసాగనుంది. 31.10 లక్షల మంది రైతులకు రైతుబీమా పథకం అమలవుతుంది. ఒక్కో రైతుకు 3013.50 ప్రీమియంతో 5 లక్షల బీమా లబ్ది చేకూరనుంది.

Read More »

కేసీఆర్‌ మోడల్‌ హౌస్‌ !

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ. 3.24 లక్షల్లోనే డబుల్‌ బెడ్‌రూం ఇల్లు 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణంకరీంనగర్‌లో యువబిల్డర్‌ ప్రయోగం సక్సెస్‌ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్‌ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్‌ శివారు బొమ్మకల్‌ బైపాస్‌ ...

Read More »

కార్మికులకు 8 వేల 500 వేతనం అమలు చేయాలి

ఆర్మూర్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 8 వేల 500 రూపాయల వేతనాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు, ఆగస్టు 10 తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రాన్ని అందజేస్తున్నట్లు ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. ఈ మేరకు బుధవారం జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సఫాయి కార్మికులు గ్రామంలో పరిశుభ్రతకై కష్టపడి పని ...

Read More »

నిండుతున్న గోదావరి

నందిపేట్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గోదావరి నది లోకి క్రమ క్రమంగా వరద నీరు వచ్చి చేరుతోంది. మండలంలో గత పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు మహారాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి తొణికిసలాడుతున్నది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90టిఎసిలు) కాగా గోదావరి ఎగువ ప్రాంతమైన మహరాష్ట్రలోని నాందేడ్‌, తెలంగాణాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో గత 15 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు సుమారు 13 వేల క్యూసెక్కుల ...

Read More »

ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు సరైన ఆహారాలు అందించడానికి ఏర్పాటైన చట్టం ప్రకారం పని చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు లబ్ధి చేకూర్చాలని తెలంగాణ రాష్ట్ర ఆహారభద్రత కమిషన్‌ చైర్మన్‌ తిర్మల్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో సంబంధిత లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో చట్టం అమలుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలు బాగా అందించడానికి ప్రభుత్వం ఆహార భద్రత చట్టం 2013 ఏర్పాటు ...

Read More »

ఆహార భద్రత చట్టం అమలయ్యేలా చూడాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలకు ఆరోగ్యకరమైన, ఆకలి తీర్చే పౌష్టిక ఆహారాన్ని అందించడం అందరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్‌ చైర్మన్‌ కె. తిర్మల్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు కమిషన్‌ పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో కమిషన్‌ సభ్యులతో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆహార భద్రతకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా అంగన్‌వాడి కేంద్రాలలో మహిళలకు పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం పాఠశాలల్లో విద్యార్థులకు ...

Read More »

పల్లెల్లో హరితహారం

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం ముషీర్‌ నగర్‌ గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా సీఐ ప్రసాద్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిఐ ప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని అన్నారు. అదేవిధంగా వర్షాకాలం అయిన తర్వాత వాటికి నీరుపోసి సంరక్షించాలని పేర్కొన్నారు. అలాగే ...

Read More »