Breaking News

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. బుధవారం జనహితలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నవజాత శిశువు పుట్టిన నాటినుంచి ఆరునెలల వరకు తల్లిపాలను మాత్రమే తీసుకునేలా గ్రామాల్లో, అంగన్‌వాడి కేంద్రాలు, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు సమష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు.

పుట్టిన గంటలోపు పిల్లలకు తల్లిపాలు అందించాలని పేర్కొన్నారు. తల్లిపాలు అందించడం వల్ల తల్లులకు రొమ్ము క్యాన్సర్‌, గుండె జబ్బులు, అండాశయ క్యాన్సర్‌, డయాబెటిస్‌ లాంటి వ్యాదులు నివారించవచ్చన్నారు. నవజాత శిశువు పుట్టిన నాటినుండి వెయ్యి రోజుల వరకు సంపూర్ణ ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం అంగన్‌వాడి కేంద్రాల ద్వారా పౌస్టికాహారాన్ని అందిస్తుందని చెప్పారు.

మాతా శిశు మరణాలను తగ్గించడంలో జిల్లా ముందంజలో ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ అధికారిణి రాధమ్మ, డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో శోభారాణి, జడ్పి సిఇవో కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *