Breaking News

Daily Archives: August 8, 2019

తెలంగాణ చిన్నమ్మకు బిజెపి నివాళి

కామరెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ చిన్నమకు బీజేపీ చిన్న మల్లారెడ్డి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. సుష్మ స్వరాజ్‌ ఆత్మ శాంతించాలని మౌనం పాటించారు. శ్రద్ధాంజలి కార్యక్రమంలో బీజేపీ చిన్న మల్లారెడ్డి నాయకులు ఆనంద్‌ రావు, నరేందర్‌ రెడ్డి, అమత్‌ రావు, శ్రీధర్‌, రామకష్ణ, శ్రీకాంత్‌, వీర రెడ్డి, నాగ స్వామి, రవి, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలో గురువారం సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి ఉత్సవాల గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఆగస్టు 11 తేదీన రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరగనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షుడు రంగోళ్ల మురళి గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు బాంబోతుల లింగాగౌడ్‌, క్యాసంపల్లి గ్రామ ఉప సర్పంచ్‌ బాలకిషన్‌ గౌడ్‌, గౌడ సంఘ సభ్యులు బలరాజ్‌ గౌడ్‌, వెంకట్‌ ...

Read More »

బిజెపి సభ్యత్వ నమోదు

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసెంబ్లీ పరిధిలోని బీబీపేట్‌ మండలంలో కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో బీజేపీ ఎప్పుడు వెనుకడుగు వేయబోదని, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ అని, అందుకే ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు.

Read More »

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

నిజాంసాగర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలలోని రాంపూర్‌లో హరిత హారంలో భాగంగా గురువారం గ్రామ సర్పంచ్‌ నారాయణ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో, మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌, గ్రామ పెద్ద సాయి గౌడ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అంజ గౌడ్‌, గ్రామ యువకులు బస్వరాజు, సాయులు, అంజి, పండరీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లచ్చిరాం, ఉపాద్యాయులు బస్వయ్యా, శ్వేతా, క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ గోపాల్‌ ...

Read More »

ఘనంగా సురేశ్‌ షెట్కార్‌ జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ మాజీ ఎంపీ ఏఐసీసీ కో ఆప్షన్‌ మెంబర్‌ సురేష్‌ కుమార్‌ షెట్కార్‌ జన్మదిన వేడుకలు ఆయన స్వగహంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. జన్మదిన వేడుకలో సురేష్‌ షెట్కార్‌ సేవా సమితి అధ్యక్షులు సాగర్‌ షెట్కార్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు రాకేష్‌ షెట్కార్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకరాయస్వామి, అనద్‌ షెట్కార్‌, మాజీ మండల కో ఆప్షన్‌ తాయర్‌, నాగల్‌గిద్ద మండల అధ్యక్షులు మానిక్‌రావు పటేల్‌, మనూర్‌ మండల ...

Read More »

జాబ్‌ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ మేళా ద్వారా ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని దానిని సద్వినియోగం చేసుకోవాలని అర్బన్‌ శాసనసభ్యులు గణేష్‌ గుప్త అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో గురువారం స్థానిక కళ్యాణ మండపంలో ఉచిత మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఒకవైపు తమ అర్హతకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయో తెలియని యువత మరోవైపు ఆయా కంపెనీలకు అర్హులైన ఉద్యోగులు ఎక్కడ ఉంటారు, తదితర సమస్యలను అధిగమించడానికి జాబ్‌ మేళా సరైన ...

Read More »

గ్రామ సంఘాలు ఏ గ్రేడ్‌లో ఉండేలా చూడాలి

నిజాంసాగర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఐ.కె.పి కార్యాలయంలో ఆగస్టు మాసానికి సంబంధించి నెల వారి గ్రామ సంఘం సహాయకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో గత నెలకు సంబందించిన ఆర్థిక, సామాజిక, గ్రామా సంఘం పుస్తకాలు, చిన్నసంఘాల పుస్తకాలు సక్రమంగా ఉండాలని, అన్నీ సంఘాలు, గ్రామ సంఘాలు ఏ గ్రేడ్‌లో ఉండే విధంగా ఉండాలని జిల్లా డి.పియం. సుధాకర్‌ అన్నారు. బ్యాంకులోనూ ఇప్పించటం, తీసుకున్న ఋణం ఆర్థికంగా అభివద్ధి కోసం తప్పనిసరిగా వాడుకోనె విధంగా చూడాలని మండల ...

Read More »

వివాహిత అదృశ్యం

నిజాంసాగర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం హరిజన వాడకు చెందిన గులాని శ్రీలత (24) ఆగష్టు 6 వ తేదీ సాయంత్రం 4 గంటలకు మెడికల్‌ షాపుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లి అదశ్యమైంది. కాగా శ్రీలతకు గత 40 రోజుల క్రితం సదాశివనగర్‌ మండలం మర్కల్‌ గ్రామానికి చెందిన మహేష్‌తో వివాహం జరిగింది. గత 10 రోజుల క్రితం తల్లి గారింటికి వచ్చిన శ్రీలత పిట్లంలొనే ఉంది. ఇంట్లో జరిగిన చిన్న గొడవల కారణంగా ఇంటి ...

Read More »

వణికిస్తున్న విష సర్పాలు

నందిపేట్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెరుగుతున్న పాముకాటు బాధితులు ఆందోళనకు గురికావొద్దంటున్న వైద్యులు నందిపేట మండలం లోని పలు గ్రామాలలో ప్రజలు వర్ష కాలం ప్రారంభమైన నాటి నుండి పాము కాటుకు గురవుతూ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు. వానాకాలంలో పాముల సంచారం విపరీతంగా ఉంటుంది. పంటభూములతో పాటు జనసంచార ప్రాంతాలలోనూ వస్తుంటాయి. అయితే రైతన్నలతో పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ పాము కాటుకు గురైనా ఆందోళన అక్కర్లేదని వారు సూచిస్తున్నారు. వర్షాకాలం ...

Read More »