Breaking News

Daily Archives: August 9, 2019

గ్రంథాలయం ప్రారంభం

బాన్సువాడ, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశాయిపేట్‌ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర యువనాయకులు దేశాయిపేట్‌ పిఏసిఎస్‌ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింతగా అభివద్ధి చేసుకుందామని బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టిందని, ప్రతీ గ్రామంలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో యువకుల, విద్యార్థుల, పోటీ పరీక్షల నిమిత్తం గ్రంధాలయాన్ని ప్రారంభించారు. గ్రామంలో ...

Read More »

నిర్బంధ నియంత పాలనకు చరమగీతం పాడుతాం

ఆర్మూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని కుమార్‌ నారాయణ భవనంలో సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ అధ్యక్షతన ఆదివాసీల ముద్దుబిడ్డ కామ్రేడ్‌ లింగన్న సంతాప సభ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ ఉంటుందని, నిర్బంధం ద్వారా నక్సల్స్‌ను అణచివేస్తే మరింత ఉద్యమాలు బలపడతాయని చెప్పారన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి తెలంగాణలో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్‌ ...

Read More »

నందనవనం నందిపేట్‌ ఠాణా

నందిపేట్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ఠాణా (పోలీసు స్టేషన్‌) నందనవనంలామారింది. ఠాణా ఆవరణ మొత్తం పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా మూడేళ్ళ క్రితం అప్పటి ఎస్‌ఐ జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాటిన మొక్కలు ఇపుడు చెట్లుగా మారి ఆయాగ్రామాల నుంచి ఠాణాకు వచ్చే వారికి ఆహ్లాదాన్ని పంచడమే గాకుండా కూర్చుండడానికి నీడనిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఠాణా సిబ్బంది పట్టుదలతో మొదటినుంచి ప్రతి ఏటా నిరంతరంగా ...

Read More »

బూత్‌ కమిటీల నియామకం

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని 18 వార్డులో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆదేశాల మేరకు 18 వార్డులోని 42, 43, 44 తెరాస పార్టీ బూత్‌ కమిటీలను ఎన్నుకున్నారు. 42వ బూత్‌ కమిటీ అధ్యక్షులుగా చింతల శ్రీనివాస్‌, 43వ బూత్‌ కమిటీ అధ్యక్షులుగా బట్టు ఎల్లయ్య, 44వ బూత్‌ కమిటీ అధ్యక్షులుగా దువ్వల భూషణంను నియమించారు. బూత్‌ కమిటీ ఎన్నికలు పట్టణ బూత్‌ కమిటీల ఇంచార్జ్‌ పిప్పిరి వేంకటి, 42,43,44 బూత్‌ కమిటీల ...

Read More »

బిజెపి సభ్యత్వ నమోదు

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాచారెడ్డి మండలంలోని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు కాటిపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన, ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి ప్రజలకు చేరువయ్యేలా నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. తెలంగాణాలో బీజేపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందని, నియంతత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు ...

Read More »

సింగసముద్రం లోకి చేరుకున్న వరద నీరు

నిజాంసాగర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డిపేట మండల ప్రజల వరప్రదాయిని అయిన సింగసముద్రం లోనికి గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వరదనీరు వచ్చి చేరుతుంది. కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగుతో పాటు మాచారెడ్డి మండలంలోని సోమారిపేట గ్రామాలల్లో గల చెక్‌ డ్యామ్‌లు నిండి కుంటలు పొంగి పొర్లడంతో సముద్రంలోనికి నీరు ఉధతంగా వచ్చి చేరింది. కాగా స్థానిక మాజీ ఎంపీటీసీ సభ్యులు ఒగ్గు బాలరాజు యాదవ్‌ ఆధ్వర్యంలో రైతులు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. నీరు వచ్చి ...

Read More »

ఘనంగా ఆదివాసి దినోత్సవం

నిజాంసాగర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారత విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో శుక్రవారం ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరుపోశారు. వనవాసి సెల్‌ జిల్లా కన్వీనర్‌ నరేష్‌ నాయక్‌ మాట్లాడుతూ దేశంలో ఆదివాసీ గిరిజనులు విద్య వైద్య, జీవన స్థితిగతులు అనేక విషయాలపై ఏబీవీపీ ప్రత్యేక దష్టి సారించడం జరుగుతుందన్నారు. దేశంలో ఆదివాసి విషయాలపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నేడు ఏబీవీపీ ఆదివాసి దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ...

Read More »

సీఎం సహాయనిది…పేద ప్రజల ఆరోగ్య దాయిని

నందిపేట్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పేద ప్రజలకు సిఎం సహాయనిది ఆరోగ్య దాయినిగా పని చేస్తుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. నందిపేట్‌ మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌ నాయకులు కాజా మోహిదుద్దీన్‌ అనారోగ్యంతో నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయనకు సియం సహాయ నిధి క్రింద 2 లక్షల సహాయానికి సంబంధించిన సిఎంఆర్‌ఎఫ్‌ (ఎల్‌ఓసి) వారికి శుక్రవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే అందజేశారు.

Read More »

సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన

రెంజల్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని నిజామాబాద్‌ వ్యవసాయ అధికారి రవీందర్‌ అన్నారు. మండలంలోని తాడ్‌బిలోలి, బొర్గం గ్రామాలలో శుక్రవారం రైతులకు రెంజల్‌ వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ రావ్‌ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అధిక లాభాలు పొందవచ్చని, రైతులు రసాయన ఎరువులు వాడడం మానేసి పూర్తిగా సేంద్రియ పద్దతుల్లోనే పంటను సాగుచేయాలన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయసమితి గ్రామ అధ్యక్షుడు ...

Read More »

ఎంతో ఆలోచించి కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించాం

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 అమలును ఆయుధంగా మలచుకొని పాకిస్థాన్‌ నిరంతరం ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒకటే భారత్‌.. ఒకటే రాజ్యాంగం కల సాకారమైందన్నారు. గురువారం రాత్రి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి జమ్మూకశ్మీర్‌ అంశంపై కీలక ప్రసంగం చేశారు. దేశ ప్రజల అభ్యున్నతి కోసం చేసిన ...

Read More »

భారతరత్న పురస్కారాలు…

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2019 ఏడాదికి గాను దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం అవార్డులను ప్రదానం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దివంగత సంఘ సంస్కర్త నానాజీ దేశ్‌ముఖ్‌, దివంగత దర్శక నిర్మాత, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్‌ హజారికాకు భారతరత్న పురస్కారాలు వరించాయి.

Read More »