Breaking News

Daily Archives: August 10, 2019

బిజెపి సభ్యత్వ నమోదు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ భిక్కనూర్‌ మండల శాఖ ఆధ్వర్యంలో భిక్కనూర్‌ మండలం జంగంపల్లి, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్‌ గ్రామాలలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ చూపిన దారిలో, వాజపేయి, అద్వానీ వేసిన బాటలో నేటి తరం అంతా నరేద్ర మోడీ సుపరిపాలనలో, అమిత్‌షా నాయకత్వంలో బీజేపీ కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ...

Read More »

28న బిసి ఐక్యవేదిక సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా బిసి, ఎంబిసి కులాలు ఐక్యవేదిక జిల్లా సదస్సు ఈనెల 18న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఎంసిపిఐయు ప్రజా సంఘాల బాద్యులు రాజలింగం తెలిపారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కామారెడ్డి బిసి కులాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రభుత్వం జస్టిస్‌ ఈశ్వరయ్య కమిషన్‌, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌లు సూచించిన ప్రకారం బీసీ కులాల జాబితా కులాల వారీగా జనాభా లెక్కలు ...

Read More »

బ్రహ్మకుమారీల రక్షాబంధన్‌

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15 ఆగష్టు గురువారం రోజున జరిగే రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓం శాంతి బ్రహ్మకుమారి సోదరిమణులు రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు గెరిగంటి లక్ష్మినారాయణ ముదిరాజ్‌కు బ్రహ్మ కుమారి సోదరిమణులు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు కాళ్ళ గణేష్‌, భూంరెడ్డి, రాం కుమార్‌ గౌడ్‌, మాసుల లక్ష్మీనారాయణ, రాంరెడ్డి పాల్గొన్నారు.

Read More »

వేతనాల అమలుకై ధర్నా

ఆర్మూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత సంవత్సరం సందర్భంగా నెలకు 8 వేల 500 వేతనం ఇస్తామని ప్రకటించి నేటికి సంవత్సరం గడుస్తున్నా అమలు చేయక పోవడం దుర్మార్గమని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో ఏఐటియుసి, ఐఎఫ్‌టియు కార్మిక సంఘాల ...

Read More »

హరితహారం లక్ష్యాలు పూర్తిచేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం ఐదవ ఫేస్‌లో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. చాలెంజ్‌ను ప్రతి ఒక్కరు స్వీకరించి, తెలంగాణను హరిత వనంగా మార్చుకుందామన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మరొకరితో ఒక మొక్క నాటించాలని, భవిష్యత్‌ తరాలకు ఆక్సిజన్‌ ఉండాలంటే మనమంతా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే చెప్పారు. ఆగస్టు మాసంలో హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా, తెలంగాణను హరిత వనంలా తయారుచేసుకుందామన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని అన్ని ...

Read More »

సంతాపసభ గోడప్రతుల ఆవిష్కరణ

ఆర్మూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు భూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరుడైన లింగన్న సంతాప సభ ఈనెల 13 న హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు దేవారాం, ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి ముత్తెన్న తెలిపారు. ఈ మేరకు శనివారం సంతాప సభకు సంబంధించిన గోడప్రతులను కుమార్‌ నారాయణ భవన్‌ ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్‌ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, ...

Read More »

మహా పాదయాత్ర విజయవంతం చేయండి

నిజాంసాగర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో గల అంజనాద్రి ఆలయం వద్ద మహాపాదయాత్ర పత్రాలను (పోస్టర్లను) సిడిసి చైర్మన్‌ దుర్గా రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గైని విఠల్‌, కిషోర్‌ కుమార్‌, సర్పంచులు సంగమేశ్వర్‌ గౌడ్‌, కమ్మరి లత అంజయ్య, ఉప సర్పంచ్‌ వెంకటేశం, మాజీ సర్పంచ్‌ ఆనంద్‌ కుమార్‌ ఆవిష్కరించారు. అనంతరం కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇంతకు ముందు అంజనాద్రి నుండి బీదర్‌ కర్ణాటక, మిర్జాపూర్‌, కల్యంపేట వరకు పాదయాత్ర ...

Read More »

గ్రీన్‌ చాలెంజ్‌కు ఎమ్మెల్యే పిలుపు

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌కు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మరొకరికి గ్రీన్‌ చాలెంజ్‌ విసిరి వారితో ఒక మొక్కను నాటించాలన్నారు. ఇప్పటి నుండి తన వద్దకు వచ్చె అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పూల బొకేలు, శాలువాలతో కాకుండా వాటి స్థానంలో ఒక మొక్కను తనకు బహుకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి మొక్కతో సెల్ఫీ దిగి ...

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూరు గ్రామంలో శనివారం ముగ్గురికి కల్యాణ లక్ష్మీ చెక్కులు, జీవనన్న పెళ్లి కానుక పట్టుచీర పంపిణీ చేశారు. అదేవిధంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఆర్మూర్‌ ఎంపిపి పస్కా నర్సయ్య పంపిణీ చేశారు. నలిమేల నారాయణకు రూ.60 వేలు, అమత కిసాన్‌కు రూ. 60 వేల చెక్కు, బసకొండ మురళికి రూ. 60 వేల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కళ్లెం మోహన్‌, వైస్‌ ఎంపిపి బోజకల చిన్నారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ మల్లేష్‌, ...

Read More »

12న పల్లెటూరోళ్లం పాటల విడుదల

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంగీత్‌ కల్చరల్‌ అకాడమి 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 12వ తేదీ సోమవారం పల్లెటూరోళ్ళం, రాజఛాహం పాటల విడుదల ఉంటుందని అకాడమి ప్రతినిధులు తెలిపారు. నిజామాబాద్‌ రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి అవార్డులు ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. ముఖ్య అతిథులుగా ప్రజాకవి, సినీ గేయరచయిత గోరెటి వెంకన్న, మానకొండూరు ఎమ్మెల్యే, కవి, రసమయి బాలకిషన్‌ పాల్గొంటారన్నారు. అలాగే ప్రత్యేక అతిథులుగా ఎవరెస్టు అధిరోహకురాలు మాలవత్‌ ...

Read More »