Breaking News

Daily Archives: August 11, 2019

ప్రభుత్వ సెలవు దినాల్లో ప్రయివేటు క్లాసులు…

కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో పలు కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయని ఏబివిపి ప్రతినిధులు పేర్కొన్నారు. స్పెషల్‌ క్లాసుల పేరుతో ప్రభుత్వ సెలవు దినాల్లో కళాశాలలు నడుపుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం పలు కళాశాలలను ఏబివిపి ప్రతినిధులు తనికీ చేశారు. ఆయా కళాశాలల్లోని విద్యార్థులను ఇంటికి పంపించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతుల పేరుతో హింసిస్తున్న ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌ఐవోకు విన్నవించారు. ప్రత్యేక తరగతుల పేరుతో ...

Read More »

కామ్రేడ్‌ లింగన్న సంతాప సభ పోస్టర్‌ ఆవిష్కరణ

ఆర్మూర్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్‌ లింగన్నను కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని రోళ్ళపాడు వద్ద బూటకపు ఎన్‌కౌంటర్లో కాల్చి చంపి జీవించే హక్కును కేసీఆర్‌ ప్రభుత్వం హరించిందని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టియు) నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. ఆదివారం జక్రాన్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. కామ్రేడ్‌ లింగన్న ఆదివాసుల సమస్యలపై, పోడు భూములు ప్రజలకే దక్కాలని నిరంతరం పోరాడి, ప్రజల హదయాల్లో నిలిచిన ముద్దుబిడ్డ అని ఆయన ...

Read More »

త్యాగానికి ప్రతిరూపం…బక్రీద్‌ పండుగ

నందిపేట్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ అంటే బకర్‌ ఈద్‌ అని అర్థం. బకర్‌ అనగా జంతువని, ఈద్‌ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్‌ ఖుర్బాని అని, అరబిక్‌లో ఇదుల్‌ అజహ అని అంటారు. ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం జిల్‌ హజ్‌ నెలలో బక్రీద్‌ పండుగవస్తుంది. జిల్‌ హజ్‌ నెల పదో రోజున ఈ పండుగ జరుపుకుంటారు. మహ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని ...

Read More »

ఛలో రవీంద్రభారతి

కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం రవీంద్ర భారతిలో జరుగుతున్న తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 369 వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడానికి కామారెడ్డి నుండి జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా నాయకులు తరలివెళ్లారు.

Read More »

శాస్త్రీయ విద్యాకోసం ఉద్యమం

బీర్కూర్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల శాస్త్రీయ విద్యాకోసం (ఏఐఎస్‌బి) ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ క షి చేస్తుందని జిల్లా కన్వీనర్‌ భైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులను విద్యార్థులు గమనించాలన్నారు. శాస్త్రీయ విద్యను సక్రమంగా అందించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఉన్నత పాఠశాలలో, కళాశాలలో సిబ్బంది, మౌలిక వసతులు కూడా సరిగా లేవని అన్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ...

Read More »

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జనగామ గ్రామంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పాల్గొని మొక్కలు నాటి నీరుపోశారు. దోమకొండ మండల మాజీ జెడ్పిటిసి గండ్ర మధుసూదన్‌రావు, కామారెడ్డి మాజీ జెడ్పిటిసి సినిమా మోహన్‌ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ బండారి నర్సారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More »

ఉచిత సంస్కృత సంభాషణ శిబిరము

నిజామాబాద్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ మంగళవారం వరకు ఉచిత దశదిన సంస్కృత సంభాషణ శిబిరం నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ముబారక్‌నగర్‌ విజయ్‌ పబ్లిక్‌ స్కూల్‌ వద్దగల శివసాయిబాబా మందిరంలో ఆదివారం నుంచి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శిబిరం ప్రారంభం కానుందన్నారు. పెద్దలు, పిల్లలు, సంస్కృత అభిమానులు శిబిరంలో పాల్గొని సంస్కృతం సంభాషణం నేర్చుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9949234007, ...

Read More »