Breaking News

Daily Archives: August 12, 2019

రాష్ట్ర ప్రభుత్వం గల్ప్‌ కార్మికుల పట్ల శ్రద్ద వహించాలి

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలని, ఎన్‌ఆర్‌ఐ పాలసీ వెంటనే అమలు చేయాలని, ఉన్నత చదువులు చదివి, ఉపాది కరువై గల్ఫ్‌ దేశాలు పోతే ఏజెంట్‌ మోసాలవల్ల, కంపనీలు జీతాలు ఇవ్వక, అప్పులు కట్టలేక, ఆత్మహత్య చేసుకుంటున్నారని గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక సదాశివనగర్‌కు చెందిన పోలబోయిన శ్రీనివాస్‌, సృజన్‌ నంది (సౌదీ అరేబియా ఆల్‌ గాస్సిమ్‌ అండ్‌ హయిల్‌) కోఅర్డినేటర్‌ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. విధినిర్వహణలో ప్రమాదవశాత్తు గాయ ...

Read More »

ఘనంగా ఏఐఎస్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లాలోని ఏఐఎస్‌ఎఫ్‌ కార్యాలయం ముందు 84 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ 1936 ఆగస్ట్‌ 12న బెనారస్‌ యూనివర్సిటీలో ఏఐఎస్‌ఎఫ్‌ కేవలం ఏడుమంది సభ్యులతో ఆవిర్భవించి నేడు దేశ వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్న చరిత్ర ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘము అన్నారు. దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘము ఏఐఎస్‌ఎఫ్‌ అని వారు అన్నారు. ...

Read More »

భక్తితో బక్రీద్‌

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ పండుగ సందర్భంగా తెరాస రాష్ట్ర మైనారిటీ శాఖ అధ్యక్షులు ఎంకె.ముజీబుద్దిన్‌కు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Read More »

కల్లుగీత వత్తిని రక్షించాలనీ కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారేడ్డిలొ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సైదగౌని వెంకట్‌ గౌడ్‌, దెవునుపల్లి గౌడ సంఘం అధ్వర్యంలో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ సందర్భంగా వెంకట్‌ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన అనంతరం కల్లుగీత వత్తికి మంచి రోజులు వస్తాయనీ అనుకున్నా రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత వత్తిని నాశనము చేయాలని చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్లుగీత వత్తిని రక్షిస్తే ఐదు లక్షల కుటుంబాలకు జీవనాధారం చూపించవచ్చనీ, కల్లు..గూడలు అనీ ...

Read More »

పద్మశాలీల అభివృద్దికి కృషి చేస్తా

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీవీ రమణ నేత పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కామారెడ్డి జిల్లాకి చెందిన కాముని సుదర్శన్‌ నేతను నియమించి ఉత్తర్వులు జారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాముని సుదర్శన్‌ నేత మాట్లాడుతూ తన సేవలు గుర్తించి తనపై నమ్మకంతో పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించిన పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీవీ రమణ నేతకు, ...

Read More »

కరెంట్‌ షాక్‌తో రైతుకు గాయాలు

రెంజల్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు శంకర్‌ తన పంట పొలం వద్ద పనులు చేస్తుండగా బోరు బావి వద్ద గల విద్యుత్‌ తీగలు తగలడంతో శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Read More »

భక్తి శ్రద్ధలతో బక్రీద్‌

రెంజల్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భక్తిశ్రద్ధలతో మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ పండుగను సోమవారం రెంజల్‌ మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి చిన్న పెద్ద తేడా లేకుండా దర్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

భక్తిధాం తాండాలో హరితహారం

నిజాంసాగర్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలం భక్తిధాం తండా (బాల్కం చెల్క) గ్రామ పంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా తాండా వాసులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భవాని మాత మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొక్కల పెంపకం అవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ రమావత్‌ రామ్‌ సింగ్‌, మండల జెడ్‌పిటిసి నరసింహా రెడ్డి, ఎంపీపీ ...

Read More »

వాహనదారుల గోడు అధికారులకు పట్టదా

నిజాంసాగర్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం బొగ్గు గుడిసె నుంచి నిజాంసాగర్‌ – సుల్తాన్‌ నగర్‌ రహదారిలో పెద్ద పెద్ద గుంతలు పడి వాహనదారుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. చిన్నపాటి వర్షానికి చిన్న పెద్దగా మారడంతో వాహనాలు గుంతలో కూరుకుపోయి వాహనాలు లాక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. గుంతలు పడి నెల రోజులు గడుస్తున్నా అటు వైపు ఆర్‌అండ్‌బి అధికారులు కన్నెత్తి చూడడం లేదంటే ఆశ్చర్యం లేదు. గుంతల్లో పడి చాలా మంది వాహనదారులు గాయాలపాలయ్యారు. కానీ ...

Read More »

స్కూలుకు దారేది…

బాన్సువాడ, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాదు మండలంలోని అంకోల్‌ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు వెళ్లే దారి అధ్వాన్నంగా తయారైంది. గడిచిన కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి పాఠశాల ముందు దారి పూర్తిగా మోకాలు లోతు బురదమయంగా మారింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల గేటు లోపలికి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి ఉందని కార్యదర్శి హనుమాండ్లు యాదవ్‌ అన్నారు.

Read More »

భక్తి శ్రద్దలతో బక్రీద్‌

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సోమవారం బక్రీద్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు మాజీ మంత్రి మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌కి జిల్లా నాయకులు ఈద్‌ ముబారక్‌ తెలియజేశారు. హిందూ ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మహ్మద్‌ అలీ షబ్బీర్‌ మాట్లాడుతూ తమకు కలిగినంతలో కొంత భాగాన్ని బీదలకు, బంధుమిత్రులకు దాన ...

Read More »

పవిత్ర బంధానికి ప్రతిరూపం రక్షాబంధన్‌

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర బంధానికి ప్రతిరూపం రక్షాబంధన్‌ అని మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. రక్షాబంధన్‌ వేడుకలను బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రతిఒక్కరూ మంచిని పెంచే ప్రయత్నం చేయాలన్నారు. ప్రపంచంలో సోదరబంధం అత్యంత పవిత్రమైందన్నారు. ప్రతి ఏటా కామారెడ్డి లో రక్షాబంధన్‌ వేడుకలు బ్రహ్మకుమారిస్‌లతో నిర్వహించుకోవడం ఆనందంగా వుందన్నారు.

Read More »

కశ్మీర్‌ ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ మంత్రి, శాసన మండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ బక్రీద్‌ పండుగ సందర్భంగా సోమవారం ఈద్గా వద్ద ప్రసంగించారు. దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని అందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తు హరియానా ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఈద్గాలో తీర్మానించారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ...

Read More »

ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్‌ లింగన్న

ఆర్మూర్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిఘటన పోరాట యోధుడు సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ లింగన్న సంతాప సభను హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2019 ఆగస్టు 13న జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి.సూర్య శివాజీ ప్రజలను కోరారు. మామిడిపల్లిలో లింగన్న సంతాప సభ పోస్టర్లను ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడారు. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ...

Read More »

సోమలింగేశ్వర ఆలయంలో స్పీకర్‌ ప్రత్యేక పూజలు

బాన్సువాడ, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసరుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామ శివారులోని స్వయంభూ సోమలింగేశ్వర దేవస్థానాన్ని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం సందర్శించారు. ఉదయం సోమలింగాల దేవస్థానానికి విచ్చేసిన స్పీకర్‌ పోచారం మొదట స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానంలో జరుగుతున్న అభివద్ధి పనులను పరిశీలించారు. దేవస్థానం వద్ద రూ.30 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం, రూ.50 లక్షలతో జరగనున్న ఇతర అభివద్ధి పనులను పరిశీలించారు.

Read More »

భక్తి శ్రద్దలతో బక్రీద్‌

నందిపేట్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్యాగనిరతిని చాటే బక్రీద్‌ ఈద్‌ (ఈద్‌-ఉల్‌-జుహా) పండుగను జిల్లావ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. బక్రీద్‌ సందర్భంగా సోమవారం ఉదయం ముస్లింలు ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. ఇబ్రహీం అలైసలాం తన కుమారుడు అయిన ఇస్మాయిల్‌ను దైవమార్గంలో బలి ఇచ్చేందుకు ఉపక్రమించటం ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్‌ ఇస్మాయిల్‌ బదులుగా మేకను పోలిన జీవాన్నీ ఉంచడం జరిగింది. ఇబ్రహీం అలైహి సలాం యొక్క త్యాగ పరీక్షను గుర్తుచేసుకోవడమే బక్రీద్‌ పండుగ ముఖ్య ఉద్దేశం. బక్రీద్‌ ...

Read More »