Breaking News

వాహనదారుల గోడు అధికారులకు పట్టదా

నిజాంసాగర్‌, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం బొగ్గు గుడిసె నుంచి నిజాంసాగర్‌ – సుల్తాన్‌ నగర్‌ రహదారిలో పెద్ద పెద్ద గుంతలు పడి వాహనదారుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. చిన్నపాటి వర్షానికి చిన్న పెద్దగా మారడంతో వాహనాలు గుంతలో కూరుకుపోయి వాహనాలు లాక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది.

గుంతలు పడి నెల రోజులు గడుస్తున్నా అటు వైపు ఆర్‌అండ్‌బి అధికారులు కన్నెత్తి చూడడం లేదంటే ఆశ్చర్యం లేదు. గుంతల్లో పడి చాలా మంది వాహనదారులు గాయాలపాలయ్యారు. కానీ అధికారులకు మాత్రం గుంతలు పూడ్చాలన్న ఆలోచన మత్రం రావడం లేదు. ఈ విషయమై స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రహదారి మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *