Breaking News

స్కూలుకు దారేది…

బాన్సువాడ, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాదు మండలంలోని అంకోల్‌ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు వెళ్లే దారి అధ్వాన్నంగా తయారైంది. గడిచిన కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి పాఠశాల ముందు దారి పూర్తిగా మోకాలు లోతు బురదమయంగా మారింది.

దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల గేటు లోపలికి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి ఉందని కార్యదర్శి హనుమాండ్లు యాదవ్‌ అన్నారు.

Check Also

పరీక్ష కేంద్రం తనిఖీ

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో ...

Comment on the article