Breaking News

Daily Archives: August 13, 2019

ఘనంగా రక్షాబంధన్‌

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్షాబంధన్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. 15 ఆగష్టున రాఖీ పండగ కావడంతో ఆయా సంస్థలు రాఖీలు ధరించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి ఏబివిపి ఆధ్వర్యంలో మంగళవారం రక్షాబంధన్‌ కార్యక్రమం నిర్వహించారు. పలు కళాశాలల్లో విద్యార్థులు ఒకరినొకరు రాఖీలు కట్టుకొని నేను నీకు రక్షా, నీవు నాకు రక్షా, మనం ఈ దేశానికి, ధర్మానికి రక్ష అంటూ రక్షాధారణ చేశారు. అలాగే బ్రహ్మకుమారీలు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు ...

Read More »

బిటి రోడ్డు ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం బీడి వర్కర్స్‌ కాలనీ, జయశంకర్‌ కాలనీలో రూ. 4 కోట్లతో నిర్మించిన బిటి రోడ్లను మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ ప్రారంభించారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More »

సాటాపూర్‌ నర్సరీని సందర్శించిన ఎంపీడీవో

రెంజల్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలోని ఉపాధి హామీ నర్సరీని మంగళవారం ఎంపీడీవో శ్రీనివాస్‌ ఆకస్మికంగా సందర్శించారు. నర్సరీలోని ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు సూచించారు. ప్రతి మొక్కను కాపాడుకునే బాధ్యత తమ పైనే ఉందని, ఎప్పటికప్పుడు నర్సరీలను పరిశీలించి మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఆయన వెంట ఈసి శరత్‌ చంద్ర, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గంగాధర్‌ ఉన్నారు.

Read More »

వాసర్‌ గ్రామంలో హరితహారం

నిజాంసాగర్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిర్గపూర్‌ మండలంలోని వాసర్‌ గ్రామంలో హరితహరం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు మహరెడ్డి భూపాల్‌ రెడ్డికి పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ రమావత్‌ రామ్‌ సింగ్‌, మండల జెడ్పీటీసీ రాఘవ రెడ్డి, ఎంపీపీ జార. మైపాల్‌ రెడ్డి, ...

Read More »

ఎమ్మెల్యే పరామర్శ

నిజాంసాగర్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శంకరంపేట్‌ – మండలంలోని వీరోజిపల్లి గ్రామానికి చెందిన శంకర్‌ గౌడ్‌ భార్య మరణించినందున వారి కుటుంబ సభ్యులను శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయన వెంట మండల జెడ్పీటీసీ భూపతి, విజయరామరాజు, ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్‌ గౌడ్‌, గ్రామ సర్పంచ్‌ రవీందర్‌, గ్రామపార్టీ అధ్యక్షులు అమర్‌, శంకర్‌ తదితరులు ఉన్నారు.

Read More »

ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణాలో ఆవిష్కరణల సంస్కతికి ప్రోత్సాహం ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో ఇన్నోవేషన్‌ ఎగ్జిబిషన్‌ను ఆగష్టు 15 వ తేదీన ప్రారంబిస్తున్నారు. ఆసక్తి గల వారు తమ తమ సొంత జిల్లాల్లో వారి ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. తెలంగాణ ప్రభుత్వం నెలరోజుల క్రితం ప్రారంభించిన కార్యక్రమానికి మొత్తం 500 దరఖాస్తులు వచ్చాయి. అందులో 360 ప్రదర్శనకు అర్హత సాధించడం జరిగింది. అలాగే 220 షార్ట్‌ లిస్ట్‌ చేయడం జరిగింది. ...

Read More »

కొనసాగుతున్న రైతు రిలే దీక్షలు

రెంజల్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టా పాసు పుస్తకాల కోసం రెంజల్‌ మండలంలోని తహసీల్‌ కార్యాలయం వద్ద కందకుర్తి రైతులు చేపట్టిన దీక్ష మంగళవారానికి ఏడవ రోజుకు చేరుకుంది. తమ భూములకు సంబంధించిన పట్టా పాస్‌ పుస్తకాలు తమకు ఇచ్చేంత వరకు దీక్షను కొనసాగిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తున్నా తమ సమస్య పరిష్కారం కోసం ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం శోచనీయమన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం జరిగేలా ...

Read More »

ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిది

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిమీద ఉన్నదని, జాతి, కుల, భాష, ప్రాంత బేధాలు లేకుండా మనందరం హిందువులమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారక్‌, సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్థానిక జనార్ధన్‌ గార్డెన్స్‌లో ఆరెస్సెస్‌ ఆధ్వర్యంలో రక్షాబంధన్‌ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో కోటగల్లి, గాజుల్‌పేట్‌ ప్రాంతాలకు చెందిన స్వయంసేవకులు పాల్గొన్నారు. ప్రధాన వక్తగా విచ్చేసిన అప్పాల ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ దేశాన్ని ...

Read More »