నిజాంసాగర్, ఆగష్టు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిర్గపూర్ మండలంలోని వాసర్ గ్రామంలో హరితహరం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు మహరెడ్డి భూపాల్ రెడ్డికి పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రమావత్ రామ్ సింగ్, మండల జెడ్పీటీసీ రాఘవ రెడ్డి, ఎంపీపీ జార. మైపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రావు పాటిల్, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- దూపల్లిలో ఘనంగా బోనాల పండుగ - December 15, 2019
- జాగతి మండల అధ్యక్షుడిగా నీరడి రమేష్ - December 15, 2019
- బీజేపీ కామారెడ్డి మండల అధ్యక్షుడుగా గడ్డం నరేష్ రెడ్డి - December 15, 2019