Breaking News

పశువుల దాణా పంపిణీ

నందిపేట్‌, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే పశువుల దాణాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి వకిడి సంతోష్‌ అన్నారు. బుధవారం పశువైద్యశాఖ అద్వర్యంలో తల్వేద గ్రామ రైతులకు సబ్సిడీపై మంజూరైన దాణా బ్యాగులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

పోషకాలు ఉండే దాణాను విరివిరిగా వాడితే పశువులు ఆరోగ్యంగా ఉండి వ్యవసాయ పనులకు బాసటగా నిలుస్తాయని ఎంపిపి సంతోష్‌ అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యుడు హన్మంత్‌ రెడ్డి, ఎంపీడీఓ నాగవర్ధన్‌, గ్రామ సర్పంచ్‌, ఎంపిటిసి, రైతులు పాల్గొన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *