Breaking News

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో 2005 సమాచార హక్కు చట్టంపై అవగహన సదస్సు నిర్వహించారు. ఎంపిపిఓ మల్లికార్జున్‌ రెడ్డి, ఎంఆర్‌ఓ రామేశ్వర్‌ రావు, ఏపీఎం చామంతి చేతులమీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజల చేతుల్లో వజ్రాయుధమని, దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం గురించి అఖిల భారతీయ ప్రజా సేవ సమితి సమాచార హక్కు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ గ్రామపంచాయితి నుండి పార్లమెంటు వరకు సమాచారం పొందవచ్చునని పెర్కొన్నారు. కేవలం 10 రూపాయల రుసుముతో జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో సమాచారం పొందవచ్చునని, తెల్ల రేషన్‌ కార్డు దారులు ఉచితంగా సమాచారం పొందవచ్చు అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సమాచార హక్కు చట్టము ప్రతినిధులతో పాటు ఎంపిపి అబ్దుల్‌ నయిమ్‌, సహకార సంఘము అధ్యక్షుడు నారగౌడ్‌, బాలకిషన్‌, గుండా మహేందర్‌, సాయిరాం, రాజు, సాయిలు వి.ఆర్‌.ఓ దుర్గయ్య, కొమ్ముల సంగమేశ్వర్‌, వాసురామ్‌ తో పాటు ఎంపిడిఓ ఆఫీస్‌ పర్యవేక్షకులు వెంకటేష్‌ పాల్గొన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *