Breaking News

రైల్వే బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేయండి

నిజామాబాద్‌, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు రైల్వే అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల అభివద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్రిడ్జి నిర్మాణం గత సంవత్సరం నవంబర్‌ వరకు పూర్తి కావాల్సి ఉందని అయితే ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు ఏమిటని అధికారులను అడిగారు.

ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ఆరు నెలలకు మించకుండా ఈ పనులు పూర్తిచేయాలని అనుమతించే సమయంలో ఆదేశించామని తెలిపారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన అదనపు మనుషులను, యంత్ర సామగ్రిని, ఇతర సదుపాయాలను సమకూర్చుకొని పనులు త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు నిర్మాణంలో ఇతర పనులు నిర్వహించే ఏజెన్సీ శాఖలు అయిన ఆర్‌అండ్‌బి, మున్సిపల్‌ , మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇతర శాఖల అధికారులు వారి పనులను కూడా ఏక కాలంలో నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు తొలగించుటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

నగరంలో సిగ్నలింగ్‌లో సాంకేతిక లోపాలవల్ల గందరగోళం ఏర్పడుతుందని సాంకేతిక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని సిగ్నల్స్‌లో పొరపాట్లు రాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ రామకష్ణంరాజు, మున్సిపల్‌ ఎంఈ ఆనంద్‌ సాగర్‌, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని కలిసిన రిజిస్ట్రార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *