Breaking News

జంతు కళేబరాలపై సరైన విచారణ చేయండి

నిజామాబాద్‌, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జంతు కళేబరాల సమగ్ర విచారణ చేసి వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శనివారం చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జంతు కళేబరాలను కుప్పగా పోసిన విషయాలను అధికారుల దష్టికి తీసుకువస్తూ ఈ విషయమై రవాణా, అటవీ, పశుసంవర్ధక, మున్సిపల్‌, జిల్లా పంచాయతీ, అధికారులు పూర్తి వివరాలను సేకరించాలని అన్నారు.

కళేబరాలు ఎక్కడినుండి వస్తున్నాయి, వీటిని దేనిగురించి తీసుకువచ్చారో వీటిని ఏ విధంగా ఏ అవసరాలకు ఉపయోగించనున్నారో తదితర అన్ని విషయాలను పూర్తిగా సేకరించి నివేదిక అందచేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు పోలీసు సిబ్బంది సహాయ సహకారాలు తీసుకొని అన్ని వివరాలు సేకరించాలని అన్నారు. సమన్వయంతో పనిచేయాలని, ఇందులో చట్టవ్యతిరేకమైన చర్యలు ఏ మేరకు ఉన్నాయో అన్ని విషయాలను కూలంకషంగా విచారణ చేయాలని ఆదేశించారు.

ఇందుకు సంబంధించిన వ్యక్తుల వివరాలను కూడా సేకరించాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో డిటిసి శివలింగయ్య, పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జి జిల్లా అధికారి బాలిక్‌ అహ్మద్‌, జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, మున్సిపల్‌ ఇంజనీర్‌ ఆనంద్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *