Breaking News

గ్రామ రెవెన్యూ అధికారి సస్పెండ్‌

కామారెడ్డి, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లంచం డిమాండ్‌ చేసి వసూలు చేయడం, విధుల పట్ల నిర్లక్ష్య ప్రవర్తన, తదితర ఆరోపణలపై మాచారెడ్డి మండలం బండ రామేశ్వరంపల్లి గ్రామ రెవెన్యూ అధికారి సూర్యవర్ధన్‌ను ఈనెల 14వ తేదీ బుధవారం నాడు విధుల నుండి సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

మాచారెడ్డి మండలం బండ రామేశ్వరంపల్లి గ్రామస్థుడు సినిగిరి యాదయ్య తన తల్లి సినిగిరి శ్రీలక్ష్మి కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకం మంజూరు కోసం గ్రామ రెవెన్యూ అధికారి సూర్యవర్ధన్‌ తమ వద్ద 30 వేల రూపాయలు లంచం డిమాండ్‌ చేసి తీసుకున్నాడని ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్‌ను విచారణకు ఆదేశించారు.

గ్రామస్తుల నుండి అతనిపై అనేక ఆరోపణలు రావడం, అతని ప్రవర్తన పట్ల గ్రామస్తులు అసంత ప్తితో వుండడం తహసిల్దార్‌ విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా విలేజ్‌ రెవెన్యూ అధికారి ప్రవర్తన జిల్లా యంత్రాంగానికి ఇబ్బందికరంగా మారడం వలన సూర్యవర్ధన్‌, గ్రామ రెవెన్యూ అధికారిని 1991 సంవత్సరం టిఎస్‌సిఎస్‌ సి.సి.ఏ. రూల్‌ 8 ప్రకారం విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. సస్పెన్షన్‌ కాలంలో అతను ముందస్తు అనుమతిలేకుండా మండల హెడ్‌ క్వార్టర్‌ దాటి బయటకు వెళ్ల రాదని ఉత్తర్వులలో ఆదేశించారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *