Breaking News

కామారెడ్డి మునిసిపాలిటీ పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టియుఎఫ్‌ఐడిసి పథకం క్రింద కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఆదివారం సిరిసిల్ల రోడ్‌లో డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. స్థానిక ఇందిరా నగర్‌ స్మశానవాటికలో పూజ మందిర్‌, టాయిలెట్స్‌, కాంపౌండ్‌ వాల్‌ స్టార్మ్‌ డ్రైన్‌ వాటర్‌ పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు.

స్థానిక హౌసింగ్‌ బోర్డ్‌ స్మశానవాటికలో మోటర్‌ పంప్‌ మరమ్మతులు వెంటనే చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్‌ కార్యాలయం పక్కన గల పార్క్‌ సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. పైలాన్‌ బాబా కాలనీ పార్క్‌, గాంధీ నగర్‌ పార్క్‌లలో పనులను త్వరితగతిన అభివద్ధి చేయాలని తెలిపారు. కళాభారతి ఆడిటోరియం పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.

కార్యక్రమంలో ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ చందర్‌ నాయక్‌, పట్టణ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి జె.శైలజ, మున్సిపల్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వాసుదేవ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *