Breaking News

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

బీర్కూర్‌, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం బీర్కూర్‌ కేంద్రంలో జరిగిన వంటగ్యాస్‌ వినియోగదారుల అవగహన సదస్సులో బీర్కూర్‌ ఎంపిటిసి సందీప్‌ పటేల్‌ పేదలకు ఉచిత వంటగ్యాస్‌ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కషి చేస్తున్నాయని చెప్పారు. కాబట్టి పేదప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గంగారాజ్‌గౌడ్‌, ఇండియన్‌ గ్యాస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *