Breaking News

టీఎస్‌ ఐపాస్‌ అనుమతులకు అన్ని అభ్యంతరాలు ఒకేసారి తెలపాలి

నిజామాబాద్‌, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టి.ఎస్‌. ఐ-పాస్‌ కింద మంజూరు చేసే అనుమతులకు దరఖాస్తుదారులకు అభ్యంతరాలను ఒకేసారి తెలిపాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. కలెక్టర్‌ చాంబర్లో సోమవారం టీఎస్‌ ఐపాస్‌, పరిశ్రమల కేంద్రం అనుమతులకు సంబంధించి సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అవసరమైన అనుమతులను వెంటనే జారీ చేయాలన్నారు. సంబంధిత శాఖల ద్వారా ఏమైనా అభ్యంతరాలుంటే అన్నింటిని ఒకేసారి దరఖాస్తుదారులకు తెలియజేయాలని ఒకదాని తర్వాత ఒకటి అభ్యంతరాలు తెలియ చేయడం సరికాదన్నారు. సమావేశానికి హాజరు కావడానికి ముందు వారి కార్యాలయాలకు సంబంధించిన దరఖాస్తులను, అనుమతులను పరిశీలించాలని, తిరిగి సమర్పించిన జవాబులను కూడా సరిచూసుకోని సమావేశానికి హాజరు కావాలన్నారు.

టిఎస్‌ ఐ-పాస్‌ కింద దరఖాస్తులన్ని డాక్యుమెంట్స్‌ తో పాటు ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తున్నందున మళ్లీ వ్యక్తిగతంగా సమర్పించ వలసిన అవసరం లేదన్నారు. స్వయం ఉపాధి కింద దరఖాస్తు చేసుకునే వారికి కూడా వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేసి వారికి బ్యాంకు రుణాలు మంజూరు జరిగేలా, స్కీములు గ్రౌండ్‌ జరిగేలా చూడాలని ఆదేశించారు.

సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ బాబురావు, ఎల్‌డిఎం జయ సంతోష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, డిటిసి శివలింగయ్య, ఎ.డి. మైన్స్‌ సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, జిల్లా ఎస్‌టి సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *