Breaking News

ప్రకటించిన వేతనాలు వెంటనే అమలు చేయాలి

ఆర్మూర్‌, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2018 ఆగస్టు 10వ తేదీన పంచాయతీ ఉద్యోగ, కార్మికులకు ప్రకటించిన 8500 రూపాయల వేతనం వెంటనే అమలు చేయాలని కార్మిక జెఎసి పిలుపు మేరకు ఆర్మూర్‌ ఆర్డిఓ కార్యాలయం వద్ద తెలంగాణ (ఐఎఫ్‌టియు) గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్‌డిఓకు వినతి పత్రాన్ని అందజేశారు.

ధర్నాలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌, ఐఎఫ్‌టియు నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కెసిఆర్‌ ఆర్‌ ఎన్‌ ఎన్నికల్లో పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని అంతేకాకుండా సఫాయి కార్మికులు ప్రజారోగ్యాన్ని కాపాడుతూ, ప్రజలను రోగాల బారినుండి కాపాడుతున్నారని కనుక సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్ళని సెల్యూట్‌ పెట్టిన కేసీఆర్‌, పంచాయతీ కార్మికుల వేతనం అమలు చేయడం పట్ల నిర్లక్ష్యం చేయడం సోచనీయమని దాసు అన్నారు.

మాట తప్పని మడమ తిప్పని వంశమని అనేక సభల్లో చెప్పిన కేసీఆర్‌ ఈనాటికీ పంచాయతీ కార్మికులకు ప్రకటించిన వేతనం అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఒక దిక్కు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, మరో దిక్కు కార్మికులకు ప్రకటించిన వేతనం అమలు చేయకపోవడంతో పంచాయతీ కార్మికులకు కొనుగోలు శక్తి దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

స్వచ్ఛ తెలంగాణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్మికులను నిర్లక్ష్యం చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగదని దాసు అన్నారు. దేశ సరిహద్దుల్లో సిపాయిలు గ్రామీణ ప్రాంతంలో సఫాయిలు ప్రజల కోసమే ఆలోచిస్తున్న విషయాన్ని పాలకులు అర్థం చేసుకుని వారి కుటుంబాలని సమస్యల సుడిగుండంలో నెట్టకుండా వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని దాసు డిమాండ్‌ చేశారు.

పంచాయతీ కార్మికులు అందరికీ పిఎఫ్‌ మరియు ఈఎస్‌ఐ సౌకర్యాన్ని వర్తింపజేయాలని ఆయన అన్నారు. పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పంచాయతీ కార్మికులకు వేతన బకాయిలు పెండింగ్‌లో ఉంచడం భావ్యం కాదని, వెంటనే వేతనాలను చెల్లించాలని ఆయన అధికారులను కోరారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తే, ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ధర్నాలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ముత్తన్న, సిఐటుయు. జిల్లా అధ్యక్షులు వెంకటేష్‌, నూర్జహాన్‌, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్టియు) జిల్లా నాయకులు భానుచందర్‌, వెంకటాపూర్‌ గంగారాం, సొప్పరి గంగాధర్‌, పతెపూర్‌ గంగక్క, నికాల్‌ పూర్‌ రాజన్న, నారాయణమ్మ, తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంట్లో పంచాయతీ కార్మికుల వేతనాల అమలు కోసం వినతి పత్రం అందజేశారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *