Breaking News

సమగ్ర నివేదికలు అందజేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 21 ,22 తేదీలలో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరుగు జిల్లా కలెక్టర్లతో ఏర్పాటుచేసిన సమావేశ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ముఖ్యమంత్రి ఎజెండా అంశాలను సంబంధిత ఆయా శాఖల జిల్లా అధికారులతో సోమవారం ఉదయం తన చాంబర్లో ముందస్తు సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల ప్రణాళిక, నూతనంగా చేపట్టబోయే రెవెన్యు చట్టం, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ చట్టాల రూపొందించిన ప్రకారంగా క్షేత్రస్థాయిలో పటిష్టమైన అమలు ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కావాల్సిన అవసరమైన సలహాలు సూచనలు నివేదిక రూపంలో అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ప్రతి అంశానికి మాన్‌ పవర్‌, లీగల్‌ ప్రొసీజర్‌, ఇంప్లిమెంటేషన్‌, టెక్నాలజీ, అమలుపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ ఆర్‌ అంజయ్య, డి.యప్‌.ఓ సునీల్‌, నగర పాలక కమిషనర్‌ జాన్‌ సంసన్‌, జడ్పీ సీఈఓ గోవింద్‌, డి.పి.ఓ జయసుధ, కలక్టరేట్‌ పరిపాలన అధికారి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *