Breaking News

20న పూర్వ విద్యార్థుల, పూర్వాచార్యుల సమావేశం

కామారెడ్డి, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ సరస్వతీ విద్యా పీఠం పూర్వ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా పూర్వ విద్యార్థుల, పూర్వ ఆచార్యుల సమ్మేళనం నిర్వహించ తలపెట్టినట్టు సరస్వతీ విద్యామందిర్‌ ప్రబంధకారిణి ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంవత్సరం నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ సరసంఘచాలక్‌ మోహన్‌ జీ భాగవత్‌ ఒకరోజు ఉండే అవకాశముందన్నారు.

ఇందులో భాగంగా 29 డిసెంబర్‌ 2019 నాటి పూర్వ విద్యార్థుల, పూర్వ ఆచార్యుల ఒక రోజు సమావేశానికి ముందస్తు తయారీలో భాగంగా కామారెడ్డి పాఠశాలలో పూర్వ ఆచార్యుల పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఆగస్ట్‌ 20వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు నిర్వహించతలపెట్టినట్టు తెలిపారు. పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులు సమావేశంలో పాల్గొని ఎక్కువమంది పూర్వ విద్యార్థులను ఆచార్యులను కలిపే విధంగా ప్రయత్నం చేయాలన్నారు.

సమావేశం శ్రీ సరస్వతీ శిశుమందిర్‌ హై స్కూల్‌ ఆడిటోరియం హాల్‌లో సాయంత్రం 5.00 గంటలకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో విద్యా భారతి దక్షిణమధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్‌ రెడ్డి, క్షేత్ర శిక్షణ ప్రముఖ్‌ రావుల సూర్యనారాయణ పాల్గొంటారని, పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులు ఎక్కువమంది ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *