Breaking News

సమస్యలు ఎక్కడివక్కడే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాసమస్యలు ఎక్కడివక్కడే పరిష్కరించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ప్రగతి భవన్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అధికారుల నుద్దేశించి మాట్లాడారు. గ్రామస్థాయి సమస్యలను జిల్లా స్థాయి వరకు వచ్చి విన్నవించడం వలన ఎంతో ఇబ్బందుల పడుతున్న దష్ట్యా గ్రామస్థాయిలో సమస్యలు గ్రామ స్థాయిలోనే, మండల, డివిజన్‌ సమస్యలు అక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

ఎక్కడి సమస్య అక్కడే పరిష్కరించినట్లుయితే ప్రజలు ఇబ్బందులకు గురి కారని ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తమ పరిధిలో పనిచేస్తున్న అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. గతంలో ఎన్నోసార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏమాత్రం పురోగతి లేదని ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఆయా స్థాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్‌ హెచ్చరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 21, 22 తేదీలలో రెండు రోజులపాటు హైదరాబాదులో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినందున ఎజెండా అంశాలైన 60 రోజుల ప్రణాళిక నూతనంగా రూపొందించే రెవెన్యూ చట్టం పంచాయతీ రాజ్‌, మునిసిపల్‌ చట్టాలపై సమగ్ర నివేదికలు సాయంత్రంలోగా అందజేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు డిఆర్‌ఓ ఆర్‌.అంజయ్య నిజామాబాద్‌ ఆర్‌డివో వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *