Breaking News

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉదయం 11గంటలకు పద్మశాలీ, చేనేత, బీడీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా చేనేత సహకార సంఘాల అధ్యక్షులు సిరిగాధ లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ చేనేత కార్మికులకు చేనేత బంధు రూపొందించి ఈ పథకం కింద పెట్టుబడి సహాయం 15 వేలు అందించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

అలాగే చేనేత భీమా పథకం రూపొందించి 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, చేనేతల కు కార్డ్‌ పునరుద్ధరించి 5 లక్షల ఆరోగ్య భీమా కల్పించాలని అన్నారు. చేనేతలకు బార్‌ కోడ్‌ నెంబర్లు, జియో టాగ్‌లు కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, చేనేత సహకార సంఘాల రుణాలు మాఫీ చేయాలని అన్నారు.

కార్యక్రమంలో చేనేత సహకార సంఘాల రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్‌ నేత, పద్మశాలీ పెద్దలు రాములు, లక్ష్మణ్‌, శ్రీహరి, యువకులు రమేష్‌, అఖిల్‌, మహేశ్‌, అరవింద్‌, రాజు, భాను, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *