Breaking News

Daily Archives: August 21, 2019

ఇద్దరు రెవెన్యూ అసిస్టెంట్ల సస్పెండ్‌

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామ విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ పుప్పల రవిని, మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌ కుమారి ఎం.రవళిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు మాచారెడ్డి మండల తహసిల్దార్‌ వై.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో తహసీల్దారుగా పనిచేసిన శ్యామల కాలంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో వీరిద్దరూ అవకతవకలకు పాల్పడ్డారని, తమ పేరు మీద, తమ బంధువుల పేరు మీద పట్టాదారు పాసు పుస్తకాలు నమోదు చేసుకోవడం, ...

Read More »

అడవుల పెంపకం వాతావరణంలో మార్పు తెస్తుంది

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ భూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కలెక్టర్లను కోరారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే.. అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవడానికి జీవ వైవిధ్యానికి దోహద పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని సింగాయపల్లి, నెంటూరు, కోమటి బండ తదితర ...

Read More »

పౌరసరఫరాల అధికారుల దాడులు

పది గ్యాస్‌ సిలిండర్ల స్వాధీనం కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం పౌర సరఫరాల శాఖాదికారులు హోటళ్ళు, టిఫిన్‌ సెంటర్ల పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లు, టిపిన్‌ సెంటర్లలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లను సదరు హోటళ్ల యజమానులు అక్రమంగా వినియోగిస్తున్నట్టు తెలుసుకున్నారు. పది సిలిండర్లను స్వాధీనం చేసుకొని సదరు యజమానులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.

Read More »

సబ్సిడీ చేపలను విడుదల చేసిన ఘనత తెరాసదే

నిజాంసాగర్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్య శాఖ అభివద్ధి కోసం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కషి చేస్తుందని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని సింగీతం ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతు బంధు పథకం కింద ఎకరానికి 6 వేల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడా లేని విధంగా మత్స్య శాఖ ...

Read More »

కందకుర్తి రైతులకు అండగా ఉంటాం

రెంజల్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టా పాసు పుస్తకాల కోసం రెంజల్‌ మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కందకుర్తి రైతులు చేపట్టిన దీక్ష బుధవారం నాటికి 15వ రోజుకు చేరడంతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రైతులకు సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల భూములకు సంబంధించిన పట్టా పాస్‌ పుస్తకాల కోసం రైతులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. రైతులు గత 15 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా ...

Read More »

తాడ్‌బిలోలిలో దాణా పంపిణీ

రెంజల్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో బుధవారం లబ్దిదారులకు దాణా పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్‌ సునీత ప్రారంభించారు. గ్రామంలో 36 మంది లబ్దిదారులకు మంజూరైన గొర్రెల దాణాను అందజేశారు. పంపిణీ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీ, పశువైద్యాధికారి విఠల్‌, శ్రీకష్ణ యాదవ సంఘం అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, గ్రామ టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, గ్రామస్తులు శ్రీనివాస్‌, దేవేందర్‌, రూపేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారనికి కషి చేస్తాం

రెంజల్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాద్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పిఆర్‌టియు ఎప్పుడు ముందుంటుందని పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు ఇల్తెపు శంకర్‌ అన్నారు. రెంజల్‌ మండలం పిఆర్‌టియు నూతన కమిటీని బుధవారం ఆదర్శ పాఠశాలలో ఎంపిక చేశారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు శంకర్‌ ఆధ్వర్యంలో నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎంపిక చేశారు. అధ్యక్ష కార్యదర్శులుగా సోమలింగం, సాయరెడ్డి, అసోసియెట్‌ అధ్యక్షునిగా సునీల్‌, కార్యదర్శిగా గోవర్దన్‌, మహిళ ఉపాధ్యక్షులు సుష్మ, మహిళ కార్యదర్శిగా షభానబేగంలను ఎన్నుకున్నారు. అనంతరం ...

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన డొంకేశ్వర్‌ రైతులు

నందిపేట్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారీ నీటిపారుదల కాళేశ్వరం ప్రాజెక్టును మండల ప్రజలు సందర్శించడానికి బారులు తీరారు. వివిధ గ్రామాల నుండి ప్రతిరోజు కాళేశ్వరం వెళ్తున్నారు. బుధవారం డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన రైతులు పరిశీలించారు. యువ రైతులు డొంకేశ్వర్‌ గ్రామం నుంచి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని కాళేశ్వరం చేరుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం పంప్‌హౌస్‌ అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ పంప్‌హౌస్‌లను పరిశీలించారు. ప్రభుత్వం భారీఎత్తున చేపట్టిన ప్రాజెక్టు పనులను చూసి రైతులు హర్షం ...

Read More »

తెరాస గ్రామ కమిటీల ఏర్పాటు

ఆర్మూర్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మచ్చర్ల గ్రామంలో తెరాస పార్టీ గ్రామ కమిటీ, అనుబంధ కమిటీలు, రైతు, మహిళ, యువజన, ఎస్‌సి, బిసి సెల్‌ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సూచన మేరకు కమిటీలు వేయడం జరిగిందన్నారు. ఎంపిపి పస్క నర్సయ్య మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన వారు పార్టీ నిర్మాణానికి కషి చేయాలనీ, ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేసి జీవన్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. వివిధ గ్రామాల సర్పంచ్‌లు గంజి నర్సయ్య, లింబారెడ్డి, కళ్లెం ...

Read More »

పలు గ్రామాల్లో గ్రామసభలు

రెంజల్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అంబెడ్కర్‌ నగర్‌, నీలా, రెంజల్‌, సాటాపూర్‌ గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి ఎద్దడిని నివారించాలని సభ్యులు తీర్మానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మతురాబాయి, రమేష్‌, వికార్‌, లలిత, ఈఓఆర్డి రఘురామ్‌, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆకుల లలిత మామయ్య మతి

ఆర్మూర్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత మామయ్య వెంకట నర్సయ్య (88) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మతి చెందారు. ఆకుల లలిత భర్త ఆకుల రాఘవేందర్‌ తండ్రి అయిన వెంకట నర్సయ్య జెడీఏగా పని చేసి రిటైర్‌ అయ్యారు. ఆయన మతి చెందిన విషయాన్ని తెలుసుకున్న రాజ్య సభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ హైదరాబాద్‌ లోని ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Read More »

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

నిజాంసాగర్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా సిర్గపూర్‌ మండలంలోని జంలతాండ గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి బుధవారం హాజరై హరితహారం మొక్కలు నాటారు. గ్రామ సర్పంచ్‌ దివ్య భారతి – చరణ్‌ తిలకం దిద్ది ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. మొక్కలు నాటిన అనంతరం ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డిని సర్పంచ్‌ పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమం ...

Read More »

జీవాల పెంపకం దారులకు దాణా పంపిణీ

ఆర్మూర్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవాల పెంపకం దారులకు రెండవ విడత దాణా పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆలూరు గ్రామంలో 50 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి రెండు క్వింటాళ్ళ దాణా (206 కిలోల) దాణాను పూర్తి ఉచితంగా పంపిణీ చేసినట్టు మండల పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ లక్కం ప్రభాకర్‌ తెలిపారు. దాణా పంపిణీ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ కళ్ళెం మోహన్‌ రెడ్డి సభాధ్యక్షత వహించగా, ఉప సర్పంచ్‌ దుమ్మాజి శ్రీనివాస్‌, నాయకులు చిన్నారెడ్డి, మల్లేష్‌, జిల్లా రైతు ...

Read More »

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

నిజాంసాగర్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిర్గపూర్‌ మండలంలోని అంతర్గావ్‌ గ్రామానికి చెందిన గొను గొండ కుమారుడు మల్లు గొండకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 36,000 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి బుధవారం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల ఆపద్బాంధవుడు అని అన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.

Read More »

పరీక్ష రాసిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ ఆదర్శ లా కాలేజీలో ఎల్‌ఎల్‌ఎం దూర విద్యను అభ్యసిస్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి బుధవారం చివరి సంవత్సరం యొక్క రెండవ సేమ్‌ పరీక్షకు కాకతీయ యూనివర్సిటీలో హాజరయ్యారు. ఇది చివరి సేమ్‌ కావడంతో ఆయన వరంగల్‌ పట్టణానికి బుధవారం ప్రొద్దున్నే చేరుకొని అక్కడ గ్రూప్‌ డిస్కషన్లో పాల్గొని పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. ఇదివరకే ఆయన రాసిన అన్ని పరీక్షలలో ఉత్తీర్ణుడైన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ...

Read More »

24న బాలగోకులం

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంస్కారభారతి, ఇందూరు ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్బంగా బాలగోకులం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేందర్‌ భాయ్‌షా, గంట్యాల ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని స్థానిక మున్నూరు కాపు సంఘం కల్యాణమండపం, శివాజీనగర్‌లో కార్యక్రమం ఉంటుందన్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులు బాలకృష్ణుని వేషధారణలో పాల్గొనాలని, అదేవిధంగా ఒక శ్లోకం లేదా సూక్తి చెప్పాలని సూచించారు. బాలగోకులం ద్వారా శిశుప్రాయంలోనే పిల్లలకు ...

Read More »