Breaking News

Daily Archives: August 22, 2019

25న ఆదిభట్ల నారాయణదాసు జయంతి

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఆదిభట్ల నారాయణదాసు 155వ జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపాల్‌ దేవులపల్లి ప్రశాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జండా బాలాజీ ఆలయంలో ఆదిభట్ల హరికథ కళాపీఠం, అభినయ సంగీత నృత్య కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే కూచిపూడి నాట్యం, గజ్జపూజ మహోత్సవం, ద్రౌపథీ స్వయం వరం హరికథా గానం ఉంటాయని వివరించారు. ముఖ్య ...

Read More »

ప్రయాణీకులకు శుభవార్త

ఎల్లారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ప్రయాణీకులకు టిఎస్‌ఆర్‌టిసి డిపో మేనేజర్‌ శుభవార్త అందించారు. శుక్రవారం నుంచి ప్రతిరోజు ఉదయం 5.50 గంటల నుంచి ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్‌ వరకు బస్సు నడపనున్నట్టు నిర్ణయించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌రెడ్డి కృషి వల్ల ప్రయాణీకుల సౌకర్యార్థం బస్సు నడపడం జరుగుతుందన్నారు. ఈ మేరకు ప్రయాణీకులు ఎమ్మెల్యేకు, డిపో మేనేజర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Read More »

25న ఉచిత వైద్య శిబిరం

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు స్పర్శ స్కిన్‌ అండ్‌ ఇఎన్‌టి ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. గోదామురోడ్డులోని ఆసుపత్రిలో చర్మ, చెవి, ముక్కు, గొంతుకు సంబందించిన ఉచిత వైద్య పరీక్షలు చేయబడుతాయని పేర్కొన్నారు. అలాగే అవసరమున్న వారికి అందుబాటులో ఉన్న మందులను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. కాబట్టి చర్మ, చెవి, ముక్కు, గొంతుకు సంబందించిన వ్యాధులతో బాధపడుతున్నవారు అవకాశాన్ని ...

Read More »

నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆందోళన

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గహంలో నిజామాబాద్‌ తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సంఘం రాష్ట్ర నాయకులు దండి వెంకట్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది భవన, ఇతర నిర్మాణరంగంలో పనిచేస్తున్నారని, 95 శాతం కార్మికులు బలహీన వర్గాల వారు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్‌ కార్డు ...

Read More »

గర్భిణికి రక్తదానం చేసిన ఏబివిపి కార్యకర్త

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన మంజుల ఎనిమిది నెలలు కడుపులో బిడ్డను మోసి 9వ నెలలో డెలివరీ సమయం వచ్చింది. కాగా అదే సమయంలో రక్తం తక్కువగా ఉండడంతో రక్తం ఇస్తేనే శస్త్రచికిత్సకు అవకాశముందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. దీంతో గర్భిణీ కుటుంబీకులు డబ్బులు పెట్టి రక్తం కొనే స్థితిలో లేకపోవడంతో ఏబివిపి కార్యకర్తలను సంప్రదించారు. కాగా ఓ కార్యకర్త తన రక్తాన్ని ఇచ్చి గర్భిణీ ప్రాణాలు కాపాడాడు.

Read More »

ప్రతి ఫోటో ఒక మధురానుభూతియే…

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఫోటో వెనుక ఒక అనుభూతి ఒక జ్ఞాపకం దాగి ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాసనసభ వ్యవహారాలు గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్‌ జిల్లా ఫోటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ఆఫీసర్స్‌ క్లబ్‌లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, జడ్పీ చైర్మన్‌ విట్టల్‌ రావు, అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణేష్‌ ...

Read More »

మహిళా సమాఖ్య నూతన పాలకవర్గం ఏర్పాటు

ఆర్మూర్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఆర్మూర్‌ మండల మహిళా సమాఖ్య 12వ వార్షిక మహాసభ జరిగింది. సమావేశానికి ఎంపిపి పస్క నర్సయ్య, వైస్‌ ఎంపిపి మోతె బొజాకళ పాల్గొన్నారు. నూతన పాలక వర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. అధ్యక్షులు పర్వీన్‌ అస్మా – చేపూర్‌ గ్రామం, గంగామని-కార్యదర్శి అంకాపూర్‌ గ్రామం, పుష్ప – కోశాధికారి సుబిర్యాల్‌ గ్రామం, సబితా ఉపాధ్యక్షులు – దేగాం గ్రామం, శ్రీలక్ష్మి సహాయ కార్యదర్శి మంతెన గ్రామం, మాలతీ, లావణ్య సలహాదారులు ఎన్నుకోవటం జరిగింది.

Read More »

రాష్ట్రస్థాయి సీనియర్‌ సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు విద్యార్థిని ఎంపిక

ఆర్మూర్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి గ్రామములో ఉన్న మానస హైస్కూల్‌కు చెందిన మమత రాష్ట్రస్థాయి సీనియర్‌ సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు ఎంపిక అయినట్లు మానస గణేష్‌ తెలిపారు. మహబూబ్‌ నగర్‌లో ఈ నెల 23, 24, 25 తేదీలలో జరిగే పోటీలో పాల్గొననుందని తెలిపారు. మమతను పాఠశాల పరిపాలనా అధికారి పద్మ, ప్రిన్సిపాల్‌ రమేశ్‌, మిగతా సిబ్బంది అభినందించారు.

Read More »

గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు

రెంజల్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌లు తెలిపారు. మండలంలోని మౌలాలితండా, కళ్యాపూర్‌, కిషన్‌ తండా, దండిగుట్ట, బాగేపల్లి గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గురువారం గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించేందుకు కషి చేస్తామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరింబడుతుందన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు మరమ్మతులు చేపట్టాలని సభ్యుల ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సునీత, బాబునాయక్‌, కాశం నీరంజని, జమున, ...

Read More »

ప్రజలకు సేవ చేయడమే ప్రజాప్రతినిధుల ధ్యేయం

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వారి అంతిమ లక్ష్యం ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకుపోవాలని రాష్ట్ర రోడ్డు భవనాలు రవాణా శాసనసభ వ్యవహారాలు హౌసింగ్‌ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్‌ స్థాయి సంఘాల కమిటీల ఎన్నికల సమావేశం గురువారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివద్ధి ...

Read More »

నల్జేరు సాయిలు వర్ధంతి

బీర్కూర్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెరాస పార్టీ కార్యకర్త నల్జేరు సాయిలు ప్రథమవర్థంతి సంధర్బంగా ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఆయన గత ఎన్నికల్లో తెరాస పార్టీకి ఎంతో కషిచేశారు. కార్యక్రమంలో మాజి జడ్పిటిసి ద్రోణావల్లి సతిష్‌ ఆయన చిత్రపటానికి పులమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బాలశంకర్‌, సర్పంచ్‌ కుమారి స్వప్న గంగారాం, ఎంపిటిసి సందీప్‌ పటేల్‌, పట్టణ అధ్యక్షుడు దుంపల రాజు, లాయక్‌ పటేల్‌, ...

Read More »