Breaking News

Daily Archives: August 23, 2019

25న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సహకారంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 25 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని కిరాణా వర్తక సంఘం ఫంక్షన్‌ హాల్లో సైనిక రిక్రూట్మెంట్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కామారెడ్డి అర్‌ఆండ్‌బి అతిథి గహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ వివరాలు వెల్లడించారు. కల్నాల్‌ శ్రీనివాస్‌ రావు సహకారంతో సైనిక రిక్రూట్మెంట్‌ ...

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలను అన్ని రకాలుగా అధుకోవడమే సిఎం కేసీఆర్‌ ఉద్దేశ్యమని ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 216 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 4 లక్షల 5 వేల రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. గత 6 నెలల్లో 500 మందికి 5.29 కోట్ల కల్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. పేదలను అన్ని రకాలుగా ...

Read More »

26 నుండి లెప్రసీ, టిబి పరీక్షలు

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 26 నుండి సెప్టెంబర్‌ 12 వరకు లెప్రసీ, టిబి పరీక్షలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో ఎల్‌సిడిసి- 2019 సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో ప్రతి పదివేల మందిలో 37 మందికి లెప్రసీ వ్యాధి ఉండేదని ప్రభుత్వాలు తీసుకున్న నివారణ చర్యల వల్ల అది 0.4 కు తగ్గిపోయిందన్నారు. అయితే అక్కడక్కడ ఈ వ్యాధి లక్షణాలు బయట ...

Read More »

పాదయాత్రకు అనుమతినివ్వండి

నిజాంసాగర్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో గల అకోల రహదారి ప్రక్కన అంజనాద్రి ఆలయం నుండి బీర్కుర్‌ మండలం తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 24వ తేదీన ప్రారంభించే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన మనకోసం మనం సేవాసమితి స్థాపకుడు కిషోర్‌ కుమార్‌ బందం నిజాంసాగర్‌ ఎస్‌ఐ సాయన్నను శుక్రవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. బ్రహ్మణపల్లి అంజనాద్రి దేవాలయం నుంచి నిజాంసాగర్‌, ...

Read More »

శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నందిపేట్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ కష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని నందిపేట అంగన్‌వాడీ కేంద్రాలలో శ్రీ కష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు పాల్గొని శ్రీ కష్ణుని వేషధారణలలో పాల్గొన్నారు. ఉట్టి కొట్టడం, శ్రీ కష్ణుడు గోపికలతో చేసిన చిలిపి చేష్టలు లాంటి కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. స్థానిక అంగన్‌వాడీ టీచర్‌ కవిత మాట్లాడుతూ పిల్లల్లో అంగన్‌వాడి కేంద్రాలపట్ల ఆసక్తి పెంపొందించడానికి, ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. దీని వలన పిల్లల్లో ఆసక్తి ...

Read More »

బస్టాండ్‌లో గుంతల పూడ్చివేత

ెఎల్లారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి బస్‌స్టాండ్‌ గుంతలమయంగా మారడంతో బస్సుల రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారింది. అలాగే ప్రయాణీకులు కూడా నానా అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ చొరవతో బస్టాండ్‌లో ఏర్పడ్డ గుంతలను తెరాస నాయకులు శుక్రవారం పూడ్చివేశారు. కార్యక్రమంలో నాయకులు కుడుముల సత్యం, నాయిని సాయిరాం, ఇమ్రాన్‌, ఎంపీటీసీ సంతోష్‌, నాగం సాయిబాబు, బాన్సువాడ డిపో మేనేజర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

న్యాయ సేవ లీగల్‌ వాలింటర్‌గా శ్రీకాంత్‌

రెంజల్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం వీరన్నగుట్ట గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పత్తి శ్రీకాంత్‌ను జిల్లా లీగల్‌ వాలంటీర్‌గా ఎంపిక చేసినట్లు జిల్లా న్యాయసేవ సంస్థ సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌ మహి ఒక ప్రకటనలో తెలిపారు. తమపై నమ్మకంతో న్యాయ సేవా వాలింటర్‌గా నియమిచినందుకు శ్రీకాంత్‌ కతజ్ఞతలు తెలిపారు.

Read More »

ఉద్యమంగా నీటి సంరక్షణ

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటిని సంరక్షించడానికి ఒక ఉద్యమంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని జలశక్తి అభియాన్‌ జాయింట్‌ సెక్రెటరీ కిషోర్‌ సుందరే పిలుపునిచ్చారు. ఈ నెల 21 నుండి మూడు రోజులపాటు జిల్లాలో జలశక్తి అభియాన్‌ అధికారుల పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో రుద్రూర్‌ కషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్‌ మేళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి దేశంలోని 256 జిల్లాలను ఎంపిక ...

Read More »

రోటా వైరస్‌ టీకా పై అవగాహన సదస్సు

నిజాంసాగర్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రోటా టీకాపై మండల వైద్యాధికారి రాధాకిషన్‌ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాధా కిషన్‌ మాట్లాడుతూ రోటా వైరస్‌ ప్రమాదకరమైందని, మొదటగా వాంతులు-విరేచనాలతో ప్రారంభమై మరణం సంభవించడం జరుగుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి పిల్లలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రోటా వైరస్‌ టీకాను సెప్టెంబర్‌ 5వ తేదీన ప్రవేశపెడుతుందని అన్నారు. టీకాను 6, 10, 14 వారాల పిల్లలకు నోటిలో చుక్కల ద్వారా ...

Read More »

పలుచోట్ల గ్రామసభలు

రెంజల్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దష్టికి తీసుకొస్తే పరిష్కరమార్గం చూసేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నామని ఎంపీడీవో శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని తాడ్‌ బిలోలి, బొర్గం, వీరన్నగుట్ట, వీరన్నగుట్ట తండా, కునేపల్లి, దూపల్లి, పేపర్‌ మిల్‌, కందకుర్తి గ్రామాల్లో సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు 6 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, జలశక్తి అభియాన్‌ పథకం కింద ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ...

Read More »

గోదవారి వంతెన రహదారి కొరకు భూమి సేకరణ

నందిపేట్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం ఉమ్మెడ పుష్కర ఘాట్‌ నుండి నిర్మల్‌ జిల్లా పంచగుడి వరకు నిర్మించిన వంతెనకు కలిపే అప్రోచ్‌ ప్రధాన రహదారి కొరకు భూములు ఇస్తున్న రైతులకు ఎకరాకు 7 లక్షల యాబై వేలు ప్రభత్వం పరిహారం చెల్లిస్తుందని ఆర్‌డిఓ శ్రీనివాస్‌ తెలిపారు. భూములు కోల్పోతున్న ఆయా గ్రామాల రైతులతో శుక్రవారం నందిపేట్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి రైతులతో చర్చించి భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వా భరోసా కల్పించారు. ...

Read More »

వడ్డేపల్లి పాఠశాలలో కష్ణాష్టమి వేడుకలు

నిజాంసాగర్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని వడ్డేపల్లి పాఠశాలలో కష్ణాష్టమి వేడుకలో విధ్యార్థులు కష్ణుని గోపికలుగా వేషధారణతో అలరించారు. మిగతా విధ్యార్థులు దాండియా ఆటలతో నత్యాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్‌, ఉపాధ్యాయులు, సత్యనారాయణ, అఖిల్‌, శేఖర్‌ గౌడ్‌, రాజ్యశ్రీ, ఐఈఆర్పీ సునీల్‌, సాయిలు పాల్గొన్నారు.

Read More »

కార్మికులకు న్యాయం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గరిపల్లి శేకరయ్య వస్త్ర దుకాణ వ్యాపారంలో గత 15 సంవత్సరాలుగా గుమస్తాలుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస సమాచారం ఇవ్వకుండా షాపు మూసివేసి కార్మికుల ఉపాధిని రోడ్డున వేశాడని, కార్మికులకు రావలసిన చట్టపరమైన హక్కులకోసం డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ ఉమ్మడి జిల్లా అధికారి చతుర్వేదికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐసీటియు జిల్లా బాధ్యులు రాజలింగం మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా వస్త్ర వ్యాపారం చేస్తున్న గర్రెపల్లి శేకరయ్య ...

Read More »

కార్మికులకు రూ.8500 వేతనం అందించాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులకు 8500 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. గతంలో కార్మికులు సమ్మె చేస్తే 8500 రూపాయలు ఇస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, సంవత్సర కాలం గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ఎంపిడివో కార్యాలయం నుంచి తహసీల్‌ కార్యాలయం వరకు కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించి ...

Read More »

26 నుంచి ఉచిత శిక్షణ

డిచ్‌పల్లి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, డిచ్‌పల్లిలో ఈనెల 26 నుంచి రిఫ్రిజిరేషన్‌, ఎయిర్‌ కండీషనింగ్‌లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌లో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కామరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన 19 నుండి 40 సంవత్సరాల లోపు ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు ...

Read More »

పరిశ్రమల అడ్డ లక్కంపల్లి సెజ్‌

ప్రారంభానికి సిద్దమవుతున్న మెగా ఫుడ్‌ పార్క్‌ నందిపేట్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రానికి సమీపంలోని లక్కంపల్లి శివారులో ఏర్పాటు కానున్న ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) లో పరిశ్రమల ఏర్పాటుకు సంబందించి నిర్మాణ పనులు పూర్తి కావడంతో పాటు సెప్టెంబర్‌ 6న ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది. కాంట్రాక్టర్లకు అప్పగించిన నిర్మాణ పనులను పూర్తిచేసి సంబందిత అధికారులకు పూర్తయిన విషయమై నివేదికను పంపడంతో ఎంపి దర్మపురి అరవింద్‌ ఆగస్టు 20న పర్యటించి 6 సెప్టెంబర్‌న ప్రారంభానికి ముహూర్తం ...

Read More »