Breaking News

Daily Archives: August 25, 2019

మాజీ కౌన్సిలర్‌ కుంబాల రవికి సన్మానం

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని భారత్‌ రోడ్‌ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్‌ కుంబాల రవి యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. 12 వ వార్డు కౌన్సిలర్‌గా గత 5 సంవత్సరాలుగా సేవ చేసి అందరికి అందుబాటులో ఉండి 12 వ వార్డును అన్ని విధాలా అభివద్ధి పరచి అందరి మన్ననలను పొందారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జకసాని వెంకటేశం గుప్తా, కార్యదర్శి సిద్దంశెట్టి రమణ గుప్తా, కోశాధికారి చేపురి రాజు, సంఘం సీనియర్‌ ...

Read More »

నిరుద్యోగుల కోసమే ఆర్మీ అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఆర్మీ ఉద్యోగాలపై ఆర్మీ అధికారులచే అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సుకు యువకులు భారీగా తరలివచ్చారు. ఆర్మీ ఉద్యోగాల పట్ల యువకులకు మెలకువలు, సూచనలు కల్నల్‌ శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబర్‌ 2న కరీంనగర్‌లో నిర్వహించే ఆర్మీ రిక్రూమెంట్‌ ర్యాలీకి కామారెడ్డి ప్రాంతం నుండి యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కోరారు. కార్యక్రమంలో జడ్పీ ...

Read More »

జాతీయభావాలు కలిగిన గొప్ప దేశభక్తుడు అరుణ్‌జైట్లీ

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకులు కీర్తి శేషులు అరుణ్‌ జైట్లీ చిత్ర పటానికి పూల మాలలు వేసి, మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్ధి దశ ...

Read More »

కృష్ణాష్టమి వేడుకలు

ఆర్మూర్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో అంగన్‌వాడి కేంద్రం ఆధ్వర్యంలో 3వ రోజు కూడా కష్ణఅష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తమ ఆటలతో కాలనీ వాసులను ఆబ్బురపరిచారు. కార్యక్రమంలో అంగన్‌వాడి అధ్యాపకురాలు లత, సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Read More »

ఉపసర్పంచ్‌ల ఫోరం ఏర్పాటు

బీర్కూర్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల ఉపసర్పంచ్‌ల ఫోరంను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఆదివారం నియమించారు. మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడుగా మలోత్‌ రవీందర్‌ – అంకోల్‌ తండా, ఉప సర్పంచ్‌, ఉప అధ్యక్షుడు ఎస్‌.డి.ఖలిల్‌ – నసురుల్లాబాద్‌, కార్యదర్శిగా ఎం.డి.ఖధీర్‌ -దుర్కి, కోశాధికారిగా మోహన్‌ రాథోడ్‌ – బొప్పాస్‌పల్లి, ముఖ్య సలహాదారు అల్లం మైశయ్య – మైలారం, సహాయక సలహదారుడుగా డి.రాములును మండల ఉపసర్పంచులు ఏకగ్రీవంగా నియమించారు.

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ప్రత్యేక చొరువతో సీఎం రిలీఫ్‌ ఫండు చెక్కులు తెప్పించడం జరిగిందని, ఆదివారం ఫతేపూర్‌లో ఎంపీపీ పస్క నర్సయ్య, సామేర సురేష్‌, పిప్రి, ఫతేపూర్‌ హన్మాండ్లు ఎంపీటీసీలు చెక్కులు పంపిణి చేయడం జరిగింది. తలారి రాజగంగు 25 వేల రూపాయలు, ఎం.భూమేష్‌ 22,500, కుమ్మరి రాజేందర్‌ 28వేలు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో తెరాస గ్రామ పార్టీ అధ్యక్షులు జె.వజ్రం రెడ్డి, గాయల్‌ గంగారెడ్డి సదాశివరెడ్డి, ధర్మపురి సోదరిరెడ్డి తదితరులు ...

Read More »