Breaking News

Daily Archives: August 26, 2019

వేతనాలు అమలు చేయాలని కార్మికుల ధర్నా

ఆర్మూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పంచాయతీ కార్మికులకు 2018 ఆగస్టు నెలలో సమ్మె చేసిన సందర్భంగా నెలకు 8,500 రూపాయలు ఇస్తామని పత్రికాముఖంగా ప్రకటించారని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, సిఐటియు నిజామాబాద్‌ జిల్లా కమిటీ అధ్యక్షులు పి.వెంకటేష్‌ అన్నారు. కెసిఆర్‌ ప్రకటించిన వేతనాలు సంవత్సరం గడిచినా ఇప్పటికీ అమలు చేయడంలేదని, ఇకనైనా పంచాయతీ కార్మికులకు న్యాయం చేయాలని ...

Read More »

పిచ్చిమొక్కలను తొలగించిన వార్డుసభ్యులు

రెంజల్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలోని ఒకటో వార్డులోకి వెళ్లే దారిలో పూర్తిగా పిచ్చి మొక్కలు మొలవడంతో అటువైపు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు గురవ్వడంతో సమస్యను గుర్తించిన సర్పంచ్‌ సునీత వార్డు సభ్యులతో కలిసి సోమవారం జేసిబీ సహాయంతో పిచ్చిమొక్కలను తొలగించి రోడ్డును శుభ్రపరిచారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివ చరణ్‌, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, వార్డు సభ్యులు క్రాంతి కుమార్‌, నాగమణి, నారాయణ రెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకులు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా నవీన్‌

రెంజల్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారత విద్యార్థి పరిషత్‌ జిల్లా కన్వీనర్‌గా నల్ల నవీన్‌ కుమార్‌ను నియమించినట్లు ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు రెంజర్ల నరేష్‌ తెలిపారు. తమపై నమ్మకంతో జిల్లా కన్వీనర్‌గా నియమిచినందుకు రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలిపారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి అనునిత్యం ముందుండి పోరాడుతానన్నారు.

Read More »

ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలి

నందిపేట్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ఆద్వర్యంలో సోమవారం నందిపేట్‌ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్లాస్టిక్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి నందిపేట సర్పంచ్‌ ఎస్‌.జి.వాణి తిరుపతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని ఉద్బోదించారు. ప్లాస్టిక్‌ పర్యావరణానికి ప్రమాదకరంగా మారిందన్నారు. ప్లాస్టిక్‌ నిర్మూలనకు కషి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి ...

Read More »

విఠలేశ్వర ఆలయంలో అన్నదానం

బీర్కూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బీర్కూర్‌ మండలంలోని భైరపూర్‌ గ్రామంలోని విటలేశ్వర్‌ ఆలయంలో మాజి జడ్పీటీసీ ద్రోణావల్లి సతిష్‌ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జడ్పిటిసి తనుబుద్ధి స్వరూప శ్రీనివాస్‌, ఎంపీపీ రఘు, ఎంపీటీసీ సందీప్‌ పటేల్‌, కోఆప్షన్‌ ఆరీఫ్‌, బహిరపూర్‌ తెరాస పార్టీ గ్రామ అధ్యక్షుడు రామకష్ణ గౌడ్‌, తెరాస మండల నాయకులు నారం శ్రీను, గంగరాజు గౌడ్‌, లాడేగం గంగాధర్‌, యటా విరేశం, పడితే నారాయణ, భైరపూర్‌ గ్రామ యువకులు తెరాస పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

పంట పొలాలను సందర్శించిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు

ఆర్మూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ కళాశాల పోలాస విద్యార్ధులు మంగళవారం ఆర్మూర్‌ మండలంలోని గోవింద్‌పేట్‌, సుర్భిర్యాల గ్రామాల్లో గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మకత తులనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో బాగంగా విద్యార్ధులు చిత్రీకరించిన వసతులు, వనరులు, పంటల విస్తీర్ణం, వివిధ సంస్థలు, వాటి నిర్వహణ విధులు, నెలకొని ఉన్న పరిస్తితులు, సమస్యలు, వాటికీ అనుగునమైన పరిష్కారమార్గాల గురించి చర్చించారు. అనంతరం క్షేత్ర సందర్శనలో బాగంగా ఏరువాక కేంద్ర సీనియర్‌ శాస్త్రవేత్త నవీన్‌ కుమార్‌ వరి పంట పొలాలను సందర్శించారు. ...

Read More »

భక్తి శ్రద్దలతో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో రాబోవు వినాయక చవితి సందర్బంగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించే మండపాలకు బీజేపీ తరుపున ప్రసాదంగా ఇచ్చే లడ్డు తయారీకి కామారెడ్డి పట్టణంలోని రామ మందిరములో సోమవారం పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ హిందువులు సామూహికంగా భక్తి శ్రద్ధలతో వాడ వాడల్లో నిర్వహించుకునే పండగల్లో వినాయక చవితి ఒకటని, బాల గంగాధర్‌ తిలక్‌ స్వతంత్ర ఉద్యమంలో ...

Read More »

నోటుపుస్తకాల పంపిణీ

నందిపేట్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌ ఉర్దూ హైస్కూల్‌లో సోమవారం లయన్స్‌ క్లబ్‌ నందిపేట్‌ అద్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అంతకు ముందు ఏర్పాటు చేసిన సభలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు గోపీనాథ్‌ మాట్లాడుతూ పిల్లలు తమ ఉన్నత లక్ష్యాలు ఛేదించడానికి, ఉన్నత ఆశయాలను పెంపొందించుకోవాలని కోరారు. అప్పుడే వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని, బాల్యంనుండే పట్టుదలతో చదివి ఐఏఎస్‌, ఐపిఎస్‌ లాంటి పెద్ద ఆశయాలతో ముందుకు ...

Read More »

అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసరుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామ పరిదిలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ సోమలింగేశ్వర ఆలయం వద్ద రూ. 27 లక్షలతో నూతనంగా నిర్మాణం చేసిన కళ్యాణమండపం, రూ.10 లక్షలతో ఇతర వసతులు, రూ. 25 లక్షలతో మిషన్‌ భగీరధ పథకం ద్వారా మంచినీటి సౌకర్యాలను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు, అదికారులు పాల్గొన్నారు.

Read More »