Breaking News

Daily Archives: August 27, 2019

మట్టి గణపతుల తయారీపై అవగాహన

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజాసైన్స్‌ వేదిక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జిల్లా గ్రీన్‌ కోర్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జలాలు కాలుష్యం కాకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా జిల్లా కేంద్రంలోని మోడరన్‌ పబ్లిక్‌ హై స్కూల్‌లో మట్టి గణపతుల తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని అందమైన మట్టి గణపతులను తయారుచేసి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్‌ హాజరై పర్యావరణాన్ని ...

Read More »

హిందీ శిక్షక్‌ సమితి కార్యవర్గం ఏర్పాటు

కామరెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందీ శిక్షక్‌ సమితి వ్యవస్థాపకులు గఫూర్‌ శిక్షక్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా యం.ఎ.బషీర్‌, వంశీధర్‌, మహిళా ప్రతినిధిగా రఫీయా సుల్తానాలను ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా పూర్ణచందర్‌రావు, జ్యోత్స్న, పంచశీల, కార్యదర్శులుగా అంజయ్య, అబ్దుల్‌ నబీ, స్వప్న ప్రియ, షాహిన్‌ సుల్తానా, కోశాధికారిగా సంతోష్‌, జిల్లా కౌన్సిలర్‌లుగా బాబురావు, దిలీప్‌కుమార్‌, సక్కుబాయిలను ఎన్నుకున్నారు. హిందీ భాషాభివృద్ధికి, భాషా పండితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ ...

Read More »

ఎమ్మెల్సీకి సన్మానం

నిజాంసాగర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల నూతనంగా ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌ రెడ్డిని శాసనమండలిలో కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. సుఖేందర్‌రెడ్డిని కలిసినవారిలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినటర్‌ వెంకటరామిరెడ్డి ఉన్నారు.

Read More »

వార్షిక పరీక్ష ఫలితాలు విడుదల

నిజాంసాగర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు జూన్‌ 2019లో నిర్వహించిన సర్టిఫికెట్‌ మరియు డిప్లమా వార్షిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని నిజామాబాద్‌ శ్రీజ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపాల్‌ దేవులపల్లి ప్రశాంత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా పరీక్షలకు 57 మంది విద్యార్థులు హజరుకాగా 37 మంది విద్యార్థులు ఉత్తీర్ణత చెందారని తెలిపారు. సర్టిఫికెట్‌ విభాగంలో..కర్ణాటక గాత్ర సంగీతంలో 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఐదుగురు ...

Read More »

మండల ఎంపిటిసిల ఫోరం ఎన్నిక

ఆర్మూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఆర్మూర్‌ మండల ఎంపీటీసీల ఫోరమ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఫోరమ్‌ అధ్యక్షులుగా ఎం.సి.గంగారెడ్డి ఉపాధ్యక్షులుగా గొల్ల గంగారాం, ప్రధాన కార్యదర్శి సామేర సురేష్‌, కార్యదర్శి బాల నర్సయ్య, కోశాధికారి కొక్కుల హన్మాండ్లు, వీరితో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా మొత్తం 11 మందితో కార్యవర్గ ఫోరమ్‌ ఎన్నుకోవడం జరిగింది. ఫోరమ్‌ పార్టీలకు అతీతంగా సమష్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సహకారంతో మండలాన్ని అభివద్ధి చేయడానికి కషి చేయాలని ఎంపిపి పస్క ...

Read More »

మిషన్‌ కాకతీయ గుంతలో పడి మహిళ మతి

నిజాంసాగర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలోని కన్నాపూర్‌ గ్రామానికి చెందిన నిజని సావిత్రి (30) పొలంలో నాటు వేయడానికి వెళ్లి మిషన్‌ కాకతీయ గుంతలో కాలు జారి పడి మతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గతంలో బతుకు దెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లిన సావిత్రి భర్త మరణించడంతో కన్నాపూర్‌ గ్రామంలో కూలి పని చేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషిస్తుంది. కాలం కావడంతో తండ్రి లేక తల్లి వారికి కూలి పని చేసి ఆలనా ...

Read More »

గణేష్‌ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 2 నుండి 12 వరకు జరిగే గణేష్‌ ఉత్సవాలకు ఆ తర్వాత జరిగే జెండా జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంయుక్త కలెక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. గణేష్‌ ఉత్సవాలు, జెండా జాతరను పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయతో కలిసి ఉత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ...

Read More »

సమస్యలు తెలుసుకున్న ప్రజాప్రతినిధులు

బీర్కూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బీర్కూర్‌ పట్టణంలో మాజి జడ్పిటిసి ద్రోణావల్లి సతిష్‌ ఎస్‌సి కాలనీలో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని, అలాగే తాను చెప్పిన మాట ప్రకారం ఇక్కడే ఉంటూ బీర్కూర్‌ పట్టణ అభివద్ధి కొరకు పాటు పడతానని మరొకసారి గుర్తుచేశారు. కార్యక్రమంలో బీర్కూర్‌ సర్పంచ్‌ కుమారి స్వప్న, గంగారాం ఎంపిటిసి సందీప్‌ పటేల్‌, కోఆప్షన్‌ ఆరీఫ్‌, పట్టణ అధ్యక్షుడు దుంపలరాజు, కొరిమే రఘు, తెరాస పార్టీ యువనాయకులు ...

Read More »