Breaking News

Daily Archives: August 28, 2019

రైతుల ఉద్యమానికి తమ పూర్తి మద్దతు

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీమంత్రి, మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్ట్‌, మిషన్‌ కాకతీయ కమీషన్లపై ఉన్న ధ్యాస, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేద్దామన్నా ఆలోచన తప్ప ప్రభుత్వం ఎలా నడపాలి, రైతులకు ఏమి అవసరముంది, రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుంది, ప్రజల అవసరాలు ఏమున్నాయి, పాలనాపరంగా అస్సలు పట్టించుకోవడం ...

Read More »

గురువారం డిగ్రీ కళాశాలల బంద్‌

కామరెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలకు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునివ్వడం జరిగిందని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. దక్షిణ ప్రాంగణంలో నూతన కోర్సులను ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం కామారెడ్డి జిల్లా డిగ్రీ కళాశాల బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. బిక్కనూరు దక్షిణ ప్రాంగణంలో నూతన కోర్సులను ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా లోని డిగ్రీ కళాశాలల బంద్‌కు పిలుపునివ్వడం ...

Read More »

నేషనల్‌ ఫెలోషిప్స్‌ విడుదల చేయాలి

కామరెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ ఫెలోషిప్స్‌ విడుదలచేయాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్‌ కళాశాల నుండి అడ్మినిస్టేషన్‌ బిల్డింగ్‌ వరకు ర్యాలీగా వెళ్తూ పరిశోధక విద్యార్థులు భిక్షాటన చేశారు. అనంతరం యూజీసీ డీన్‌ ప్రొ.శివరాజ్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ విద్యార్థులు మాట్లాడుతూ ఫెలోషిప్స్‌ రాక భిక్షాటన చేశామని అన్నారు. భిక్షాటన వల్లనైన కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు. ఆర్థిక పరంగా పరిశోధక విద్యార్థులు పరిశోధనలు చేయలేక ...

Read More »

అయ్యప్ప ఆలయంలో అన్నదానం

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం అయ్యప్ప దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరిపారు. కీర్తి శేషులు చీల జగదీశ్వర్‌ వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు చీల నరేందర్‌ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Read More »

శ్రీవారిని దర్శించుకున్న టిఆర్‌ఎస్‌ నాయకులు

రెంజల్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కళ్యాపూర్‌ సర్పంచ్‌ కాశం నీరంజని సాయిలు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గంతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌, తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కవిత ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారని సర్పంచ్‌ తెలిపారు. వారి వెంట ఉపసర్పంచ్‌ బొర్గాం జలయ్య, రైతు సమన్వయసమితి మండల అధ్యక్షుడు కాశం ...

Read More »

రూ.2.20 కోట్ల అభివృద్ది పనులు ప్రారంభం

కామరెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బీబీపేట్‌ మండలంలోని బీబీపెట్‌ మండల కేంద్రం, యాడారం, శివార్‌ రాంరెడ్డి పల్లి గ్రామాల్లో సుమారు రూ.2.20 కోట్లతో చేపట్టిన పలు అభివద్ధి కార్యక్రమాలకు బుధవారం ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పనులు నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారులకు సూచించారు.

Read More »

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

నిజాంసాగర్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలంలోని అల్లాపూర్‌ గ్రామానికి చెందిన వడ్ల దుర్గయ్యకు వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే హన్మంత్‌ సిందే 94,000 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును పిట్లం ఎంపిపి కవిత విజయ్‌, పిట్లం మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు వాసరి రమేష్‌ చేతుల మీదుగా దుర్గయ్యకు అందజేశారు. చెక్కును మంజూరు చేసిన ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేకు అల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల తరపున ...

Read More »

ప్రభుత్వ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అందిస్తున్న రుణాలను ఐకెపి ద్వారా అందిస్తున్న స్త్రినిధి రుణాలను వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎంపీపీ లోలపు రజినీ అన్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు జమున అధ్యక్షతన మండల సమాఖ్య 13వ మహాజన సభను బుధవారం నిర్వహించారు. ఎంపీపీ రజినీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధించి అన్ని రంగాల్లో అభివద్ధి చెందాలంటే మహిళ సంఘాలలో సభ్యులుగా ఉంటేనే అన్ని రంగాల్లో అభివద్ధి చెందవచ్చన్నారు. ప్రభుత్వం అందించే అన్నిరకాల ...

Read More »

పెంచిన ట్రాఫిక్‌ చలాన్లను తెలంగాణలో అమలు చేయొద్దు

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం మోటార్‌ వెహికిల్‌ చట్టంలొ మార్పులు చేసి, వాహన దారులపై విపరీతంగా ట్రాఫిక్‌ చార్జీలను పెంచి వసూలు చేయడాన్ని ఏఐటియుసి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య అన్నారు. ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులు చేయకుండా, రోడ్లను వెడల్పు చేసి పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయకుండా, ప్రజల ఆర్థిక పరిస్థితులను గమనంలో తీసుకోకుండా వాహన దారులపై వేల రూపాయల జరిమానాలు, శిక్షలు విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బిల్లును వెనక్కి ...

Read More »

ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి

ఆర్మూర్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) ఆర్మూర్‌ డివిజన్‌ కమిటీ అధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు నరేందర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతామని 2104 అసెంబ్లీ సమావేశాలలో అప్పటి విద్యాశాఖ ...

Read More »

ఆకుల లలిత కుటుంబాన్ని పరామర్శించిన షబ్బీర్‌ అలీ

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత మామ వెంకట నరసయ్య గతవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా లలిత కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, నాయకులు తాహెర్‌బిన్‌ హందాన్‌, కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, నిజామాబాద్‌ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డిలు పరామర్శించారు.

Read More »

కస్తూర్బా పాఠశాల తనిఖీ

రెంజల్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను బుధవారం ఎంపీపీ లోలపు రజినీ, జడ్పీటీసీ మేక విజయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత ఉండాలని సూచించి వంటగదిని పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి ప్రభుత్వ బడిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాద్యాయులు కషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంతోష్‌, మాజీ ఎంపిటిసి కిషోర్‌, ప్రిన్సిపాల్‌ మమత, ...

Read More »