Breaking News

Daily Archives: August 30, 2019

ఉద్యోగ భద్రత కల్పించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర, జిల్లా, మండల కేంద్రంలోని విద్యా శాఖ పరిధిలో విద్యాశాఖ ఎంఆర్‌సి కార్యాలయంలో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు ఉద్యోగులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పిఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, హెచ్‌ఆర్‌ అమలు చేయాలని, అధికారుల వేధింపుల నుంచి రక్షించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు శుక్రవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ...

Read More »

హరితహారం లక్ష్యం వెంటనే పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం లక్ష్యాలను వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీడీవోలతో పలు విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హరితహారం లక్ష్యం పూర్తికావాల్సి ఉన్నదని ఎంపీడీవోలు కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు కనీసం 85 శాతం తక్కువ కాకుండా మొక్కలు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవో మొదలుకొని గ్రామస్థాయిలో టిఏలు, ...

Read More »

బస్టాండ్‌లో వ్యక్తి మృతి

నందిపేట్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ బస్టాండ్‌లో అనుకోకుండా వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్‌ నుంచి గాదేపల్లికి వెళుతున్న కిష్టయ్య అనే వ్యక్తి బస్టాండ్‌కు రాగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కిందపడి మరణించాడు. కిష్టయ్య స్వగ్రామం ధర్మపురి మండలం గాదేపల్లి అని తెలిసింది.

Read More »

రక్తదానం ప్రాణదానం

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పోతంగల్‌ గ్రామానికి చెందిన సుగుణ రక్తహీనతతో బాధ పడడంతో వారికి బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కామారెడ్డి పట్టణంలోని లిటిల్‌ స్కాలర్‌ పాఠశాల కోఆర్డినేటర్‌ ప్రసాద్‌ రక్తదానం చేశారు. అదే పాఠశాలకు చెందిన రమేష్‌ కూడా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడడం జరిగింది. వీరికి కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయినట్లయితే 9492874006 కు ...

Read More »

కార్మికులకు న్యాయం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గరిపల్లి శేకరయ్య వస్త్ర దుకాణ వ్యాపారంలో గత 15 సంవత్సరాలుగా గుమస్తాలుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస సమాచారం ఇవ్వకుండా షాపు మూసివేసి కార్మికుల ఉపాధిని రోడ్డున వేశారని కార్మికులకు రావలసిన చట్టపరమైన హక్కులకోసం డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ ఉమ్మడి జిల్లా అధికారి చతుర్వేదికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఐసీటియు జిల్లా బాధ్యులు రాజలింగం మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా వస్త్ర వ్యాపారం చేస్తున్న గర్రెపల్లి శేకరయ్య అండ్‌ ...

Read More »

టీఆర్‌ఎస్‌ మండల కమిటీ ఎన్నిక

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన కామారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కమిటీ ఎన్నికల కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ విజి గౌడ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని అన్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, గ్రామ కమిటీల ఎన్నికలు పూర్తి చేసి నేడు నియోజకవర్గంలోని మండలాల కమిటీలను ...

Read More »

గ్రామాల్లో స్వచ్ఛత పాటించాలి

నిజాంసాగర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలంలోని వెలుట్ల గ్రామంలో స్వచ్‌ సర్వేక్షన్‌లో భాగంగా వెల్లుట్ల కామారెడ్డి అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ పాల్గొని స్వచ్‌ సర్వేక్షన్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లోని స్వచ్ఛత అందరూ పాటించాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ దేవేందర్‌, ఎంపీపీ, ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్‌ పాల్గొన్నారు.

Read More »

మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ పరిశీలన

నిజాంసాగర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణ పరిధిలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ను తెలంగాణ విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్‌ ధనరాజ్‌తో కలిసి శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలో పాల ఉత్పత్తి పై సమీక్ష నిర్వహించారు. కంగ్టి మండలం తడ్కల్‌ పాల సేకరణ కేంద్రాన్ని పైలట్‌ ప్రాజెక్టు క్రింద తీసుకొని అక్కడ పాలు పోసే లబ్ధిదారులకు రోజు వారీగా డబ్బులు అందేవిధంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో జిల్లా ...

Read More »

రెంజల్‌ ఆసుపత్రిని తనిఖీచేసిన డిఎంహెచ్‌ఓ

రెంజల్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్యాధికారి సుదర్శనం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలను వైద్యాధికారి క్రిస్టినా అడిగి తెలుసుకున్నారు. కుష్ఠు వ్యాధి, కేసీఆర్‌ కిట్లకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపర్చలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో వెంకటరమణ, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Read More »

రైతులకు న్యాయం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో తహసీల్‌ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యములో రైతు బంధు, రుణ మాఫీ, భూప్రక్షాళన చేయనందుకు నిరసనగా మాచారెడ్డి మండల రైతులు ధర్నా చేపట్టారు. మండుటెండలో సుమారు అరగంట పాటు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ముఖ్యఅతిగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు భూప్రక్షాళన చేసి పాస్‌ బుక్‌లు అందచేయాలని, రైతుబంధు డబ్బులు వెంటనే విడుదల ...

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఆర్మూర్‌ మండలంలోని గగ్గుపల్లి, అంకాపూర్‌, గోవిందుపేట్‌ గ్రామాల్లో సీఎం రీలీఫ్‌ ఫండు చెక్కుల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో ఎంపిపి పస్క నర్సయ్య పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండల ప్రజలకు కష్టకాలంలో సీఎం రిలీఫ్‌ ఫండు ద్వారా సహాయం చేస్తున్నారని, ప్రత్యేక దష్టిపెట్టి లబ్ధిదారులకు లాభం చేకూర్చేలా కషి చేస్తున్నారని గుర్తుచేశారు. ఎంపీటీసీల ఫోరమ్‌ అధ్యక్షులు ఎంసి గంగారెడ్డి, గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు తెరాస నాయకులు ...

Read More »

ఆర్మూర్‌ శాంతి కమిటీ సమావేశం

ఆర్మూర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండల పరిధిలో శుక్రవారం క్షత్రియ కళ్యాణ మండపంలో వినాయక చవితి పండుగను దష్టిలో పెట్టుకొని శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ శాఖల అదికారులు పాల్గొని మాట్లాడారు. ఆర్మూర్‌ ఏసిపి అందె రాములు మాట్లాడుతూ గణేష్‌ పండగను ప్రజలు శాంతి యుతంగా నిర్న్వహించుకోవాలని, ఎలాంటి సంఘర్షణలకు తావివ్వదని, ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని అయన సూచించారు. ఆర్మూర్‌ తహసీల్దార్‌ రాణా ప్రతాప్‌ సింగ్‌ మాట్లాడుతూ గణేష్‌ మండపాల ...

Read More »

మానస స్కూల్‌లో మాక్‌ ఎన్నికల సందడి

ఆర్మూర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలోని మానస స్కూల్‌లో విద్యార్థులకు మాక్‌ ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ మానస గణేష్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో విద్యార్థి దశ నుండి ఎన్నికలపై అవగాహన చాలా అవసరమన్నారు. విద్యార్థులు కేవలం పుస్తకాలు చదువుటకు పరిమితం కాకుండా సమాజాన్ని కూడా చదవాలని సూచించారు. సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యులు కావాలన్నారు. విద్యావంతులు నిస్వార్ధ పరులు రాజకీయ రంగప్రవేశం చేస్తే దేశం అన్ని రంగాల్లో త్వరిత ...

Read More »

మిడ్‌ మానేర్‌ వేదికగా గర్జించిన ప్రతిపక్షాలు

నిజాంసాగర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోయిన్‌ పల్లి మండలంలోని కొదురుపాక గ్రామం వద్ద నిర్వహించిన ముంపు బాధితుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌ రెడ్డి, జన సమితి అధ్యక్షులు కోదండరాం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, వివేక్‌, అసెంబ్లీ పక్షనేత దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్‌ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ...

Read More »

ఘనంగా ఎడ్లపొలాల అమావాస్య

రెంజల్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో శ్రావణమాసం చివరి రోజు కావడంతో శుక్రవారం ఎడ్లపొలాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ పండుగకు ప్రజలు తమ పశువులకు స్నానాలు ఆచరించి రంగురంగులతో అలంకరించి హనుమాన్‌ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఇలా ప్రదక్షిణలు చేయడం ద్వారా పశువులకు మేలు జరుగుతుందని, పాడిపంటలు సమృద్దిగా పండుతాయని ప్రజలు ఆనవాయితీగా పండుగను జరుపుకుంటారు.

Read More »

పిఆర్‌టియు గోడప్రతుల ఆవిష్కరణ

రెంజల్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలకేంద్రంలోని యంఆర్‌సి కార్యాలయం వద్ద పిఆర్‌టియు తలపెట్టిన సత్యాగ్రహ దీక్ష పోస్టర్లను శుక్రవారం పిఆర్‌టియు అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం, సాయరెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా అపరిష్కతంగా ఉన్న సమస్యలను సాధించడానికీ పెన్షన్‌ విద్రోహ దినం అయిన సెప్టెంబర్‌ 1న సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగిందని, దీక్షకు ఉపాద్యాయులు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. అపరిష్కతంగా ఉన్న సమస్యలు సిపిఎస్‌ రద్దు, ఏకీకత సర్వీసు రూల్స్‌, ...

Read More »