Breaking News

అజాగ్రత్త వహిస్తే ఉపేక్షించేది లేదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామ పంచాయితీ ప్రత్యేక ప్రణాళికలో ప్రభుత్వం నిర్దేశించిన అంశాల వారీగా ప్రగతి సాధించని పక్షంలో నిర్లక్ష్యం అజాగ్రత్త వహించిన అధికారులపై ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక వెనుకబడిన గ్రామాల కార్యదర్శులు, అధికారులు, సంబంధిత ఎంపీడీవోలు, మండల గ్రామ స్పెషల్‌ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

గ్రామాలలో, మండల కేంద్రాలలో నాణ్యతతో కూడిన సమర్థవంతమైన పనులను చేపట్టాలని సూచించారు. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా వ్యక్తిగతంగా మండలం కేంద్రాలు, కొన్ని గ్రామాలను పర్యటించి పరిశీలించడం జరిగిందని, గతంలో కంటే మిన్నగా కొంచెం మెరుగైన ప్పటికి అంతకంటే ఎక్కువగా పూర్తి చేసి పచ్చదనం పరిశుభ్రంగా స్పష్టంగా కనబడే విధంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కొందరు అధికారులు శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడంలేదని, ఇకనైనా వారిలో మార్పులు రాని పక్షంలో కఠినంగా వ్యవహరించడంలో వెనుకాడేది లేదన్నారు. పరిసరాల పరిశుభ్రత శానిటేషన్‌, వైకుంఠ దామం, డంపింగ్‌ యార్డ్‌లో వాడకం చేపట్టాలని, గ్రామానికి ఎన్ని వైపుల రోడ్లు ఉన్నాయో వాటి గ్రామ ప్రవేశ ముందు ఏలాంటి చెత్త గాని డంపింగ్‌ యాడ్‌ గాని ఉండకూడదని ప్లాస్టిక్‌ పేపర్‌ను సేకరించి అట్టి మొత్తాన్ని ఒక ప్రదేశంలో వేసి రీసైక్లింగ్‌ కోసం నగరపాలక కమిషనర్‌కు అందజేయాలని అధికారులను ఆదేశించారు.

పచ్చదనం పరిశుభ్రత కోసం ఎలాంటి నిధులను ఖర్చు చేయకుండా ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు. అందరు కలిసి గ్రామంలో పాదయాత్రలో ఎక్కువ ప్రయోజనం పొందే ఎంపిక చేసిన పనులను చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని, గ్రామ సభలో అందరి సమక్షంలో నిర్ణయించిన పనులకు మాత్రమే నిధులను ఖర్చు చేయాలని సూచించారు. పెట్టిన ఖర్చులు గ్రామ సభలో తప్పని సరిగా ఆమోదం పొందాలని చెప్పారు.

గ్రామంలో పవర్‌ హాలిడే సందర్భంగా విద్యుత్‌ స్తంభాలకు మూడో లేదా లూజ్‌ వైర్‌ ఏర్పాటుకు ముందుగా మండల కేంద్రాలకు పెద్దపెద్ద గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఇచ్చియుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని, అదేవిధంగా వీధిలైట్ల కోసం ఎల్‌ఈడి బల్బులను అమర్చాలని చెప్పారు. నూతన గ్రామపంచాయతీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి యెట్టి పరిస్థితిలో విద్యుత్‌ బకాయిలు ఉండకూడదని, గ్రామ పంచాయతీలకు వీధిలైట్ల కోసం వాటర్‌ వర్క్స్‌ కోసం మీటర్లు లేనిపక్షంలో అమర్చాలని చెప్పారు.

అంతకుముందు జిల్లాలో ఉన్న పెండింగ్‌ విద్యుత్‌ బిల్లులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా చెల్లించడం జరుగుతుందని చెప్పారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయి నుండి 100 మంది బందంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎప్పుడైనా ఎక్కడైనా పర్యవేక్షిస్తారని, వచ్చే నెలలో ముఖ్యమంత్రి కూడా జిల్లా పర్యటనకు రానున్నందున ముఖ్యంగా ప్రధాన రోడ్లు పక్కనగల గ్రామాలు ముఖ్యంగా ఎడపల్లి, మాక్లూర్‌, బాల్కొండ, మోపాల్‌, కమ్మర్‌పల్లి, డిచ్‌పల్లి మండల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు.

జిల్లాను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు కషిచేయాలని, అందుకు మండల గ్రామస్థాయిలో ప్లాస్టిక్‌ కవర్లను సేకరించి అట్టి మొత్తాన్ని తిరిగి దాన్ని రీసైక్లింగ్‌ గాని వేరే విధంగా జిల్లా కేంద్రంలో చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు, అందులో భాగంగా ఇప్పటి వరకు నిజామాబాద్‌ నగరంలో 11 టన్నులు బోధన్‌ ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో ఐదు టన్నుల వరకు కలెక్ట్‌ చేయడం జరిగిందని చెప్పారు.

ప్రతి ఇంటికి డస్ట్‌ బిన్‌ను పంపిణీ చేయాలని, అవసరమైతే తడి పొడి చెత్తకు ఒక్కొక్కటి డస్ట్‌ బిన్‌ చేయాలని, ముందుగా పరిశుభ్రత సానిటేషన్‌పై అవగాహన కల్పించి చెత్తను పడేసేందుకు అవసరమైన వసతి సౌకర్యం కల్పించినప్పటికీ చెత్తను ఇష్టారీతిన పడవేసిన పక్షంలో జరిమానా విధించాలని చెప్పారు. ప్రతిరోజు చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డ్‌లోనే వేయాలని గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా మొక్కలు నాటాలని, అదేవిధంగా ప్రతి ఇంటికి అందించే మొక్కలలో వేప చెట్టు, పండ్ల చెట్ల తో పాటుగా దోమలు ప్రారదొలే పదిహేను రకాలైన మొక్కలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు.

గ్రామం చుట్టూ ఎన్ని రహదారులు ఉన్నా ప్రవేశం వద్ద ఎలాంటి చెత్త కుప్పలు వేయవద్దని, అంతేకాకుండా డంపింగ్‌ యార్డ్‌లను ఏర్పాటు చేయకూడదని చెప్పారు. ప్రవేశద్వారం వద్ద ఆహ్వానించి నట్టుగా పచ్చదనం పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఎఫ్‌ఓ, జడ్పీ సీఈవో గోవిందు, డిఆర్‌డిఓ రాథోడ్‌ రమేష్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డిప్యూటీ సీఈఓ కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తే ఈజీగా అమ్ముకోవచ్చు…

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రైతు రాష్ట్రంలోని ఇతర ప్రాంత రైతుల‌కు ఆదర్శవంతంగా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *